రెండేళ్ల నుంచి నా సినిమాలు ఆడలేదు.. అందుకే నిర్మాతగా మారా.. సందీప్ కిషన్

యువ హీరో సందీప్ కిషన్ కథానాయకుడిగా నటిస్తూ, నిర్మిస్తున్న చిత్రం 'నిను వీడని నీడను నేనే'. అన్యా సింగ్ కథానాయిక. కార్తీక్ రాజు దర్శకుడు. వెంకటాద్రి టాకీస్ (ప్రొడక్షన్ నంబర్ 1), వి స్టూడియోస్, విస్తా డ్రీమ్ మర్చంట్స్ పతాకాలపై సినిమా తెరకెక్కింది. దయా పన్నెం, సందీప్ కిషన్, విజి సుబ్ర‌హ్మ‌ణ్య‌న్ నిర్మాతలు. ఎస్.ఎస్. తమన్ సంగీత దర్శకుడు. ఏకే ఎంట్టైన్మెంట్స్ సమర్పణలో రూపొందిన ఈ సినిమా జూలై 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా సందీప్ కిషన్ మాట్లాడుతూ..

గత రెండేళ్లలో నా సినిమాలు ఏవీ ఆడలేదు. లాస్ట్ మూడు సినిమాలు సరిగా లేవు. వాటిని నేనే థియేటర్లలో చూడలేదు. 'నక్షత్రం' తర్వాత నన్ను నేను వెండితెరపై చూసుకోలేదు. ఈ శుక్రవారం సంతోషంగా చూసుకుంటా. ఇంతకు ముందు సినిమాలు... ప్రతిసారీ తప్పు ఎక్కడ జరుగుతుందో విడుదలకు ముందు తెలుస్తుంది. విడుదల తర్వాత ప్రేక్షకులు కూడా ఆ తప్పులే చెబుతున్నారు. ఒకవేళ ఆ తప్పులు జరగకుండా కాపాడుకోగలిగితే? అందుకే. నిర్మాతగా మారాను. గత సినిమాల్లో తప్పులకు నేను ఎవరినీ తప్పుబట్టడం లేదు. నేనే కథలు విని ఒప్పుకున్నవాడినే కదా. ఈ సినిమా వరకూ నేను నమ్మిన విధంగా తీయాలనుకుని తీశా. టీజర్ కంటే ట్రైలర్, ట్రైలర్ కంటే సినిమా బావుండాలనే కష్టపడ్డాను. భయంకరంగా కథకు ఏం కావాలో అది ఖర్చుపెట్టాను. థియేటర్లో ప్రేక్షకుడు బయటకు వచ్చేటప్పుడు బావుందనే ఫీలింగ్ తో రావాలనే సింగిల్ పాయింట్ అజెండాతో చేశా అని సందీప్ కిషన్ తెలిపారు.

Sundeep Kishan given clarity on becoming producer for NVNN

సుమారు పాతిక సినిమాలు చేశాను కాబట్టి నటించడం అలవాటే. ప్రతి సినిమాకు నటుడిగా రెండొందల శాతం కష్టపడతా. అందువల్ల, 'నక్షత్రం' షూటింగులో గాయం కావడం వలన నెత్తిపై 12 కుట్లు పడ్డాయి. మొన్న 'తెనాలి రామకృష్ణ' షూటింగులో కంటికింద గాయమైంది. సో... నటించడం కష్టం కాదు. ఈ సినిమాకు నేను ఆ ప్రెజర్ తీసుకోలేదు. ప్రొడక్షన్ ప్రెజర్ తీసుకున్నాను. అనుకున్నది అనుకున్నట్టుగా తీయాలని, చెప్పిన తేదీకి విడుదల చేయాలనీ ప్రెజర్ తీసుకున్నాను. మంచి మంచి టెక్నీషియన్లను తీసుకున్నాను. స్టెప్ బై స్టెప్ దాటుకుంటూ వచ్చాను. ఇప్పుడు 12న థియేటర్లలోకి వస్తున్నాను. ఈ ప్రయాణంలో నా ఫ్రెండ్, సినిమా నిర్మాతల్లో ఒకరైన దయా పన్నెం అందించిన సహకారం మరువలేనిది. అలాగే, 'జెమిని' కిరణ్ గారు, అనిల్ సుంకరగారు చాలా హెల్ప్ చేశారు అని సందీప్ కిషన్ అన్నారు.

ఇటీవల హిందీలో పేరున్న దర్శక నిర్మాతలు సినిమా చూసి రీమేక్ రైట్స్ కొనుక్కున్నారు. వాళ్లు ఎవరనేది త్వరలో ప్రకటిస్తా. నేను కంటెంట్ నమ్మి సినిమా చేశాను. వాళ్లకు అదే కంటెంట్ నచ్చి రీమేక్ రైట్స్ కొన్నారు.

మీ తదుపరి చిత్రాలు?

జి. నాగేశ్వరరెడ్డిగారి దర్శకత్వంలో నటిస్తున్న 'తెనాలి రామకృష్ణ' షూటింగ్ మరో 20 రోజులు బాలన్స్ ఉంది. 'నిను వీడని నీడని నేను' విడుదల తరవాత షూటింగ్ పూర్తి చేసి, రెండు మూడు నెలల్లో విడుదల చేస్తాం. ఈ సినిమాతో పోలిస్తే కంప్లీట్ డిఫరెంట్ సినిమా. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌. అమెజాన్ కోసం మనోజ్ బాజ్‌పాయ్‌గారితో క‌లిసి రాజ్-డీకే దర్శకత్వంలో 'ది ఫ్యామిలీ మాన్' అని హిందీ వెబ్ సిరీస్‌లో న‌టించాను. షూటింగ్ పూర్తయింది. యాక్షన్ ప్యాక్డ్ రోల్ చేశా. మరో తెలుగు సినిమా చర్చల దశలో ఉంది. త్వరలో వివరాలు వెల్లడిస్తా అని సందీప్ కిషన్ పేర్కొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X