చిన్నారి కోసం సుధీర్ బాబు ఫండ్ రైజింగ్.. ప్లీజ్ అంటూ!
సూపర్ స్టార్ కృష్ణ అల్లుడిగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సుధీర్ బాబు ఇప్పటికీ కృష్ణ పేరు వాడుకోకుండా స్టార్ గా నిలబడడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. కృష్ణ కుమార్తె, సూపర్ స్టార్ మహేష్ బాబు సోదరి అయిన ప్రియదర్శినిని సుధీర్ బాబు వివాహం చేసుకున్నారు.. సినిమాల మీద ఆసక్తితో ఆయన బిజినెస్ పక్కన పెట్టి మరీ సినిమాల్లో హీరోగా మారాడు. తనకంటూ ఒక ప్రత్యేక క్రేజ్ ఏర్పరుచుకోవాలని ఉద్దేశంతో విభిన్నమైన సినిమాలు ఎంచుకుంటూ ప్రయోగాత్మక సినిమాలు చేస్తున్నారు.. గత ఏడాది వి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సుధీర్ బాబు ఈ ఏడాది మరో రెండు సినిమాలు లైన్ లో పెట్టారు..
పలాస దర్శకుడు కరుణాకర్ దర్శకత్వంలో ఆయన శ్రీదేవి సోడా సెంటర్ అనే సినిమా చేస్తున్నారు.. అలాగే అయిన మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేస్తున్నాడు. కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి ఆ అమ్మాయి గురించి చెప్పాలని ఉంది అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఇక తాజాగా అయినా ఒక చిన్నారిని ప్రాణాలు రక్షించేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉండడం ఆసక్తికరంగా మారింది.

"ఎమర్జెన్సీ: బేబీ సంస్కృత గుండె సంబంధిత సమస్యలు ఎదుర్కొంటుంది. ఆమె ఆపరేషన్ ప్రారంభించడానికి నేను 1 లక్షలు అందిస్తున్నా, కానీ ఆమె ఆపరేషన్ కోసం, ఇతర వైద్య ఖర్చుల కోసం 3.5 లక్షలు కావాలి. కాబట్టి నేను వ్యక్తిగతంగా నిధులు సేకరిస్తున్నాను. దయచేసి సహకరించండి" అంటూ ఆయన ట్వీట్ చేశారు. హార్ట్ ప్రాబ్లమ్ తో బాధపడుతున్న ఆ చిన్నారి కోసం సుధీర్ బాబు చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ మధ్యనే సుధీర్ బాబు తన పుట్టినరోజు కూడా జరుపుకున్న సంగతి తెలిసిందే. ఇక ఆయన ఫండ్ రైజింగ్ విజయవంతంగా పూర్తి అయి ఆ చిన్నారి సంపూర్ణ ఆయుష్షుతో తిరిగి రావాలని కోరుకుందాం.


Click it and Unblock the Notifications











