For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ‘రాజ రాజ చోర’ నుంచి అదిరిపోయే న్యూస్: రేపటి నుంచి వాటిలోనూ ప్రదర్శన

  |

  చిన్న చిన్న పాత్రలతో కెరీర్‌ను ప్రారంభించి, ఆ తర్వాత హీరోగా మారాడు టాలెంటెడ్ గాయ్ శ్రీవిష్ణు. స్వయంకృషితో సినిమాల్లోకి వచ్చినా.. తనలోని టాలెంట్‌తో చాలా తక్కువ సమయంలోనే మంచి గుర్తింపును అందుకున్నాడు. ఈ క్రమంలోనే విలక్షణమైన నటనతో వైవిధ్యమైన సినిమాలు చేస్తూ సత్తా చాటుతున్నాడు. హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా ప్రాజెక్టులను పట్టాలెక్కించే ఈ హీరో ప్రతి చిత్రంలోనూ అద్భుతమైన నటనను కనబరుస్తూ వన్ మ్యాన్ షోలుగా మార్చేస్తున్నాడు. దీంతో ఈ యంగ్ హీరో సినిమా సినిమాకూ ఎంతో పరిణితిని పొందుతున్నాడు.

  టాప్‌ను కిందకు జరిపి షాకిచ్చిన భూమిక: మరీ ఇంత ఘాటుగానా.. ఆమెనిలా చేస్తే తట్టుకోలేరు!

  శ్రీవిష్ణు ఇప్పటికే 'గాలి సంపత్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఎన్నో అంచనాల నడుమ వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ ముందు దారుణంగా బోల్తా పడింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడతను నటించిన మూవీనే 'రాజ రాజ చోర'. నూతన దర్శకుడు హసిత్ గోలి తెరకెక్కించిన ఈ సినిమాలో మేఘా ఆకాశ్ హీరోయిన్‌గా నటించింది. వివేక్ సాగర్ దీనికి సంగీతం అందించాడు. పుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లపై టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మించారు. ఈ చిత్రం ఆగస్టు 19న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయింది.

  Sree Vishnus Raja Raja Chora Theaters Increase in USA From Today

  సాధారణంగా శ్రీవిష్ణు నటించిన సినిమా అంటే సామాన్య ప్రేక్షకుల్లో మంచి అభిప్రాయం ఉంటుంది. కచ్చితంగా అతడు వైవిధ్యమైన కథనే ఎంపిక చేసుకుంటాడని, యాక్టింగ్‌తో అదరగొడతాడని అంతా అనుకుంటారు. అలాగే 'రాజ రాజ చోర' విషయంలోనూ జరిగింది. దీంతో ఈ సినిమాపై ఆరంభం నుంచే అంచనాలు ఏర్పడ్డాయి. అదే సమయంలో టీజర్, ట్రైలర్ వాటిని రెట్టింపు చేసేశాయి. దీంతో దీనికి భారీ ఓటీటీ డీల్స్ కూడా వచ్చాయి. కానీ, ఈ చిత్రాన్ని థియేటర్లలోనే విడుదల చేస్తున్నారు. ఇక, ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా జరిగినట్లు ట్రేడ్ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి.

  ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోన్న రాశీ ఖన్నా హాట్ సెల్ఫీ: గతంలో చూడని విధంగా అందాల ఆరబోత

  శ్రీవిష్ణు సినిమాలకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుంటుంది. అలాగే, అందరు హీరోల అభిమానులు కూడా ఆదరిస్తుంటారు. అందుకే 'రాజ రాజ చోర' సినిమాను ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేశారు. ఈ చిత్రం నైజాంలో 400, ఆంధ్రప్రదేశ్ మొత్తంలో 200 థియేటర్లలో విడుదలైంది. అలాగే, యూఎస్‌లోనూ దాదాపు వందకు పైగా లొకేషన్లలో ప్రదర్శితమవుతోంది. ఈ చిత్రం సూపర్ హిట్ టాక్‌ను తెచ్చుకోవడంతో పాటు ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ కావడంతో దీనికి అమెరికాలో ఒకింత ఎక్కువగానే రెస్పాన్స్ దక్కుతోందని తెలుస్తోంది.

  ఈ మధ్య కాలంలో ఫన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన చిత్రం 'రాజ రాజ చోర'నే అని టాక్ వినిపిస్తోంది. ఈ కారణంగానే రెండో రోజు నుంచే అమెరికాలో దాదాపు ముప్పై లొకేషన్లలో థియేటర్ల సంఖ్యను పెంచినట్లు ఓ న్యూస్ బయటకు వచ్చింది. అన్ని చోట్లా ఇప్పటికే దాదాపు హౌస్ ఫుల్ అయిపోయినట్లు తెలుస్తోంది. ఓవర్సీస్‌లోనే కాదు.. ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో కూడా మూత పడిన థియేటర్లను తెరిచి 'రాజ రాజ చోర' సినిమా థియేటర్లను పెంచుతున్నట్లు సమచారం. దీంతో ఈ రెండు రోజుల్లో ఈ సినిమా కలెక్షన్లు మరింత ఎక్కువగా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

  English summary
  Tollywood Talented Hero Sree Vishnu Recently Did Raja Raja Chora Movie Under Hasith Goli Direction. In This Movie Megha Akash Playing Female Lead. This Film Theaters Increased in USA From Today.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X