twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బ్రేకింగ్: సుప్రీంకోర్టులో వర్మకు ఎదురుదెబ్బ... లక్ష్మీస్ ఎన్టీఆర్‌పై పిటిషన్ తిరస్కృతి

    |

    ఏపీలో లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని రిలీజ్ చేయకుండా హైకోర్టు స్టే విధింపుపై దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. దీంతో సినిమాను ఎన్నికలకు ముందే విడుదల చేయాలనే దర్శకుడు రాంగోపాల్ వర్మ, నిర్మాత రాకేష్ రెడ్డి ప్రయత్నాలకు ఎదురుదెబ్బ తగిలింది. హైకోర్టును స్టే విధింపు నేపథ్యంలో సుప్రీంకోర్టును చిత్ర యూనిట్ ఆశ్రయించిన సంగతి తెలిసిందే. వివరాల్లోకి వెళితే..

     పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరణ

    పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరణ

    ఆంధ్రప్రదేశ్‌లో లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని రిలీజ్ చేయవద్దు. ఏప్రిల్ 3వ తేదీ వరకు ఈ సినిమాను ఏపీలో ప్రదర్శించడానికి వీలు లేదు అని హైకోర్టు స్టే విధించింది. ఈ నేపథ్యంలో సినిమాను రిలీజ్ చేయాలని, తర్విత గతిన తమ పిటిషన్‌ను విచారించాలని చేసిన నిర్మాత రాకేష్ రెడ్డి పిటిషన్‌ను చీఫ్ జస్టిస్ రంజన్ గగోయ్ ధర్మాసనం తిరస్కరించింది.

     రాజకీయ కక్ష కారణంగా

    రాజకీయ కక్ష కారణంగా

    తాను రూపొందించిన లక్ష్మీస్ ఎన్టీఆర్‌ను రాజకీయ కక్షతోనే నిలిపివేశారు. దాని వెనుక భారీ పొలిటికల్ ఎజెండా ఉంది అని వర్మ ఆరోపించారు. నా సినిమాను ఏపీలో రిలీజ్ చేయకుండా నిలిపివేయడంపై కుట్ర ఉందనే విషయంలో ఎలాంటి అనుమానాలు లేవు అని వర్మ మీడియాతో అన్నారు.

    లక్ష్మీస్ ఎన్టీఆర్ రివ్యూ అండ్ రేటింగ్లక్ష్మీస్ ఎన్టీఆర్ రివ్యూ అండ్ రేటింగ్

    కుట్ర వెనుక పేర్లపై

    కుట్ర వెనుక పేర్లపై

    లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా వివాదం కోర్టు పరిధిలో ఉన్నందున ఈ కుట్ర వెనుక ఎవరున్నారనే విషయంపై పేర్లు వెల్లడించను. హైకోర్టు స్టే విధించినందున నేనేమీ మాట్లాడను. సుప్రీంకోర్టులో మాకు న్యాయం జరుగుతుందని నేను నమ్ముతాను అని వర్మ ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.

     చంద్రబాబు హస్తం ఉందనే

    చంద్రబాబు హస్తం ఉందనే

    లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా నిలిపివేత కుట్ర వెనుక ఏపీ చంద్రబాబు నాయుడు హస్తం ఉందా అనే ప్రశ్నకు సమాధానమిస్తూ.. ఈ సినిమా కొన్ని వాస్తవ సంఘటనలకు ప్రతిరూపం. అందుకే ఈ సినిమాను నిలిపివేశారన్నది సత్యం. ఇది అందరికీ తెలిసిన విషయమే అని వర్మ అభిప్రాయపడ్డారు.

    English summary
    The Supreme Court on Monday refused to give an urgent hearing to a plea seeking a stay on the release of director Ram Gopal Verma's film 'Lakshmi's NTR'. A bench headed by Chief Justice Ranjan Gogoi dismissed the plea.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X