For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Prabhas 25: చారిత్రాత్మక నేపథ్యంతో మరో పాన్ ఇండియా మూవీ.. క్రేజీ టైటిల్‌తో దిల్ రాజు మాస్టర్ ప్లాన్!

  |

  రెబల్ స్టార్ ప్రభాస్ సాహో సినిమా అనంతరం వెండితెరకు చాలా గ్యాప్ వచ్చింది. అనుకోకుండా వచ్చిన ఈ గ్యాప్ తో ప్రభాస్ కొంత స్పీడ్ పెంచాడు అనే చెప్పాలి. అయితే కరోనా కారణంగా రాధేశ్యామ్ సినిమాతో పాటు మరి కొన్ని సినిమాల షూటింగ్స్ కూడా చాలా ఆలస్యంగా కొనసాగాయి. అభిమానులను ప్రభాస్ కాస్త ఎక్కువగానే వెయిట్ చేస్తున్నాడని తెలుస్తోంది. ఇక నెక్స్ట్ రాధేశ్యామ్ సినిమాతో సందడి చేయనున్న ప్రభాస్ ఆ తర్వాత మరిన్ని సినిమాలతో బిజీ కానున్నాడు. అయితే ప్రస్తుతం మరో రెండు ప్రాజెక్టులకు వీలైనంత త్వరగా స్టార్ట్ చేయాలని చూస్తున్నట్లు టాక్ వస్తోంది. దిల్ రాజుతో ఇప్పటికే కమిట్మెంట్ ఇవ్వడంతో ఆ నిర్మాత ప్రభాస్ సినిమా కోసం ఒక విభిన్నమైన టైటిల్ ను కూడా ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..

   బాక్సాఫీస్ వద్ద పోటీగా..

  బాక్సాఫీస్ వద్ద పోటీగా..


  రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాదేశ్యామ్ సినిమాకు ఫినిషింగ్ టచ్ ఇస్తున్న విషయం తెలిసిందే. రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ విభిన్నమైన ప్రేమ కథను యు.వి.క్రియేషన్స్ 300 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని అనుకున్నారు. పోటీగా పవన్ కళ్యాణ్ మహేష్ బాబు వంటి బడా హీరోల సినిమాలు ఉన్నప్పటికీ. అదే సమయంలో రావాలి అని ఫిక్స్ అయ్యారు. దీంతో బాక్సాఫీసు వద్ద భారీ యుద్ధ వాతావరణం నెలకొంది.

  మరోక రెండు సినిమాలు

  మరోక రెండు సినిమాలు

  ప్రభాస్ సలార్ సినిమా షూటింగ్ కూడా వీలైనంత త్వరగా పూర్తిచేసి సలార్, ఆది పురుష్ సినిమాలకు కూడా ఫినిషింగ్ టచ్ చేయడానికి సిద్ధమవుతున్నాడు. అయితే ఈ మూడు సినిమాల్లో అయిపోయిన వెంటనే ప్రభాస్ మరొక రెండు సినిమాల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుపోతున్నాడు. మరోవైపు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఒక సైన్స్ ఫిక్షన్ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఆ సినిమా షూటింగ్ పనులను కూడా మొదలు పెట్టేశారు.

  దిల్ రాజుతో 25వ సినిమా

  దిల్ రాజుతో 25వ సినిమా

  ఇక అన్నిటికంటే కీలకమైన 25వ సినిమాపై కూడా ప్రభాస్ ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకున్నట్లు తెలుస్తోంది. మొదట సినిమా యూవీ క్రియేషన్స్ లోనే 25వ సినిమా చేయాలని అనుకున్నారు. కానీ అంతకు ముందుగానే దిల్ రాజుకు ఇచ్చిన కమిట్మెంట్ వలన ఒక సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. ఇక ఫైనల్ గా 25వ సినిమా ఆప్షన్ వస్తుండటంతో ప్రభాస్ తో దిల్ రాజు 2023 చివరలో ఒక సినిమాను స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాడు.

  దర్శకుడు ఎవరు?

  దర్శకుడు ఎవరు?

  ఇది ఎంతవరకు నిజమో అనే అన్న విషయం తెలియదు కానీ ముందు గాని టైటిల్ విషయంలో మాత్రం ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. దర్శకుడు, సంగీత దర్శకుడు, హీరోయిన్ ఎవరు అనే విషయం మాత్రం బయటకు చెప్పకుండా దిల్ రాజు లో లోపల ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక దర్శకుడు ఎవరనే విషయం తెలియక ముందే ఒక ఇంట్రెస్టింగ్ టైటిల్ ను ప్రభాస్ కోసం ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఆ టైటిల్ మరేదో కాదు వ్రిందావన.

  Prabhas Special Interview With Sridevi Soda Center Team
  వ్రిందావన అంటే అర్థమిదే..

  వ్రిందావన అంటే అర్థమిదే..

  ఈ టైటిల్ ఎక్కడో విన్నట్లు అనిపిస్తుంది కానీ చాలా డిఫరెంట్ గా ఉంది. సినిమా కూడా పిరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. వ్రిందావన అనే టైటిల్ ను రిజిస్ట్రేషన్ చేయించడంతో సోషల్ మీడియాలో ఒక్కసారిగా ఈ న్యూస్ వైరల్ గా మారింది. ఇక ఆ టైటిల్ కథలోకి వెళితే.. వ్రిందావన అనేది ఉత్తర ప్రదేశ్, మథుర జిల్లాలోని ఒక పట్టణం పేరు. శ్రీ కృష్ణ భగవానుడు తన చిన్ననాటి రోజులను ఆ ప్రదేశములలో గాడిపినట్లు చరిత్ర చెబుతోంది. కృష్ణ భగవానుని జన్మ స్థలమైన మథుర నుండి 15 కి.మీ. దూరంలో వ్రిందావన ఉంటుందట. ఆ ప్రాంతం బ్యాక్ డ్రాప్ లో చారిత్రాత్మక సినిమాగా తెరకెక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

  English summary
  Star Producer Dil Raju Registered Vrindavana Title For Prabhas 25th Film. Movie is Based on Periodical Drama & Dil Raju is Planning on a Huge PAN-INDIA Scale, Movie Will Start on 2023 End & More Details Will be Announced Shortly,
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X