హీరో విశాల్‌తో సాయి ధన్సిక పెళ్లి.. వీరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంత ఉందో తెలుసా?
కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరియం చేయాల్సిన అవసరం లేదు. 20 ఏళ్లకు పైగా విశాల్ చిత్ర పరిశ్రమలో యాక్టివ్ గా ఉన్నారు. ఇప్పటికీ విశాల్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తూనే ఉన్న సంగతి తెలిసిందే. ఇక విశాల్ సినిమాల విషయం పక్కకు పెడితే ఆయన పెళ్లి చేసుకోకుండా ఇప్పటి వరకు బ్యాచిలర్ గానే ఉండటం సర్వత్రా సందేహాలను కలిగించింది. ఆయన ఎప్పుడు పెళ్లి చేసుకుంటారని అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఎదురు చూస్తున్నారు.
ఎప్పటి నుంచో విశాల్ తన పెళ్లి గురించి ఊరిస్తూ వస్తున్నారు. ఇప్పుడూ అప్పుడూ అంటూ వాయిదాలు వేసుకుంటూ వచ్చారు. దీంతో కోలీవుడ్ లో విశాల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా మిగిలిపోయారు. ఇక ఆయన పెళ్లి చేసుకుంటారో లేదో అనే సమయంలో తాజాగా షాక్ ఇచ్చారు. ఆగస్గు 29న విశాల్ పుట్టిన రోజు కావడంతో తన పెళ్లిైపై శుభవార్తను అందించారు. అందరూ ఆశించినట్టుగానే విశాల్ పెళ్లి గురించి వార్త అందింది. తాను ఓ ఇంటి వాడు కాబోతున్నట్టు తాజాగా ప్రకటించడంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.

ఇక తమిళ నటుడు విశాల్ కోలీవుడ్ నటి సాయి ధన్షికతో నిశ్చితార్థం చేసుకున్నట్లు ఆగస్టు 29నే వెల్లడించారు. తన 48వ పుట్టినరోజు సందర్భంగా తమ ఎంగేజ్ మెంట్ కు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియా వేదికన అభిమానులతో పంచుకున్నారు. అయితే వీరిద్దరి మధ్య 15 ఏళ్లకు పైగా పరిచయం, క్లోజ్ రిలేషన్ కొనసాగుతూ వస్తోందని కోలీవుడ్ సినీ ప్రముఖులు తెలుపుతున్నారు. ఇక రీసెంట్ గా ఒక ప్రైవేట్ వేడుకతో వీరిద్దరూ ఒక్కటయ్యారు. మొత్తానికి వీరి ఎంగేజ్ మెంట్ జరగడంతో వారి గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
ఈ క్రమంలో హీరో విశాల్ కంటే, కాబోయే భార్య హీరోయిన్ సాయి ధన్సిక వయస్సులో ఎంత చిన్నది అనే అంశం ఆసక్తికరంగా మారింది. కాగా హీరో విశాల్ 1977 ఆగస్టు 29 చెన్నైలో జన్మించారు. ప్రస్తుతం ఆయనకు 48 ఏళ్లు అవ్వడం విశేషం. ఇక సాయి ధన్షిక తమిళనాడులోనే 1989 నంబర్ 20న జన్మించింది. ప్రస్తుతం ఆమెకు 35 ఏళ్లు కావడం విశేషం. దీంతో వీరిద్దరి మధ్య 13 ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉండటంతో అంతా షాక్ అవుతున్నారు. మరీ ఇంత గ్యాప్ హా అంటున్నారు. ఏదేమైనా తమ అభిమాన హీరో పెళ్లి చేసుకుంటుండటంతో సంతోషిస్తున్నారు.
ఇక సాయి ధన్షిక తమిళ చిత్ర పరిశ్రమలో హీరోయిన్ గా మంచి గుర్తింపు దక్కించుకుంది. 2006 నుంచి నటిగా ఇండస్ట్రీలో యాక్టివ్ గా కనిపిస్తోంది. ఆమె తమిళ చిత్రం తిరుడితో హీరోయిన్ గా వెండితెరకు పరిచయం అయ్యింది.పెరన్మై, పరదేశి చిత్రాలతో మంచి ప్రశంసలు అందుకుంది. ఇక రజనీకాంత్ బ్లాక్ బస్టర్ ఫిల్మ్ కబాలి లో కీలక పాత్ర పోషించి దక్షిణాది చిత్రాల్లో క్రేజ్ దక్కించుకుంది. ఇప్పటి వరకు 23 చిత్రాల్లో నటించింది.


Click it and Unblock the Notifications











