For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  భర్త ఆస్తులపై సింగర్ సునీత షాకింగ్ కామెంట్స్.. అందుకే ఒప్పుకున్నా అంటూ..

  |

  తన పాటలతో గత పాతికేళ్లుగా సంగీత ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంటున్న సునీత అప్పుడప్పుడు తన మాటలతో కూడా ఎంతగానో ఆలోచింపజేస్తుంది. తన జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలను ఆమె చాలా ఇంటర్వ్యూలో షేర్ చేసుకున్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా ఎవరిపై ఆధారపడకుండా తన కాళ్ళపై తాను నిలదొక్కుకున్నట్లు చెబుతుంటారు. కష్టాలను ఎదుర్కొని ముందుకు సాగాలని చెప్పే సునీత ఏ విషయాన్ని అయినా సరే పాజిటివ్ గా తీసుకోవాలని కూడా చెబుతుంటారు. ఇక ఆమె రెండో పెళ్లి పై వార్తలు ఈ స్థాయిలో వైరల్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఆ విషయంపై కూడా సునీత చాలాసార్లు వివరణ ఇచ్చింది. ఆ ప్రపోజల్స్ గురించి కూడా ఓపెన్గా చెబుతూ భర్త ఆస్తులపై కూడా ఎవరూ ఊహించని విధంగా కామెంట్ చేసింది.

  తప్పు చేస్తే మాత్రం

  తప్పు చేస్తే మాత్రం

  సింగర్ సునీత 1995 నుంచి సినీరంగంలో ప్రముఖ గాయని గా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా కొనసాగుతోంది. అప్పట్లో ఎక్కువగా సీనియర్ హీరోయిన్స్ లకు ఆమె డబ్బింగ్ చెప్పేవారు. కొంతమంది హీరోయిన్స్ అయితే సునీతతోనే ఎక్కువగా డబ్బింగ్ చెప్పించుకునేందుకు ఇష్టపడేవారు. హీరోయిన్ స్నేహ సినిమాలకు దాదాపు ఆమెనే డబ్బింగ్ చెప్పేవారు. అలాగే రియాలిటీ షోలకు కూడా సింగర్ సునీత హోస్ట్ గానే కాకుండా జడ్జిగా కూడా కొనసాగారు. ఇక సునీత ఎంత సున్నితంగా ఉంటుందో ఎవరైనా తప్పు చేస్తే మాత్రం అదే తరహాలో ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చుతుంది. తీవ్ర స్థాయిలో హెచ్చరికలు చేసిన సందర్బాలు కూడా చాలానే జన్నాయి.

  మొదటి భర్తతో అప్పుడే విడిపోయి..

  మొదటి భర్తతో అప్పుడే విడిపోయి..

  ఇక ఇండస్ట్రీలో కూడా ఆమె దాదాపు అందరితోను ఎంతో స్నేహంగా ఉంటారు. యాంకర్ ఝాన్సీ కూడా సునీతకు మంచి స్నేహితురాలు. మంచి ఫ్రెండ్షిప్ ఉంది. అయితే ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో సునీత తన రెండో వివాహానికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టింది. సునీత మొదట 19 ఏళ్ల వయసులోనే కిరణ్ కుమార్ గోపరాజు అనే మీడియా వ్యక్తిని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వారికి ఇద్దరు పిల్లలు కూడా జన్మించారు. అబ్బాయి ఆకాష్ గోపరాజు ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లగా కూతురు శ్రేయ గోపరాజు తల్లి వారసత్వంతో ఇండస్ట్రీలో గాయనిగా కొనసాగుతోంది. సవ్యసాచి సినిమాలో కీరవాణి సంగీతం అందించిన 'టిక్ టిక్ టిక్' అనే పాటతో ఆమె సింగర్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.

   రెండవ పెళ్లి చేసుకొని..

  రెండవ పెళ్లి చేసుకొని..

  సునీత తన మొదటి భర్తతో గత పదిహేనేళ్ల కిందటే తెగతెంపులు తెంచుకొని ఒంటరిగానే పిల్లలను పోషించింది. ఎక్కడ ఎలాంటి రూమర్స్ లకు తావివ్వకుండా తన సినీ కెరీర్ తోనే చాలా హ్యాపీ గా కొనసాగింది. ఇక ఈ ఏడాది జనవరిలోనే సునీత మరో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే ఒక ప్రముఖ మీడియా సంస్థకు చెందిన రామకృష్ణ వీరపనేనితో గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న సునీత మొత్తానికి తన కుటుంబ సభ్యుల సమక్షంలోనే వివాహం చేసుకుంది.

