For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  20 ఏళ్ల అమ్మాయితో రవితేజ రొమాన్స్: టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అవుతోన్న కుర్ర హీరోయిన్

  |

  బ్యాగ్రౌండ్ లేకపోయినా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు మాస్ మహారాజా రవితేజ. ఇలా కెరీర్ ఆరంభంలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో చిత్రాల్లో నటించాడు. ఆ తర్వాత హీరోగా మారాడు. ఆరంభంలో అంతగా విజయాలను అందుకోలేకపోయిన అతడు.. ఆ తర్వాత వరుస హిట్లను సొంతం చేసుకుంటూ సత్తా చాటాడు. ఈ క్రమంలోనే టాలీవుడ్‌లో స్టార్ హీరోగా ఎదిగిపోయాడు. అప్పటి నుంచి వెనుదిరిగి చూడని ఈ మాస్ హీరో.. జయాపజయాలతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలోనే ఈ ఏడాది ఆరంభంలో 'క్రాక్' అనే మూవీతో కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.

  హాట్ హాట్ ఫోజులతో కాజల్ అగర్వాల్: పెళ్లైన తర్వాత తొలిసారి ఇంత ఘాటుగా.. ఆమెనిలా చూస్తే తట్టుకోలేరు!

  సంక్రాంతి కానుకగా వచ్చిన 'క్రాక్' మూవీ సూపర్ డూపర్ హిట్ అవడంతో మాస్ మహారాజా రవితేజ రెట్టించిన ఉత్సాహంతో కనిపిస్తున్నాడు. ఈ క్రమంలోనే వరుస పెట్టి ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తున్నాడు. ఆ వెంటనే రమేష్ వర్మ దర్శకత్వంలో 'ఖిలాడీ' అనే సినిమా స్టార్ట్ చేశాడు. సస్పెన్స్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ సినిమాలో రవితేజ డబుల్ రోల్ చేస్తున్నాడు. మీనాక్షి చౌదరి, డింపుల్‌ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. పెన్‌ స్టూడియోస్‌ సమర్పణలో హవీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాక్‌స్టార్‌ దేవి శ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. ఇది ఎప్పుడో విడుదల కావాల్సి ఉన్నా కోవిడ్ సెకెండ్ వేవ్ కారణంగా వాయిదా పడిపోయింది.

  Sreeleela Fix for Ravi Teja and Trinadha Rao Nakkina Movie

  'ఖిలాడీ' మూవీకి ఆటంకం ఏర్పడడంతో రవితేజ.. శరత్ మందవా అనే దర్శకుడితో 'రామారావు ఆన్ డ్యూటీ' అనే చిత్రాన్ని మొదలెట్టాడు. ఇది కూడా చాలా వరకూ చిత్రీకరణను పూర్తి చేసుకుంది. దీంతో దీన్ని కొద్ది రోజుల పాటు ఆపేసి.. మళ్లీ 'ఖిలాడీ'ని పున: ప్రారంభించాడు. ఈ రెండు చిత్రాలు కొద్ది రోజుల్లోనే టాకీ పార్ట్‌ను కంప్లీట్ చేసుకుంటాయి. అంటే రవితేజ పూర్తిగా ఖాళీ అయిపోతాడు. ఈ నేపథ్యంలో ఈ మాస్ హీరో తన తదుపరి సినిమాను కూడా ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నాడని తెలుస్తోంది. దీన్ని ఫ్యామిలీ చిత్రాల దర్శకుడు త్రినాథరావు నక్కిన తెరకెక్కించబోతున్నాడనే టాక్ వినిపిస్తోంది.

  Samantha Naga Chaitanya Divorce: పెళ్లికి ముందే చెప్పిన వేణు స్వామి.. సమంతకు ఆ సమస్య అంటూ!

  నిజానికి త్రినాథరావు నక్కినకు చాలా రోజుల క్రితమే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు రవితేజ. వీళ్లిద్దరి కలయికలో మూవీ 'క్రాక్' తర్వాత మొదలవుతుందని అంతా అనుకున్నారు. కానీ, కుదరలేదు. ఇలాంటి పరిస్థితుల్లో దీన్ని వచ్చే అక్టోబర్ నుంచి ప్రారంభించాలని భావిస్తున్నారట. అంతేకాదు, ఆ నెలలో ఒకటవ తేదీ నుంచే ఈ సినిమాను మొదలు పెట్టబోతున్నారట. ఇక, తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో 20 ఏళ్ల కన్నడ బ్యూటీ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుందట. ఇందుకోసం ఆమెకు ఏకంగా రూ. 70 లక్షలు రెమ్యూనరేషన్ ఇస్తున్నారని తెలుస్తోంది. దీంతో ఈ బ్యూటీ పేరు టాలీవుడ్‌లో ఓ రేంజ్‌లో మారుమ్రోగిపోతోంది.

  శ్రీలీల కన్నడంలో పలు చిత్రాల్లో హీరోయిన్‌గా నటించింది. ఇక, శ్రీకాంత్ కుమారుడు రోషన్ హీరోగా వస్తున్న 'పెళ్లిసందD' అనే మూవీతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇది ఇంకా ప్రేక్షకుల ముందుకు రాలేదు. అయినప్పటికీ ఈ కుర్ర భామ అప్పుడే పలు అవకాశాలను కూడా అందుకుంటూ హాట్ టాపిక్ అవుతోంది.

  English summary
  Mass Maharaj Ravi Teja Now Doing Khiladi and Ramarao On Duty. After These Movies He Will do a film Under Trinadha Rao Nakkina. Sreeleela Fix for This Movie.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X