జాకీ చాన్‌తో ప్రదీప్ రంగనాథన్ సినిమా.. డ్రీమ్ ప్రాజెక్ట్‌పై యంగ్ హీరో వైరల్ కామెంట్స్

తమిళ చిత్ర పరిశ్రమలో డైరెక్టర్ గా, యాక్టర్ గా ప్రదీప్ రంగనాథన్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన సినిమాలు తెలుగు వెర్షన్ లోనూ విడుదల అవుతుండటంతో ఆయనకు ఇక్కడ కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. ప్రదీప్ రంగనాథన్ 3 ఏళ్ల కింద లవ్ టుడే చిత్రంతో తెలుగులో ప్రేక్షకుల్లో సెన్సేషన్ క్రియేట్ చేశారు. జూనియర్ ధనుష్ లాగా పెర్ఫామెన్స్ ఇచ్చి స్టార్ డబ్ ను సొంతం చేసుకున్నారు. తన బిహేవియర్ తోనూ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు. ఈ సందర్భంగా ప్రదీప్ రంగనాథన్ చిత్రాలకు అటు తమిళంలో, ఇటు తెలుగులో ఆయన సినిమాలకు మంచి డిమాండ్ ఏర్పడింది.

ఇక నెక్ట్స్ ప్రదీప్ రంగనాథన్ గురించి ఇంట్రెస్టింగ్ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. తాజాగా లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ అందుతున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ రీసెంట్ గా విడుదలైంది. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ విఘ్నేశ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండటం విశేషం. అయితే ప్రస్తుతం లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ చిత్రం టీజర్ ఆకట్టుకుంటోంది. ఈ టీజర్ రిలీజ్ సందర్భంగా నటుడు ప్రదీప్ రంగనాథన్ చేసిన కొన్ని కామెంట్స్ నెట్టింట ఆసక్తికరంగా మారాయి.

Tamil Actor Pradeep Ranganathan Dream Project with Actor Jackie Chan

ప్రదీప్ రంగనాథ్ ఇప్పటికే నటుడిగా, డైరెక్టర్ గా, ప్రొడ్యూసర్ గానూ చాలా చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ప్రస్తుతం మాత్రం హీరోగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ వస్తున్నారు. ఇక ప్రదీప్ రంగనాథన్ రీసెంట్ కామెంట్స్ వైరల్ గా మారాయి. ఆయన తన డ్రీమ్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడారు. ఆయన జీవితంలో ఎలాగైనా హాంగ్ కాంగ్ నటుడు, మార్షల్ ఆర్టిస్ట్, యాక్టర్, డైరెక్టర్ జాకీ చాన్ తో ఒక సినిమా చేయాలని ఉందని చెప్పుకొచ్చారు. ఆ సినిమాకు తన దర్శకత్వం వహిస్తారని, జాకీ చాన్ లీడ్ రోల్ లో నటిస్తారని చెప్పారు. అదే ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పుకొచ్చారు.

ఇక జాకీ చాన్ ప్రపంచ వ్యాప్తంగా తన మార్షల్ ఆర్ట్ చిత్రాలతో పాపులర్ అయ్యారు. ప్రస్తుతం ఆయనకు 71 ఏళ్లు. ఆయన కూడా ఇప్పటికీ యాక్టివ్ గానే సినిమాల్లో కనిపిస్తూ వచ్చారు. ఇప్పటి వరకు జాకీ చాన్ 150కి పైగా ఇంటర్నేషనల్ ఫిల్మ్స్ ల్లో నటించారు. చైనీస్ మార్షల్ ఆర్ట్స్, జీత్ కున్ డో, థైక్వాండో, జూడో, హప్కిడో వంటి డిఫెన్స్ కళల్లో పాపులర్ అయ్యారు. ఎంతో మందికి ఆయన స్ఫూర్తివంతంగా నిలిచారు. ఈ క్రమంలోనే ప్రదీప్ రంగనాథన్ డ్రీమ్ ప్రాజెక్ట్ కు కారణం అయ్యారు.

మరోవైపు ప్రదీప్ రంగనాథన్ రొమాంటిక్ ఫిల్మ్ లవ్ ఇన్సూ రెన్స్ కంపెనీ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. రౌడీ పిక్చర్స్, సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్లలో స్టార్ హీరోయిన్ నయనతార 60 కోట్ల రూపాయల బడ్జెట్ తో నిర్మించారు. ఈ చిత్రం దీపావళి సందర్భంగా ఆక్టోబర్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎస్జే సూర్య కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక యంగ్ హీరోయిన్ కృతి శెట్టి ప్రదీప్ రంగనాథన్ సరసన నటించింది. అలాగే మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో డైరెక్ట్ తెలుగు ఫిల్మ్ డ్యూడ్ చిత్రంలో నటిస్తూ బిజీగా ఉన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X