   రామ్ ను అందుకే పెళ్లి చేసుకున్నా

  రామ్ ను అందుకే పెళ్లి చేసుకున్నా

  రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో రామ పెళ్లి చేసుకోవడానికి గల కారణాలను కూడా తెలిపింది. భర్త ఆస్తులపై కూడా ఎవరూ ఊహించని విధంగా వివరణ ఇవ్వడం వైరల్ గా మారింది. తన రెండో భర్త రామ్ గురించి మాట్లాడుతూ.. రామ్ వ్యక్తిత్వం గురించి తెలుసుకోవడానికి నాకు ఎక్కువ కాలం పట్టలేదు. అతను చాలా మంచి వ్యక్తి. నన్ను పెళ్లి చేసుకుంటానని ప్రపోజల్ తెచ్చినప్పుడు కొన్ని విషయాలు చెప్పారు. 'నువ్వు నిజంగా నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటే నా జీవితం ఎంతో సంతోషంగా ఉంటుంది ఒకవేళ అంగీకరించకపోతే బాధపడకండి. కానీ నా జీవితం మాత్రం అక్కడితోనే ఆగిపోదు. మరింత ముందుకు సాగుతూనే ఉంటుంది. అని రాము చెప్పగానే ఆ మాటలు నాకు ఎంతగానో నచ్చాయి. అతనిలో ఉన్న నిజాయితీ కూడా నాకు క్లియర్ గా అర్థమైంది.ఆ విదంగా క్లియర్ గా ఉన్నాడు కాబట్టి పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాను.

  డబ్బు కోసమే పెళ్లి చేసుకున్నాను అన్నారు

  డబ్బు కోసమే పెళ్లి చేసుకున్నాను అన్నారు

  కానీ నా పెళ్లి విషయంలో చాలా మంది ఆడవాళ్ళు నన్ను తప్పుగా చూస్తున్నారు. మొదటి నుంచి కూడా నా బాధ్యతలను ఎవరో ఒక వ్యక్తి ప్రత్యేకంగా చూసుకుంటున్నారని కూడా మాట్లాడుకుంటున్నారు. ఇక మరికొందరు అయితే డబ్బు కోసమే పెళ్లి చేసుకున్నానని కూడా కామెంట్ చేశారు. కానీ ఇంతవరకు కూడా రామ్ కు ఎంత ఆస్తి ఉంది అనే విషయం నాకు కొంచెం కూడా తెలియదు. ఆయనకు పెద్ద కంపెనీ ఉండవచ్చు. కానీ దాని టర్నోవర్ ఎంత అనే విషయంలో కూడా ఐడియా లేదు. నేను నా సొంత కాళ్లపై నిలబడ్డాను.

  Vijay Sethupathi తెలుగు బ్రాండ్ వాల్యూ పీక్స్.. | NBK పక్కన విలన్ గా నిజమే!! || Filmibeat Telugu
  ఆ విషయంలో ఇద్దరం ఒక్కటే..

  ఆ విషయంలో ఇద్దరం ఒక్కటే..

  అతను కూడా చిన్నప్పటి నుంచి కష్టంతోనే పైకి వచ్చాడు. ఒక విధంగా అతని వ్యక్తిత్వం తప్పితే నేను మరొకటి చూడలేదు. మా ఇద్దరి ఆలోచనలు దాదాపు ఒకే విధంగా ఉంటాయి ఇద్దరి మధ్య అనుబంధం కూడా చాలా తొందరగా పెరిగిపోయింది ఒకరంటే ఒకరికి ఎంతో గౌరవం కూడా ఉంది ఒక విషయం మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎంత ఆస్తి ఉందో అనే విషయం గురించి ఎక్కువగా పట్టించుకోలేదు. కానీ ఇద్దరం మాత్రం వర్క్ విషయంలో చాలా నిబద్ధతతోని ఉంటాము.. అని సునీత తనదైన శైలిలో వివరణ ఇచ్చారు.

  English summary
  the news on the singer sunitha second marriage went viral on this scale. However, Sunita also clarified the matter several times. The husband also unexpectedly commented on the assets, saying he was also open about those proposals.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X