Just In
- 10 min ago
తిరుపతిలో జాన్వీ కపూర్ పెళ్లి: లుంగీలో పెళ్లి కొడుకు దర్శనం.. సీక్రెట్ రివీల్ చేసిన శ్రీదేవి కూతురు
- 26 min ago
బెడ్‌కే పరిమితమైన నిహారిక.. ఆ గాయం అవ్వడంతో చైతన్య సేవలు
- 1 hr ago
Uppena 22 Days Collections: అన్ని సినిమాలున్నా తగ్గని ‘ఉప్పెన’.. వాటితో పోల్చితే కలెక్షన్లు ఎక్కువే
- 1 hr ago
సోషల్ మీడియాలో మరో రికార్డును అందుకున్న విజయ్ దేవరకొండ.. నెంబర్ వన్!
Don't Miss!
- Sports
India vs England: వణికిస్తున్న అశ్విన్, అక్షర్.. పెవిలియన్‌కు ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్!
- Automobiles
కార్లలో ఇకపై ఫ్రంట్ ప్యాసింజర్ ఎయిర్‌బ్యాగ్ కూడా తప్పనిసరి: కేంద్రం
- News
రైతుల ఆందోళనకు 100రోజులు ... నల్లజెండాలతో నేడు బ్లాక్ డే పాటిస్తున్న రైతులు
- Finance
గుడ్‌న్యూస్: క్రిప్టోకరెన్సీ వినియోగంపై ఆలోచిస్తున్నాం..నిర్మలమ్మ ఏం చెప్పారంటే..?
- Lifestyle
శనివారం దినఫలాలు : ఓ రాశి ఉద్యోగులకు ఉన్నతాధికారులతో మంచి సమన్వయం ఉంటుంది...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
బ్లాక్ బస్టర్ కా బాప్.. సరిలేరుపై సూపర్ స్టార్ కృష్ణ స్పందన
సూపర్ స్టార్ మహేష్ బాబు, యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన సరిలేరు నీకెవ్వరు ఇప్పటికే ఎన్నో రికార్డులను కొల్లగొట్టింది. ఇంకా ఆ పరంపరను కొనసాగిస్తూనే ఉంది. సంక్రాంతి సీజన్ ముగిసినా కలెక్షన్ల వర్షం మాత్రం ఆగడం లేదు. ఇలాంటి సమయంలోఈ చిత్రంపై సూపర్ స్టార్ కృష్ణ స్పందించాడు.

కలెక్షన్ల జోరు..
ఈ చిత్రం ఇప్పటికే రెండు వందల కోట్ల గ్రాస్‌ను కలెక్ట్ చేసి 250కోట్ల దిశగా పరుగులు తీస్తోంది. కేవలం తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 120కోట్ల షేర్‌ను రాబట్టి నాన్ బాహుబలి రికార్డులను క్రియేట్ చేస్తోంది. పూర్తి రన్ ముగిసే వరకు ఇంకెన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.

సూపర్ స్టార్ కృష్ణ స్పందన..
సరిలేరు నీకెవ్వరుపై సూపర్ స్టార్ కృష్ణ స్పందించాడు. ఈ చిత్రం పెద్ద సక్సెస్ కావడం ఎంతో సంతోషంగా ఉందని, అలానే సినిమా సక్సెస్ అయ్యి పోస్టర్లపై బ్లాక్ బస్టర్ కా బాప్ అని హెడ్డింగ్ ఇవ్వడం చాలా బాగుందని, ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఈ సినిమా బాగానే కలెక్ట్ చేస్తుందనే నమ్మకం తనకు ఉందని అన్నాడు.

ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా..
ఇంకా మాట్లాడుతూ.. దర్శక నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తీశారని అన్నాడు. ఈ సినిమాలో నటించిన హీరో సూపర్ స్టార్ మహేష్, నిర్మాతలు అనిల్ సుంకర, దిల్ రాజు, దర్శకుడు అనిల్ రావిపూడిలకు ప్రత్యేకంగా అభినందనలను తెలిపాడు.
|
మహేష్ బాబు రిప్లై..
సరిలేరుపై సూపర్ స్టార్ కృష్ణ రియాక్షన్‌ను చూసిన మహేష్ సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. ఇదొక్కటి చాలు.. అన్నింటి కూల్ చేసేస్తుంది.. థ్యాంక్యూ సూపర్ స్టార్.. సరిలేరు నీకెవ్వరు అంటూ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి హాలిడే ఎంజాయ్ చేస్తున్న మహేష్ బాబు తన 27వ సినిమాని ‘మహర్షి' దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేయనున్నాడు.