Don't Miss!
- News
లోకేష్ యాత్ర కొత్త "టర్న్" - చంద్రబాబు వ్యూహాం: రంగంలోకి బాలయ్య - నందమూరి ఫ్యామిలీ..!!
- Sports
INDvsNZ : తొలి టీ20లో గిల్ ఆడతాడు.. పృథ్వీ షాకు ఛాన్స్ లేదు: హార్దిక్ పాండ్యా
- Finance
upi limit: UPI తో ఎంత డబ్బు పంపించవచ్చో తెలుసా ? అంతకు మించి పంపాలంటే..
- Lifestyle
ఈ ఆహారాలకు ఎక్స్ పైరీ డేట్ ఉండదని మీకు తెలుసా?
- Automobiles
అప్డేటెడ్ హోండా యాక్టివా కొనేవారు తప్పకుండా తెలుసుకోవాల్సిన 5 విషయాలు
- Technology
Poco X5 Pro 5G ఇండియా లాంచ్ తేదీ మరియు ధర లీక్ అయింది! వివరాలు
- Travel
భాగ్యనగరపు పర్యాటక ఆకర్షణ.. గోల్కొండ కోట!
రికార్డ్ క్రియేట్ చేసిన సందీప్ కిషన్: 12 రోజుల్లోనే 30 మిలియన్స్.. ఇక్కడ ఆడకున్నా అక్కడ హిట్టే
తెలుగు సినీ ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చి చాలా కాలమే అవుతోన్నా.. పెద్దగా హిట్లను సొంతం చేసుకోలేకపోయాడు టాలెంటెడ్ గాయ్ సందీప్ కిషన్. సుదీర్ఘమైన కెరీర్‌లో 'వెంకటాద్రీ ఎక్స్‌ప్రెస్', 'నిను వీడని నీడను నేనే' వంటి హిట్లను మాత్రమే అందుకున్న అతడు.. పెద్దగా రాణించలేకపోయాడు. మధ్యలో కొన్ని సినిమాలు పర్వాలేదనిపించినా బాక్సాఫీస్ ముందు మాత్రం సత్తా చాటలేకపోయాయి. భారీ హిట్ కోసం ఎప్పటి నుంచే వేచి చూస్తోన్న సందీప్ కిషన్ ఇటీవల నటించిన చిత్రమే 'గల్లీ రౌడీ'. ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ నిరాశనే మిగిల్చింది. కానీ, తాజాగా ఓ రికార్డును క్రియేట్ చేసింది. ఆ వివరాలు మీకోసం!

‘గల్లీ రౌడీ’గా వచ్చిన సందీప్ కిషన్
సందీప్ కిషన్ - జీ నాగేశ్వర్‌రెడ్డి కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం 'గల్లీ రౌడీ'. కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాను కోన ఫిల్మ్ కార్పోరేషన్ సమర్పణలో విశాఖపట్నం ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ నిర్మించారు. ఇందులో నేహా శెట్టి హీరోయిన్ నటించింది. బాబీ సింహా, రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిశోర్‌లు కీలక పాత్రలను పోషించారు. సాయి కార్తీక్ సంగీతం అందించాడు.
'అఖండ' ఈవెంట్‌కు ఇద్దరు హీరోలు: ఎన్టీఆర్‌తో పాటు బాలయ్య అభిమాని కూడా.. ఇక రచ్చ రచ్చే

రిలీజ్ భారీగా... నిరాశనే మిగిల్చింది
భారీ ఆశలు, అంచనాల నడుమ 'గల్లీ రౌడీ' మూవీ ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే, ఈ సినిమాను భారీగా విడుదల చేశారు. అయితే, ఆరంభంలో టాక్ మంచిగా రాలేదు. దీంతో ఈ సినిమా భవితవ్యంపై నీలి నీడలు కమ్ముకున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మొదటి వీకెండ్‌కు ఇది బాగానే పుంజుకుంది. కానీ, కలెక్షన్లను మాత్రం అంతగా వసూలు చేయలేకపోయింది.

మొత్తంగా వచ్చిన కలెక్షన్లు ఎంతంటే
'గల్లీ రౌడీ' మూవీకి మాత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 2.75 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 3 కోట్లుగా నమోదైంది. ఈ సినిమా ఫుల్ రన్‌లో ప్రపంచ వ్యాప్తంగా కేవలం రూ. 1.98 కోట్లు మాత్రమే వసూలు చేసింది. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్‌కు రూ. 1.02 కోట్ల దూరంలో ఆగిపోయింది. ఫలితంగా ఇది ఫ్లాప్ మూవీగానే మిగిలిపోయింది.
హాట్ షోలో హద్దు దాటిన పూజా హెగ్డే: కేవలం అదొక్కటే ధరించి.. ఇలాంటి ఫొటోలు కూడా షేర్ చేస్తారా!

ఓటీటీలో మాత్రం సత్తా చాటుతోంది
క్రేజీ
కాంబినేషన్‌లో
ఫన్
రైడ్
మూవీగా
వచ్చిన
'గల్లీ
రౌడీ'
కొద్ది
రోజుల
క్రితమే
డిస్నీ
ప్లస్
హాట్‌స్టార్
ఓటీటీలో
స్ట్రీమింగ్
మొదలుపెట్టుకుంది.
అయితే,
థియేటర్లలా
కాకుండా
అందులో
ఈ
చిత్రానికి
మంచిగానే
స్పందన
వచ్చినట్లు
తెలుస్తోంది.
ఫన్
ఎంటర్‌టైనర్
కావడంతో
దీన్ని
చూసేందుకు
చాలా
మంది
ఆసక్తి
చూపించారని
తెలిసింది.
దీంతో
ఓటీటీలో
పర్వాలేదనిపించింది.

12 రోజుల్లోనే 30 మిలియన్స్ కొట్టేసి
ఎన్నో అంచనాలతో వచ్చిన 'గల్లీ రౌడీ' మూవీ అంతగా ఆకట్టుకోలేకపోయింది. అయినప్పటికీ దీన్ని అదే టైటిల్‌తో హిందీలోకి డబ్బింగ్ చేశారు. అలా పదమూడు రోజుల క్రితమే దీన్ని యూట్యూబ్‌లో పెట్టారు. ఇక, ఈ హిందీ వెర్షన్‌కు ఉత్తరాది ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఫలితంగా 12 రోజుల్లోనే ఇది 30 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ప్రభాస్ హీరోయిన్: పెళ్లైన ఆరు నెలలకే తల్లిగా ప్రమోషన్
Recommended Video

రికార్డ్ క్రియేట్ చేసిన సందీప్ కిషన్
'గల్లీ
రౌడీ'
మూవీకి
12
రోజుల్లోనే
30
మిలియన్‌లకు
పైగా
వ్యూస్‌తో
పాటు
దాదాపు
ఐదు
లక్షలకు
పైగా
లైకులు
వచ్చాయి.
దీంతో
చాలా
తక్కువ
సమయంలో
ఎక్కువ
వ్యూస్,
లైకులు
సాధించిన
తెలుగు
డబ్బింగ్
మూవీగా
ఇది
రికార్డు
క్రియేట్
చేసింది.
దీంతో
సందీప్
కిషన్
ఖాతాలో
మంచి
ఘనత
వచ్చి
చేరినట్లైంది.
తెలుగులో
ఆడుకున్నా
ఇది
హిందీలో
హిట్
అయింది.