For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  చిరంజీవి సినిమాలో బాలీవుడ్ బ్యూటీ: ఆ పాత్ర కోసం రూ. 3.50 కోట్ల రెమ్యూనరేషన్

  |

  దాదాపు నలభై ఏళ్లుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో టాప్ హీరోగా వెలుగొందుతున్నారు మెగాస్టార్ చిరంజీవి. స్వయంకృషితో సినిమాల్లోకి వచ్చిన ఆయన.. తనలోని అద్భుతమైన టాలెంట్‌తో చాలా తక్కువ సమయంలోనే స్టార్‌గా ఎదిగిపోయాడు. అప్పటి నుంచి వెనుదిరిగి చూడకుండా తన ప్రయాణాన్ని సాగిస్తున్నారు. కొన్నేళ్ల క్రితం రాజకీయాల కోసం సినిమాలకు బ్రేకిచ్చిన చిరంజీవి.. 'ఖైదీ నెంబర్ 150'తో రీఎంట్రీ ఇచ్చారు. దీని తర్వాత 'సైరా: నరసింహా రెడ్డి' అనే సినిమా చేశారు. ఇక, ప్రస్తుతం ఆయన రామ్ చరణ్‌తో కలిసి 'ఆచార్య' అనే మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే.

  SR Kalyanamandapam 5Days Collections: చిన్న మూవీకి రికార్డు కలెక్షన్లు.. అప్పుడే అన్ని కోట్ల లాభాలు

  సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తోన్న 'ఆచార్య' పట్టాలపై ఉండగానే మెగాస్టార్ చిరంజీవి కొన్ని ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకున్నారు. ఈ మూవీ తర్వాత ఆయన మలయాళ సూపర్ హిట్ మూవీ 'లూసీఫర్'ను రీమేక్ చేస్తున్నారు. దీని అనంతరం మెహర్ రమేష్ దర్శకత్వంలో తమిళంలో బంపర్ హిట్ అయిన 'వేదాళం' చిత్రాన్ని తెలుగులోకి రీమేక్ చేయబోతున్నారు. ఇవన్నీ పూర్తైన తర్వాత చిరంజీవి.. వరుస విజయాలతో దూసుకెళ్తోన్న టాలెంటెడ్ డైరెక్టర్‌గా పేరొందిన కేఎస్ రవీంద్ర అలియాస్ బాబీతోనూ సినిమా చేయనున్నారు. ఈ విషయాన్ని చిరంజీవే వెల్లడించారు.

  Sonakshi Sinha Demand Rs 3.50 Crore for Chiranjeevi K. S. Ravindra Movie

  బాబీ సినిమా అంటే అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుంది. ఇప్పటి వరకూ అతడు చేసిన ప్రతి సినిమా అలాగే ఉంది. ఇప్పుడు చిరంజీవితో చేసే సినిమా కూడా అదే మాదిరిగా ఉంటుందని తెలుస్తోంది. ఇటీవల బయటకు వచ్చిన విషయం ప్రకారం.. ఈ మూవీ ఓ స్టార్ హీరోకు, అభిమానికి మధ్య జరిగే కథతో రూపొందుతుందట. సినిమా హీరో, అభిమాని మధ్య జరిగే ఎమోషనల్ డ్రామాగా రూపొందనుంది. చిరు హీరో పాత్ర చేస్తుండగా.. అభిమాని రోల్ కోసం మరో యంగ్ హీరోను తీసుకోబోతున్నారని తెలుస్తోంది. ఆ పాత్ర కోసం హీరోలను అన్వేషిస్తున్నారట.

  Sonakshi Sinha Demand Rs 3.50 Crore for Chiranjeevi K. S. Ravindra Movie

  ఈ సినిమా పట్టాలెక్కేందుకు చాలా సమయమే ఉన్నప్పటికీ.. దీనికి సంబంధించిన కాస్టింగ్‌పై అప్పుడే దృష్టి సారించాడు దర్శకుడు బాబీ. ఇందులో భాగంగానే ఈ మూవీలో మెగాస్టార్ చిరంజీవికి జోడీగా నటించే హీరోయిన్ గురించి వెతుకులాట మొదలెట్టాడట. తాజా సమాచారం ప్రకారం.. ఈ మూవీలో ఫీమేల్‌ లీడ్‌గా నటించేందుకు బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హాను సంప్రదించినట్లు తెలిసింది. ఇప్పటికే దీనికి సంబంధించిన కథను కూడా దర్శకుడు ఆమెకు వివరించాడనే టాక్ వినిపిస్తోంది. ఈ కథ పట్ల ఆమె సంతృఫ్తిగా ఉందని కూడా ఓ న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ అవుతోంది.

  Bigg Boss Telugu 5 సుడిగాలి సుధీర్‌కు బిగ్ బాస్ దిమ్మతిరిగే ఆఫర్: ఆ స్టార్ హీరో రేంజ్‌లో!

  Sonakshi Sinha Demand Rs 3.50 Crore for Chiranjeevi K. S. Ravindra Movie

  ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందనున్న ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం సోనాక్షి సిన్హా ఏకంగా రూ. 3.50 కోట్లు రెమ్యూనరేషన్‌గా డిమాండ్ చేసిందని ఓ న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. అంత మొత్తం ఇస్తేనే ఆమె ఈ సినిమాలో చేస్తానని చెప్పినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. దీంతో చిత్ర యూనిట్ పునరాలోచనలో పడినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అసలు ఇంతకీ సోనాక్షి సిన్హాను తీసుకున్నారా? లేదా? అన్నది మాత్రం క్లారిటీ రావట్లేదు. మొత్తానికి ఈ న్యూస్ అటు బాలీవుడ్‌లో, ఇటు టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అవుతోంది.

  English summary
  Megastar Chiranjeevi Now Doing Acharya with Koratala Shiva. After That He will do a Movie Under K. S. Ravindra Direction. Sonakshi Sinha Roped for This Movie.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X