For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  నువ్వే దిక్కన్న మెహర్ రమేష్.. వెంటనే సాయం చేసిన సోనూసూద్!

  |

  ఈ మధ్యకాలంలో సినిమా వాళ్ళలో ప్రజలు ఎక్కువగా ప్రేమిస్తున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే అది సోనూసూద్ అని చెప్పక తప్పదు.. సాధారణంగా తెలుగు సినిమాల్లో విలన్ తరహా పాత్రలు పోషించే ఈ నటుడు కరోనా కారణంగా రియల్ హీరోగా మారిపోయాడు. వెనుక ఆస్తులు ఉన్నాయో లేదో తెలియదు కానీ సహాయం అంటూ అడిగిన వారికి కాదనకుండా ఆయన సాయం చేస్తున్నారు.

  ఒక రకంగా చెప్పాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సమాంతరంగా ఒక వ్యవస్థ నడిపిస్తూ ఎవరు ఏమడిగినా కాదనకుండా సాయం చేస్తున్నాడు. అయితే తాజాగా తెలుగు దర్శకుడు మెహర్ రమేష్ నువ్వే దిక్కు సోనూసూద్ అంటూ ఒక విజ్ఞప్తి చేయగా క్షణాల్లో దాన్ని పరిష్కరించాడు ఆయన.

  ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన దాదాపు అందరు నటీనటులు టెక్నీషియన్స్ కరోనా పేషెంట్స్ కి అవసరమైన ఐసీయూ బెడ్స్, ప్లాస్మా, ఆక్సిజన్ సిలిండర్ల గురించి ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే మెహర్ రమేష్ కూడా వెంకట రమణ అనే ఒక పేషెంట్ కోసం కొన్ని ఇంజక్షన్స్, మెడిసిన్స్ కావాలని చాలా ప్రయత్నాలు చేశారు.

  Sonu Sood arranged medicines on Meher Ramesh request

  కానీ ఎక్కడా అవి దొరికే పరిస్థితి కనిపించలేదు. దీంతో ఆయన వెంటనే సోనూసూద్ ను ట్విట్టర్లో ట్యాగ్ చేసి ''సోనూ భాయ్ అర్జెంట్గా పొడుగు వెంకటరమణ అనే పేషెంట్ కోసం టోసిలిజంబ్ 400 మి.గ్రా, 1 టాబ్ బారిసిటినిబ్ 4 ఎంజి, 3 రెమిడిసివిర్ ఇంజెక్షన్లు కావాలి నేను నా వంతు ప్రయత్నం చేశాను కానీ నాకు దొరకలేదు కాబట్టి నువ్వు నీ సోనూసూద్ ఫౌండేషన్ మాత్రమే ఇప్పుడు ఏకైక దిక్కు, మీరే ఏమైనా చేయగలరు అని ఆయన అర్ధించారు.

  Sonu Sood arranged medicines on Meher Ramesh request

  అలా అడిగారో లేదో కేవలం 24 గంటల్లో సోనూసూద్ మెడిసిన్స్ ను దర్శకుడికి అందజేశారు.ఈ విషయాన్ని తెలియజేస్తూ సూపర్ హ్యూమన్, భూమికి గాడ్ బ్రదర్ అంటూ సోనూసూద్ పై మెహర్ రమేష్ ప్రశంసల వర్షం కురిపించారు. నిజానికి దర్శకుడు మెహర్ రమేష్ అడిగిన టోసిలిజంబ్ 400 mg ఇంజక్షన్ ను నిన్న వైజాగ్ లో 12 లక్షలకు పెట్టి కొందరు కొన్నారు.

  పేషెంట్ వెంకట రమణ తాలూకా వారికి 5 లక్షలకు విక్రయిస్తామని చెప్పారు. అయితే నిజానికి దీని ధర బయట 40 వేలు. కానీ బయట ఇది దొరకడం లేదట. ఇష్టానుసారంగా బ్లాక్ లో విక్రయిస్తున్న కారణంగా అంట పెట్టి కొనే స్తోమత అందరికీ ఉండదు. ఇటువంటి పరిస్థితుల్లో అడిగిన వెంటనే అంత ఖరీదైన ఇంజక్షన్, మెడిసిన్ ను సోనూసూద్ ఉచితంగా అందజేయడంతో వెంకట రమణకు టైమ్ తో పాటు డబ్బు సేవ్ అయ్యిందని అంటున్నారు.

  English summary
  Everybody is aware of the oxygen shortage, and covid essential medicines shortage all over India. Poor people are struggling to get proper medicine for Corona patients. Meanwhile persons like Sonu Sood helping them by providing free medicines for needy. Recently tollywood director meher Ramesh urged Sonu sood for few medicines and remdesivir injections. within hours of time Sonu sood team sent those medicines to the patient. meher ramesh thanked sonu sood for his quick response.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X