సోనూను కలిసేందుకు ఎవరూ చేయని సాహసం.. ఏకంగా 700 కిమీ చెప్పులు లేకుండా !

కరోనా దేశంలోకి ఎంటర్ కాక ముందు వరకు సోనూసూద్ ఒక నటుడిగా అందులోనూ ఎక్కువగా విలన్ పాత్రలు పోషించే నటుడిగానే అందరికీ తెలుసు. కానీ ఎప్పుడైతే కరోనా లాక్ డౌన్ మొదలైందో అప్పటి నుంచి ఆయన జనానికి సేవ చేస్తూ రియల్ హీరోగా మారిపోయాడు. తర్వాత కోవిడ్ పరిస్థితి కాస్త కుదుట పడినా సరే ఆయన తన సేవా కార్యక్రమాలు ఏమాత్రం తగ్గించకుండా ప్రజలకు కష్టం అంటే తానున్నానంటూ అండగా నిలుస్తున్నారు.

ఇక రెండో దశ కరోనా చెలరేగిపోయిన నేపధ్యంలో కూడా ఆయన ఎక్కడికక్కడ ఆక్సిజన్ ప్లాంట్ లు, ఆక్సిజన్ బ్యాంకులు ఏర్పాటు చేసి సేవ అందిస్తున్నారు. ఇక అందుకే ఆయనకు రోజు రోజుకీ ఫ్యాన్స్ పెరిగిపోతున్నారు. అయితే ఆయన సేవ చేస్తున్న సేవలకు ఫ్యాన్ గా మారిన ఒక యువకుడు ఎవరూ చేయని సాహసం చేశారు. సినీనటుడు సోనూసూద్​ను కలవడానికి వికారాబాద్​ నుంచి ముంబయికి ఓ యువకుడు పాదయాత్రగా వెళ్ళాడు. సోనూసూద్​ సాయం కోసం ముంబయికి ఏకంగా కాలినడకన వెళ్ళాడు ఆయన.

 sonu soods fan walked barefoot from Hyderabad to Mumbai sonu urges not to do suchthings

వికారాబాద్ జిల్లా డోర్నపల్లికి చెందిన వెంకటేశ్ జూన్ 1న తన పాదయాత్ర ప్రారంభించారు. ఈఎంఐ కట్టలేకపోవడం వల్ల తన తండ్రి ఆటోను ఫైనాన్స్ కంపెనీ సీజ్ చేసిందని వెంకటేష్ ఆవేదన వ్యక్తం చేశాడు. తమ వాహనాన్ని తిరిగిపొందడానికి సోనూసూద్ సాయం చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

 sonu soods fan walked barefoot from Hyderabad to Mumbai sonu urges not to do suchthings

ఇక అభిమానితో ఫోటో దిగి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్న సోనూ సూద్, 700 కిలోమీటర్లు నడిచి వచ్చిన తన అభిమానిని చూసి చలించిపోయాడు. అంతే కాక దయచేసి ఎవ్వరూ ఇలాంటి పనులు చేయొద్దు అని సోనూ సూద్ కోరారు. ఇక ఆ యువకుడికి సోనూ అండగా ఉంటానని హామీ ఇచ్చినిట్టు సమాచారం. వికారాబాద్ జిల్లా నుంచి జూన్ 1న పాదయాత్ర ప్రారంభించిన వెంకటేశ్ పదో రోజున ముంబై చేరారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X