twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సుశాంత్ కేసు దర్యాప్తు.. ముంబై పోలీసులను తప్పుపట్టిన సీబీఐ

    |

    సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో ముంబై పోలీసు చేసిన దర్యాప్తును సీబీఐ అధికారులు తప్పుపట్టారు. ఈ కేసు దర్యాప్తులో ముంబై పోలీసులు అనుసరించిన విధానమంతా తప్పుల తడకగా ఉందనే అభిప్రాయానికి సీబీఐ వచ్చింది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసుకు సంబంధించిన దర్యాప్తులో పలు సాంకేతిక లోపాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నదనే విషయాన్ని స్పష్టం చేసింది.

    సుశాంత్ కేసుకు సంబంధం లేని వ్యక్తులకు ముంబై పోలీసులు సమన్లు జారీ చేసి విచారించారు. అత్యంత కీలకమైన దర్యాప్తు సమయాన్ని వారు వృధా చేశారని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ కారణంగా అనేక సాక్ష్యాలు తారుమారు కావడం, కనుమరుగైపోయాయనే వాదన తెరపైకి సీబీఐ తెచ్చింది.

    Sushant Singh Rajput death investigation: CBI pointed out technical lapses by Mumbai Police

    సుశాంత్ సింగ్ మరణం తర్వాత అత్యంత అనుమానాస్పద వ్యక్తి, స్నేహితుడుగా చెప్పుకొంటున్న సందీప్ సింగ్‌ను ముంబై పోలీసులు విచారించకపోవడం ప్రధాన లోపం అని సీబీఐ అధికారులు పేర్కొన్నారు. సుశాంత్ కేసు విచారణలో ప్రధానంగా నాలుగు లోపాలను సీబీఐ ఎత్తి చూపింది.

    ముంబై పోలీసులు సుశాంత్ క్రైమ్ సీన్‌ను రికార్డు చేయలేదు. అలాగే చాలా మందిని క్రైమ్ సీన్‌లో అనుమతించారు. అలాగగే కూపర్ హాస్పిటల్ పోస్ట్ మార్టమ్ నివేదిక అసమంజసంగా ఉంది. సుశాంత్ మరణంలో ఏదైనా కుట్ర జరిగిందా అనే కనీస విషయాన్ని ముంబై పోలీసులు గుర్తించలేదు అని సీబీఐ అభిప్రాయపడింది.

    సుశాంత్ కేసులో ముంబై వ్యవహరిస్తున్న తీరు మొదటి నుంచి వివాదాస్పదమైంది. సుశాంత్ మరణం వెలుగులోకి రాగానే ముంబై పోలీసులు అతడి మరణాన్ని ఆత్మహత్యగా ధృవీకరించడాన్ని పలువురు తప్పుపట్టడం తెలిసిందే. ముంబై పోలీసులు సేకరించిన సాక్ష్యాలు, ఆధారాలన్నిటీపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

    English summary
    Sushant Singh Rajput death investigation: CBI pointed out technical lapses by Mumbai Police. CBI reveals that Mumbai polie did 'irrelevant summons' to multiple people from the industry which led to a colossal waste of time.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X