1000 కోట్ల వసూళ్ల సినిమాలపై.. డైరెక్టర్ ఏఆర్ మురగదాస్ వివాదాస్పద వ్యాఖ్యలు
తమిళ స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ కేవలం కోలీవుడ్ లోనే కాకుండా ఇతర భాషల్లోనూ మంచి గుర్తింపు దక్కించుకున్నారు. ఆయన డైరెక్ట్ చేసిన గజినీ ఇతర చిత్రాలకు అన్ని భాషల ఆడియెన్స్ నుంచి ప్రశంసలు అందాయి. అయితే, ప్రస్తుతం కోలీవుడ్, టాలీవుడ్, మాలీవుడ్, సాండల్ వుడ్ నుంచి వస్తున్న సినిమాలకు ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు అందుతున్నాయి. మన చిత్రాలపై ఏకంగా హాలీవుడ్ సినీ ప్రముఖులు కూడా ప్రశంసలు కురిపిస్తుండటం విశేషం. ఇప్పటికే బాహుబలి, కేజీఎఫ్, పుష్స, విక్రమ్ వంటి చిత్రాలకు ఎంతటి ఆదరణ దక్కిందో తెలిసిందే. దీంతో సౌత్ సినిమాలను చూసే దృష్టికోణం వరల్డ్ ఆడియెన్స్ లో పూర్తిగా మారిపోయింది.
మరోవైపు దక్షిణ భారతంలోని చిత్ర పరిశ్రమ నుంచి వచ్చే సినిమాలు బాక్సాఫీస్ వద్ద కూడా భారీ కలెక్షన్లను అందుకుంటున్నాయి. 1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన సినిమాల జాబితాలో సౌత్ సినిమాలే ఎక్కువగా ఉండటం విశేషం. అందులో ముఖ్యంగా తెలుగు నుంచి 4 చిత్రాలు, కన్నడ నుంచి 1 చిత్రం ఉండటం గమనార్హం. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన బాహుబలి 2, కన్నడ స్టార్ యష్ కేజీఎఫ్ : ఛాప్టర్ 2, జూ.ఎన్టీఆర్ రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప2: ది రూల్, కల్కి 2898 ఏడీ చిత్రాలు ఇప్పటి వరకు బాక్సాఫీస్ వద్ద 1000 కోట్లు కలెక్ట్ చేసిన చిత్రాలుగా రికార్డ్ లో ఉన్నాయి.

అయితే, ప్రస్తుతం రజనీకాంత్ కూలి చిత్రం 1000 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేస్తుందని తమిళ సినీ ప్రముఖులు అంచనా వేస్తున్నారు. ఫలితం ఎలా ఉంటుందనేది వేచి చూడాలి. ఇక ఇదే సమయంలో తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ 1000 కోట్ల వసూళ్లు సాధించిన ఇండియన్ సినిమాలపై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన దర్శకత్వం వహించిన లేటెస్ట్ ఫిల్మ్ మదరాసి చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్స్ చేశారు. తమిళ చిత్రాలు ఎందుకు 1000 కోట్లు కలెక్ట్ చేయడం లేదనే ప్రశ్నకు ఇలా స్పందించారు.
ఆ ప్రశ్నకు దర్శకుడు ఏఆర్ మురుగదాస్ స్పందిస్తూ.. 'తమిళ చిత్రాల్లో ఎక్కువ కథకు ప్రాధాన్యత ఉంటుంది. కోలీవుడ్ దర్శకులు ఎక్కువ తమ సినిమా ద్వారా ఎడ్యుకేషన్ పాయింట్ ఉండేలా చూసుకుంటారు. కానీ వేరే భాషల్లో వచ్చే సినిమాల్లో దర్శఖులు ఎక్కువగా ప్రజలను ఎంటర్‌టైన్ చేసే అంశాలకే ప్రాధాన్యత ఇస్తుంటారు. అందుకే ఇప్పటి వరకు సాధ్యం కాలేదేమో' అని దర్శకుడు మురుగదాస్ అభిప్రాయపడ్డారు.
ఇక ఏఆర్ మురుగదాస్ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పలువరు ఆయన్ని సమర్దిస్తుంటే.. మరికొందరు సినీ ప్రియులు మాత్రం సినిమా అనేదే ఎంటర్ టైన్ మెంట్ అని, ప్రస్తుతం టెక్నాలజీ, ఆడియెన్స్ వ్యూ పాయింట్ మారిపోయినందున ఆ స్థాయిలో మేకింగ్ ఉండాల్సిందేనని అంటున్నారు. మరోవైపు ఏఆర్ మురగదాస్ - శివ కార్తీకేయ కాంబినేషన్ లో రూపుదిద్దుకున్న మదరాసి చిత్రం సెప్టెంబర్ 5న వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.


Click it and Unblock the Notifications











