For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Prince Trailer review.. అనుదీప్ మార్క్ ఫన్.. శివకార్తీకేయన్ ఎమోషన్స్..ఇండియావైడ్ ట్రెండింగ్‌

  |

  శ్రీ వెంకటేశ్వర సినిమా ఎల్ఎల్‌పీ, సురేష్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ప్రిన్స్. సునీల్ నారంగ్, పుష్కర్ రామ్మోహన్ రావు, డీ సురేష్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రానికి జాతిరత్రాలు ఫేమ్ అనుదీప్ కేవీ దర్శకత్వం వహిస్తున్నాడు. దీపావళీ కానుకగా రిలీజ్ అవుతున్న ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను ఇటీవల రిలీజ్ చేయగా ట్రెండింగ్‌గా మారింది. ఈ ట్రైలర్ వివరాల్లోకి వెళితే..

  బ్రిటిష్ అమ్మాయికి, తెలుగు అబ్బాయి లవ్

  బ్రిటిష్ అమ్మాయికి, తెలుగు అబ్బాయి లవ్


  ప్రిన్స్ ట్రైలర్ విషయానికి వస్తే.. బ్రిటిష్ అమ్మాయికి, తెలుగు అబ్బాయి ప్రేమ కథ నేపథ్యంగా.. సామాజిక సమస్యలు, ఎడ్యుకేషన్, గ్రామీణ రాజకీయాలు, కులం, మతం అంశాలను జోడించి సినిమాను రూపొందించినట్టు స్పష్టమంది. సీరియస్ అంశాలకు తోడుగా ఫన్ అంశాలు ట్రైలర్‌లో కనిపించాయి. అనుదీప్ కేవీ మార్క్‌కు భిన్నంగా ఈ సినిమా ఉందనే విషయం ట్రైలర్‌ చెప్పింది.

  లవ్, ఫన్, సీరియస్ అంశాలతో

  లవ్, ఫన్, సీరియస్ అంశాలతో

  గ్రామలో కులం, మతాల ఘర్షణల నేపథ్యంలో సత్యరాజ్ పాత్ర ఎమోషనల్‌గా కనిపించింది. ఇక శివకార్తీకేయన్.. టీచర్ పాత్రలో కనిపిస్తారనేది ట్రైలర్‌లో కనిపించింది. ఇక బ్రిటీష్ అమ్మాయితో శివకార్తీకేయన్‌ ప్రేమ ఊరికి సమస్యలు తెచ్చిపెట్టిందనే అంశం సినిమాకు ఆకర్షణగా మారేలా కనిపించింది. లవ్, ఫన్, సీరియస్ అంశాల మధ్య ప్రేక్షకుడిని ఆలోచింపజేసే పాయింట్ సినిమాలో ఉందనే విషయం ట్రైలర్ కలుగజేసింది.

   ఫన్నీగా అనుదీప్ డైలాగ్స్

  ఫన్నీగా అనుదీప్ డైలాగ్స్


  ప్రిన్స్ ట్రైలర్‌లో డైలాగ్స్ మరో ఎట్రాక్షన్‌గా నిలిచాయి. ఎమ్మెల్యే, ఎంపీకి ఓటేస్తారా? మేయర్‌ అంటే మీకు తెలుసా? అని అంటే.. 18 ఏళ్లు దాటిన వారిని మేయర్ అంటారని ఓ యువకుడు సమాధానం ఇస్తే.. వారిని మేయర్ కాదు.. మేజర్ అంటారు అనే డైలాగ్స్ బాగున్నాయి. మా పాపకు ఎలిజబెత్ టేలర్ అని పెట్టాడు.. ఓ టైలర్ కూతురు టైలర్ కావాల్సిందేనా అంటూ అమాయకంగా అడిగే ప్రశ్నలు ఫన్ క్రియేట్ చేశాయి. ఇక గ్రామంలో రెండు వర్గాల మధ్య మత ఘర్షణలు జరిగితే.. సత్యరాజ్.. ఇద్దరి చేతులకు వాతపెట్టి.. రక్తం ఏ రంగులో ఉందని అడిగే డైలాగ్స్ కథలో ఎంత సీరియస్ నెస్ ఉందో తెలియజెప్పింది.

  ఫీల్‌గుడ్ ప్రేమకథలో శివకార్తీకేయన్

  ఫీల్‌గుడ్ ప్రేమకథలో శివకార్తీకేయన్


  ప్రిన్స్ మూవీతో శివకార్తీకేయన్ మరో ఇంట్రెస్టింగ్ కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నట్టు ట్రైలర్ స్పష్టం చేసింది. ఆల్ ఇండియన్స్ మై సిస్టర్.. బ్రదర్స్ అని భావించాను కాబట్టే.. నేను బ్రిటీష్ అమ్మాయిని ప్రేమించాను అని శివకార్తీకేయన్ చెప్పడం ఫన్‌తోపాటు ఫీల్‌గుడ్‌గా అనిపించింది. ఊరు, పట్టణం, దేశం, మతం దాటేసి.. వేరే కంట్రీ అమ్మాయిని ప్రేమించేశావు కదరా అని సత్యరాజ్ చెప్పడం బట్టి.. ప్రేమకథనే సినిమాకు కాన్‌ఫ్లిక్ట్ అనేదిట ట్రైలర్ స్పష్టం చేసింది.

  యూట్యబ్‌లో నెంబర్ 1గా

  యూట్యబ్‌లో నెంబర్ 1గా


  ప్రిన్స్ ట్రైలర్ ప్రస్తుతం యూట్యూబ్ ఇండియాలో నెంబర్ 1 స్థానంలో ట్రెండింగ్‌గా మారింది. ఇప్పటికే ఈ ట్రైలర్ 5 మిలియన్లకుపైగా వ్యూస్‌ సాధించింది. శివకార్తీకేయన్, అనుదీప్ కాంబినేషన్‌ భారీ హిట్ కొట్టడం ఖాయమనే ఫీలింగ్‌ను ప్రిన్స్ ట్రైలర్ కల్పించింది. ప్రస్తుతం ట్రైలర్ మాత్రం సినిమాపై అంచనాలు పెంచేసింది.

  తెరవెనుక, తెర ముందు


  నటీనటులు: శివకార్తీకేయన్, మారియా రియాబోష్పాక విజయన్, సత్యరాజ్ తదితరులు
  దర్శకత్వం: అనుదీప్ కేవీ
  కథ: అనుదీప్ కేవీ, మోహన్ సాటో
  మ్యూజిక్: థమన్ ఎస్
  సినిమాటోగ్రాఫర్: మనోజ్ పరమహంస
  నిర్మాతలు: సునీల్ నారంగ్, రామ్మెహన్ రావు, సురేష్ బాబు
  బ్యానర్: శ్రీ వెంకటేశ్వర సినిమా ఎల్ఎల్‌పీ, సురేష్ ప్రొడక్షన్స్
  రిలీజ్ డేట్: 2022-10-21

  English summary
  Prince Trailer review: Sivakarthikeyan's movie is set release for Diwali. Anudeep KV is the director. Which is produced by Sunil Narang, Ram mohan Rao and D Suresh Babu Here is the trailer review.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X