నారప్ప ఒక్కటే కాదు.. ఆ ఆరు సినిమాలు కూడా, బాంబు పేల్చిన సురేష్ బాబు!

టాలీవుడ్ లో ప్రముఖ నిర్మాతల్లో ఒకరైన సురేష్ బాబు ఇప్పుడు కొద్దిరోజులుగా హాట్ టాపిక్ గా నిలుస్తున్నారు. ఆయన సోదరుడు వెంకటేష్ హీరోగా తెరకెక్కిన ఈ నారప్ప సినిమా డిజిటల్ రిలీజ్ కారణంగా సురేష్ బాబు అందరికీ టార్గెట్ గా మారాడు. తాజాగా ఆయన తన సినిమాల డిజిటల్ రిలీజ్ కి సంబంధించిన కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఆ వివరాల్లోకి వెళితే

Recommended Video

Actress Priyamani Exclusive Interview About Narappa Movie | Part 3 ​| Filmibeat Telug
 డిజిటల్ కి అమ్మేశారు

డిజిటల్ కి అమ్మేశారు

తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన అసురన్ అనే సినిమాని తెలుగులో నారప్ప పేరుతో రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. వెంకటేష్ హీరోగా ప్రియమణి హీరోయిన్ గా తెరకెక్కిన ఈ సినిమాకు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించారు. ముందు నుంచి ఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయ్యే అవకాశం ఉందని ప్రచారం జరిగినా అనూహ్యంగా ఈ సినిమాని అమెజాన్ ప్రైమ్ సంస్థకు అమ్మేస్తూ సురేష్ ప్రొడక్షన్స్ అలాగే వి క్రియేషన్స్ సంస్థలు కీలక నిర్ణయం తీసుకున్నాయి.

 నా వల్ల కాదు

నా వల్ల కాదు

అయితే సురేష్ బాబు స్వయంగా నిర్మాత కావడం ఆయనకు అనేక థియేటర్లు కూడా ఉండడంతో ఇలా ఎలా చేస్తారు అంటూ ఆయనను తెలంగాణ ఫిలిం ఛాంబర్ సహా అనేక మంది సినీ నిర్మాతలు, అభిమానులు కూడా టార్గెట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.. దీంతో ఆయన ఇప్పుడు తానేమీ చేయలేనని ఇది తన చేతిలో పని కాదని తేల్చి చెప్పేస్తున్నారు..

అందుకే డిజిటల్లో

అందుకే డిజిటల్లో

నారప్ప సినిమా విషయానికి వస్తే కలైపులి ఎస్ థాను అలాగే సురేష్ ప్రొడక్షన్స్ రెండు కలిసి నిర్మించడంతో మరో నిర్మాత మాటకు వ్యాల్యూ ఇవ్వాల్సి వచ్చిందని అందుకే సినిమా అమ్మేశాను అని చెప్పుకొచ్చారు. ఇక సురేష్ ప్రొడక్షన్స్ భాగస్వామ్యంతో తెరకెక్కుతున్న మరో రెండు సినిమాలు కూడా డిజిటల్ వేదికగా రిలీజ్ అయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది అందులో ఒకటి దృశ్యం 2 సినిమా కాగా మరొకటి విరాటపర్వం.

 దృశ్యం2-విరాటపర్వం డిజిటల్ రిలీజ్

దృశ్యం2-విరాటపర్వం డిజిటల్ రిలీజ్

తాజాగా ఈ రెండు సినిమాల రిలీజ్ గురించి సురేష్ బాబు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. దృశ్యం 2 గురించి మాట్లాడుతూ అసలు ఒరిజినల్ సినిమానే అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన సంగతి గురించి గుర్తు చేసిన ఆయన తెలుగులో మాత్రం డిజిటల్ లో రిలీజ్ అవుతుందా లేదా అనేది నిర్మాతలు ఇష్టం అని చెప్పుకొచ్చారు విరాటపర్వం సినిమా విషయానికి వస్తే మరో ఐదు రోజుల షూటింగ్ ఉందని పేర్కొన్నారు.

 ఏడిట్లో ఒక్కటే నాది

ఏడిట్లో ఒక్కటే నాది

అయితే ఈ సినిమా నిర్మాత డిజిటల్ రిలీజ్ కి వెళ్తారా లేదా అనేది మాత్రం తాను చెప్పలేనని సురేష్ బాబు వెల్లడించారు.. ఇక మొత్తం మీద సురేష్ ప్రొడక్షన్ కింద మొత్తం ఏడు సినిమాలు తెరకెక్కుతున్నాయి అని వెల్లడించిన ఆయన అందులో తరుణ్ భాస్కర్ తో మాత్రమే సురేష్ ప్రొడక్షన్ సంస్థ సింగిల్ గా నిర్మిస్తోందని మిగిలిన ఆరు సినిమాలు తాను వేరే నిర్మాతలతో కలిసి నిర్మిస్తున్నా అని వెల్లడించారు.

నేనేం చేయలేను

నేనేం చేయలేను

అలా ఒక రకంగా సురేష్ బాబు షాకింగ్ న్యూస్ చెప్పారనే చెప్పాలి. తాను సొంతంగా నిర్మించిన సినిమాలు మాత్రమే తాను థియేటర్ లో రిలీజ్ చేయగలనని మిగతా సినిమాల గురించి తాను ఏమీ చెప్పలేనని ఆయన చెప్పుకొచ్చారు. ఇక సినిమాలు డిజిటల్ వైపు వెళ్లడం తనకు కూడా బాగానే ఉంటుందని పేర్కొన్న ఆయన తనకు కూడా థియేటర్స్ ఉన్నాయన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. నిర్మాతలు చాలా కాలం నుంచి వెయిట్ చేస్తున్నారు కాబట్టి డబ్బుతో కూడుకున్న వ్యవహారం కాబట్టి తానేమీ చేయలేకపోతున్నానని సురేష్ బాబు చెప్పుకొచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X