మెగా, నందమూరి అభిమానులకు రాజమౌళి షాక్.. RRR రిలీజ్ డేట్ మళ్లీ మార్చేశాడు..

Recommended Video

RRR Release Date Change | RRR On January 8th 2021 | RRR Update

'బాహుబలి' తర్వాత RRR రూపంలో మరో భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు దర్శకధీరుడు రాజమౌళి. గత కొంతకాలంగా ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. భారీ హంగులతో ఫ్యాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ చేసింది చిత్రయూనిట్. ఆ వివరాలు చూద్దామా..

భారీ మల్టీస్టారర్.. రాజమౌళి స్పెషల్ ఫోకస్

భారీ మల్టీస్టారర్.. రాజమౌళి స్పెషల్ ఫోకస్

టాలీవుడ్ ఘనత, తోలుగోడి సత్తా ప్రపంచానికి చాటిచెప్పిన జక్కన్న RRR సినిమాతో మరో సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు రెడీ అవుతున్నారు. రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కుతున్న ఈ భారీ మల్టీస్టారర్ సినిమాపై రాజమౌళి స్పెషల్ ఫోకస్ పెడుతున్నారు. ఈ నేపథ్యంలో షూటింగ్ కాస్త ఆలస్యమవుతూ వచ్చింది.

350 కోట్ల భారీ బ‌డ్జెట్‌.. జక్కన్న స్కెచ్

350 కోట్ల భారీ బ‌డ్జెట్‌.. జక్కన్న స్కెచ్

దాదాపు రూ.350 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో రూపొందుతోన్న `RRR` మూవీకి డీవీవీ దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఎక్కడా ఖర్చుకు వెనకాడకుండా రాజమౌళికి ఆయన పూర్తి సహకారం అందిస్తున్నారు. అన్ని సన్నివేశాలు కూడా చాలా గ్రాండ్ గా ఉండేలా రాజమౌళి వేసిన స్కెచ్.. అలాగే అమలు చేస్తూ వస్తున్నారట.

RRR కొత్త రిలీజ్ డేట్

RRR కొత్త రిలీజ్ డేట్

దీంతో ప్రస్తుతం ఎక్కడ చూసినా RRR సినిమా గురించే చర్చించుకుంటున్నారు. చిత్ర షూటింగ్ ప్రారంభంలోనే ఈ సినిమా విడుదల 2020 జులై 30 న ఉంటుందని తెలిపారు రాజమౌళి. కానీ పరిస్థుతుల ప్రభావం కారణంగా రిలీజ్ డేట్ వాయిదా పడిందని వార్తలు వచ్చాయి. తాజాగా ఆ వార్తలు నిజం చేస్తూ కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్ చేసింది RRR టీమ్.

మొత్తానికి ఇలా ఫిక్సయ్యారు

మొత్తానికి RRR యూనిట్ ఈ ఏడాది సినిమా విడుదల చేయట్లేదని కన్ఫర్మ్ చేసింది. ఈ మేరకు 2021 జనవరి 8న RRR మూవీ విడుదల కానుందని పేర్కొంటూ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. దీంతో లేటుగా వచ్చినా లేటెస్టుగా మా హీరోలు వస్తారంటూ మెగా, నందమూరి అభిమానులు ఖుషీ అవుతున్నారు.

ఎన్టీఆర్, రామ్ చరణ్

ఎన్టీఆర్, రామ్ చరణ్

RRR సినిమాలో తెలంగాణ విప్ల‌వ వీరుడు కొమురం భీమ్ పాత్ర‌లో ఎన్టీఆర్ నటిస్తుండగా, మ‌న్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్ర‌లో రామ్ చ‌ర‌ణ్ న‌టిస్తున్నారు. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్‌ స్టార్ ఒలివియా మోరిస్‌ నటిస్తోంది. అలాగే రామ్ చ‌ర‌ణ్ సరసన ఆలియా భ‌ట్‌ నటిస్తోంది. అజ‌య్ దేవ‌గ‌ణ్‌, స‌ముద్ర‌ఖ‌ని, అలిస‌న్ డూడి, రే స్టీవెన్ స‌న్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X