హ్యాపీ బర్త్ డే మోడీ సార్.. మహేశ్ బాబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. ఏమన్నారంటే?
సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం తన రాబోయే అడ్వెంచర్ ఫిల్మ్ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు మహేశ్ బాబు కేవలం రీజినల్ ఫిల్మ్స్ లోనే నటించారు. ఇక బాబు పాన్ ఇండియా ఫిల్మ్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ లోగా ఇండియాస్ బిగ్గెస్ట్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో ఏకంగా పాన్ వరల్డ్ చిత్రం SSMB 29 లో నటిస్తుండటం విశేషం. ఈ సందర్భంగా సినిమాపై భారీ అంచనాలు నెలకున్నాయి. ఆ స్థాయిలో చిత్రీకరణ కూడా కొనసాగుతోంది.
ఇదిలా ఉంటే.. సూపర్ స్టార్ మహేశ్ బాబు అటు సినిమాలతో పాటు ఇటు సోషల్ గా కూడా కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో స్పందిస్తూ ఉంటారు. ఈ రోజు ఇండియాలో స్పెషల్ డే కావడం విశేషం. భారత ప్రధాని నరేంద్ర మోడీ పుట్టిన రోజు ఇవ్వాళే కావడం విశేషం. నరేంద్ర మోడీ 74వ జన్మిదిన వేడుకలకు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్బంగా పార్టీలకు అతీతంగా, విభిన్న రంగాల నుంచి మోడీకి శుభకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, టాలీవుడ్, సాండల్ వుడ్ లోని ప్రముఖ నటీనటులు, సినీ ప్రముఖులు మోడీకి విషెస్ తెలియజేస్తున్నారు.

ఈ క్రమంలో తాజాగా సూపర్ స్టార్ మహేశ్ బాబు మోడీకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఎక్స్ వేదిక ఒక ఇంట్రెస్టింగ్ వీడియోను విడుదల చేశారు. అందులో మోడీ గొప్పతనం గురించి తనదైన శైలిలో వర్ణిస్తూ మహేశ్ బాబు శుభాకాంక్షలు తెలపడం ఆసక్తికరంగా మారింది. 'గౌరవ శ్రీ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీరు ఎప్పుడూ ఇలాగే సంతోషంగా, హర్దికంగా, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీరు నాయకత్వంతో ఆదర్శనీయంగా ఉండాలని ఆశిస్తున్నాను.
మీరు మీ జీవితంలో పట్టుదలతో ఉండటం, లక్ష్య సాధనకు మీ జీవితం మొత్తంగా ఎంతలా శ్రమించారో నాకు స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. దేశ సేవ చేయడంలో మీరు కట్టుబడి ఉండటం, మీ విజన్, మీరు తీసుకునే ప్రతి నిర్ణయాలు ప్రతి ఒక్క భారతీయుడిని గర్వించేలా చేస్తున్నాయి. మమ్మల్ని కూడా మీ జీవితంతో మోటీవేట్ చేస్తున్నందుకు ధన్యవాదాలు. దేశం కోసం మీరు కన్న కలలన్నీ సాకారాం కావాలని కోరుకుంటున్నాను. ఎప్పుడూ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షిస్తున్నాను.' అంటూ ప్రత్యేకంగా మహేశ్ బాబు వీడియో విడుదల చేశారు.
ప్రధాని నరేంద్ర మోడీ 1950 సెప్టెంబర్ 17న అహ్మాదాబాద్ లో జన్మించారు. గుజరాత్ యూనివర్సిటీ, యూనివర్సీటీ ఆఫ్ ఢిల్లీ లో తన విద్యాభ్యాసాన్ని పూర్తి చేసుకున్నారు. భారతీయ జనతా పార్టీలో మొదటి నుంచి ప్రజా సేవ చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ నుంచి మొదలై పీఎం వరకు అంచెలంచెలుగా ఎదిగారు. 2001 నుంచి 2014 వరకు గుజరాజ్ సీఎం పదవీలో ఉన్నారు. ఇక 2014 నుంచి ఇప్పటి వరకు 11 ఏళ్లుగా భారత ప్రధానిగా దేశ సేవ చేస్తున్నారు. ఇండియాను వరల్డ్ లో టాప్ కంట్రీగా మార్చేందుకు ఆహర్నిషలు కష్టపడుతున్నారు.


Click it and Unblock the Notifications











