For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Nootokka Jillala Andagadu: విడుదలైన 20 రోజులకే ఓటీటీలోకి.. ఎందులో స్ట్రీమింగ్ కాబోతుందంటే!

  |

  తెలుగు సినీ ఇండస్ట్రీలో విలక్షణమైన నటనతో ప్రేక్షకులను మాయ చేస్తోన్న నటులు చాలా తక్కువ మందే ఉన్నారు. అలాంటి వారిలో యాక్టర్ కమ్ డైరెక్టర్ అవసరాల శ్రీనివాస్ ఒకడు. స్వయంకృషితో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఇతగాడు.. చాలా తక్కువ సమయంలోనే సహజ సిద్ధమైన నటనతో మంచి గుర్తింపును అందుకున్నాడు. తద్వారా వరుస ఆఫర్లను కూడా సొంతం చేసుకుంటూ సత్తా చాటుతున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవల 'నూటొక్క జిల్లాల అందగాడు' అనే ప్రయోగాత్మక చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇది విడుదలైన కొద్ది రోజులకే ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతుంది. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

   ‘నూటొక్క జిల్లాల అందగాడు'గా అవసరాల

  ‘నూటొక్క జిల్లాల అందగాడు'గా అవసరాల

  అవసరాల శ్రీనివాస్ హీరోగా చేసిన తాజా చిత్రమే ‘నూటొక్క జిల్లాల అందగాడు'. రాచకొండ విద్యా సాగర్ తెరకెక్కించిన ఈ మూవీలో రుహానీ శర్మ హీరోయిన్‌గా నటించింది. దీన్ని శ్రీ వెంక‌టేశ్వర క్రియేష‌న్స్‌, ఫ‌స్ట్ ఫ్రేమ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్స్‌పై దిల్‌రాజు, డైరెక్టర్ క్రిష్ స‌మ‌ర్పణ‌లో శిరీష్, రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగ‌ర్లమూడి నిర్మించారు. శక్తికాంత్ కార్తీక్ సంగీతం అందించాడు.

  బ్రా ఒక్కటే ధరించి విష్ణుప్రియ రచ్చ: ఇంతకు ముందెన్నడూ చూడనంత ఘాటు ఫోజులతో!

  ప్రధాన సమస్యను హైలైట్ చేసి సినిమాగా

  ప్రధాన సమస్యను హైలైట్ చేసి సినిమాగా

  ప్రస్తుతం పరిస్థితుల్లో ఎక్కువ మంది బాధ పడుతోన్న సమస్యల్లో బట్టతల ఒకటి. దీన్ని ప్రధానాంశంగా తీసుకుని తెరకెక్కించిన చిత్రమే ‘నూటొక్క జిల్లాల అందగాడు'. ఆరంభంలోనే వివాదం జరిగినట్లు చూపించి అవసరాల శ్రీనివాస్ దీనిని ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లాడు. ఆ తర్వాత ట్రైలర్, టీజర్, పోస్టర్లతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. దీంతో ఈ చిత్రంపై ఆసక్తి పెరిగింది.

  అంచనాలు పెంచేశారు... అన్నీ గ్రాండ్‌గానే

  అంచనాలు పెంచేశారు... అన్నీ గ్రాండ్‌గానే

  అవసరాల శ్రీనివాస్‌కు హీరోగా తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా మార్కెట్ లేదు. కానీ, ‘నూటొక్క జిల్లాల అందగాడు'లో అతడి లుక్స్ చూసిన తర్వాత ఈ సినిమాకు మంచి బిజినెస్ జరిగినట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపించింది. అలాగే, బడా సంస్థలు నిర్మిస్తుండడం కారణంగానే ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 300 థియేటర్లలో విడుదలైంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది గ్రాండ్ రిలీజ్ అని అనొచ్చు.

  షర్ట్ మొత్తం విప్పేసిన సీరియల్ నటి: లోదుస్తులు కూడా లేకుండా మరీ పచ్చిగా కనిపించడంతో!

  మూవీకి స్పందన మాత్రం అలా రావడంతో

  మూవీకి స్పందన మాత్రం అలా రావడంతో

  ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘నూటొక్క జిల్లాల అందగాడు' సినిమాకు ఆశించిన స్థాయిలో ఆదరణ దక్కడం లేదు. మొదటి రోజే మిక్స్‌డ్ టాక్‌ను అందుకున్న ఈ చిత్రం.. వీకెండ్‌లో ప్రేక్షకుల థియేటర్లకు రప్పించడంలో అష్ట కష్టాలు పడింది. అయినప్పటికీ అవసరాల శ్రీనివాస్ రేంజ్‌ కంటే ఎక్కువ కలెక్షన్లే వచ్చాయి. మరి ముందు ముందు ఎలా ఉంటుందో చూడాలి.

  విడుదలైన 20 రోజులకే ఓటీటీలో స్ట్రీమింగ్

  విడుదలైన 20 రోజులకే ఓటీటీలో స్ట్రీమింగ్

  ఈ మధ్య కాలంలో ఓటీటీ సంస్థల హవా కనిపిస్తోంది. మిగిలిన భాషలతో పోలిస్తే తెలుగులో కూడా ఈ సంస్థలన్నీ కొత్త సినిమాలను సొంతం చేసుకుంటూ సత్తా చాటుతున్నాయి. ఈ క్రమంలోనే ‘నూటొక్క జిల్లాల అందగాడు' సినిమాను కూడా ఓ ప్రముఖ సంస్థ డిజిటల్ స్ట్రీమింగ్ చేయనుంది. అది కూడా ఇది విడుదలైన 20 రోజులకే. అంటే సెప్టెంబర్ 23 నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుందట.

  హాట్ షోతో షాకిచ్చిన అనన్య నాగళ్ల: అందాలన్నీ కనిపించేలా తెలుగమ్మాయి ఘాటు ఫోజులు

  Happy birthday Balakrishna:Twitter lights up as fans & celebs celebrate actor's day|Filmibeat Telugu
  అందులో స్ట్రీమింగ్ కానున్న అవసరాల మూవీ

  అందులో స్ట్రీమింగ్ కానున్న అవసరాల మూవీ

  సెప్టెంబర్ 3న విడుదలైన ‘నూటొక్క జిల్లాల అందగాడు' మూవీ 23న స్ట్రీమింగ్ కాబోతుందని తాజాగా ఓ న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ సంస్థ అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుందని తెలిసింది. ఇందుకోసం సదరు సంస్థ భారీ మొత్తాన్ని చెల్లించినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. అందుకే త్వరగా స్ట్రీమింగ్ చేయనున్నారని సమాచారం.

  English summary
  Tollywood Talented Hero Srinivas Avasarala Recently Did Nootokka Jillala Andagadu Movie Under Rachakonda Vidya Sagar. This Movie OTT Streaming From September 23rd.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X