twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కత్తి మహేష్ మన మధ్య లేడు.. మహానటులు వేడుకలో తమ్మారెడ్డి భరద్వాజ ఎమోషనల్

    |

    మిస్టర్ అండ్ మిస్ సినిమాతో రొమాంటిక్ చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు అశోక్ కుమార్ మహానటులు తెరకెక్కిస్తున్నారు. ఏబీఆర్ ప్రొడక్షన్స్ అండ్ ఏబీఆర్ ఎంటర్ టైన్ మెంట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. అభినవ్ మణికంఠ, గోల్డీ నిస్సీ, మ్యాడీ వీజే, పవన్ రమేష్, భరత్ రెడ్డి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అనిల్ బొడ్డిరెడ్డి, డాక్టర్ తిరుపతి ఆర్ యర్రంరెడ్డి నిర్మాతలు. మహానటులు పోస్టర్ లాంఛ్, క్యారెక్టర్ రివీల్ కార్యక్రమం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, సంగీత దర్శకులు అనూప్ రూబెన్స్, బిగ్ బాస్ విజేత సన్నీ తదితరులు అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా

    దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ... అశోక్, నేనూ మహేష్ కత్తి, సుధీర్ వర్మ రెగ్యులర్‌గా కలిసేవాళ్లం. అశోక్ ఏ సినిమా చేసినా నేనూ, మహేష్ కత్తి లేకుండా చేసేవాడు కాదు. మహేష్ కత్తి ఇవాళ మన మధ్య లేడు. కొత్త వాళ్లను ఎంకరేజ్ చేసేవాడు కత్తి మహేష్. అశోక్ సినిమా పిచ్చోడు. ఇతనికి బెంగళూరులో మంచి ఉద్యోగం ఉండేది. ఆ ఉద్యోగం మానేసి వచ్చి సినిమాలు చేస్తున్నాడు. చాలా రోజులు నా చుట్టూ తిరిగాడు. నేను ఉద్యోగం చేసుకోమని తిట్టేవాడిని. ఓ స్త్రీ రేపు రా అనే షార్ట్ ఫిలిం చేసి మళ్లీ నా దగ్గరకు వచ్చాడు. అశోక్ చేసిన ఓ స్త్రీ రేపు రా అనే సినిమా హిందీలో వంద కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఆయన ఇన్స్పిరేషన్ తో చేసిన సినిమా సూపర్ హిట్ అయ్యింది. అశోక్ మాత్రం ఇక్కడే ఉండిపోయాడు. కానీ ఆయన ఎదుగుతాడని ఆశిస్తున్నా. ప్రొడ్యూసర్ ఆట ఆసోసియేషన్ యాక్టివ్ గా ఉంటారు. మా అశోక్ తో సినిమా చేసినందుకు ప్రొడ్యూసర్ కు థాంక్స్ చెబుతున్నా. అశోక్ పెద్ద దర్శకుడు కావాలన్నది నా కోరిక. ఈ ఏడాది అది జరుగుతుందని కోరుకుంటున్నా. అన్నారు.

    Tamma Reddy Bhardwaja re collects Kathi Mahesh and gets emotional in Maha Natulu Event

    బిగ్ బాస్ తెలుగు 5 విజేత వీజే సన్నీ మాట్లాడుతూ...బిగ్ బాస్ లో ఈ మధ్య మహానటులను చూశా. నా ఫ్రెండ్ మ్యాడీ ఈ సినిమాలో నటించడం హ్యాపీగా ఉంది. భరద్వాజ, అనూప్ ఈ కార్యక్రమానికి రావడం సంతోషంగా ఉంది. మహానటులు కంప్లీట్ ఎంటర్ టైనర్ అర్థమవుతోంది. మంచి ట్విస్టులు ఉన్నాయట. మూవీ చాలా బాగుంటుందని అనుకొంటున్నాను. నేనూ నటుడినే, అశోక్ మమ్మల్ని కూడా చూడాలని కోరుకుంటున్నా అని అన్నారు.

    హీరోయిన్ గోల్డీ నిస్సీ మాట్లాడుతూ..నాకు ఈ చిత్రంలో అవకాశం ఇచ్చిన దర్శకుడు అశోక్ గారికి థాంక్స్. నాలాంటి న్యూ టాలెంట్ కు అవకాశం ఇవ్వడం సంతోషంగా ఉంది. మహానటులు మూవీ ఎప్పుడు రిలీజ్ అయినా తప్పక చూడండి, మంచి సినిమా. మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నా అని అన్నారు.

    దర్శకుడు అశోక్ కుమార్ మాట్లాడుతూ...టైటిల్ పెట్టినట్లు ఈ సినిమాలో అంతా మహానటులే. జాతిరత్నాలు జానర్ లో సినిమా ఉంటుంది. నేను ఇప్పటిదాకా కామెడీ జానర్ టచ్ చేయలేదు. సినిమా చేస్తున్నప్పుడు నేనూ ఎంజాయ్ చేశాను. మన చూట్టూ ఉండే ఓ నాలుగు క్యారెక్టర్స్ కథలో ఉంటారు. ఈ నలుగురు టీమ్ అప్ అయ్యి మహానటులు అనే యూట్యూబ్ ఛానెల్ ను ఎలా డెవలప్ చేశారు అనేది కథ. మీరు ఈ సినిమా ఎంజాయ్ చేస్తారని నమ్మకంగా చెప్పగలను అని తెలిపారు.

    ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ షానీ మాట్లాడుతూ..నేను నటుడిని అయితే ఈ సినిమా మా దర్శకుడు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అనే బాధ్యత అప్పగించారు. నిర్మాతలు ఈ సినిమాకు బాగా సపోర్ట్ చేశారు. క్వాలిటీలో రాజీ పడకుండా నిర్మించారు. దర్శకుడు ఎలాంటి కథను చెప్పాలనుకున్నాడో అది అనుకున్నట్లే తెరపైకి వచ్చింది అని అన్నారు.

    నిర్మాత అనిల్ బొడ్డిరెడ్డి మాట్లాడుతూ...ఏబీఆర్ ప్రొడక్షన్స్ కొత్త వాళ్లకు అవకాశం ఇవ్వాలని ప్రారంభించాం. ప్రతిభ గల కొత్త వాళ్లకు అవకాశాలు ఇస్తున్నం, ఇవ్వబోతున్నాం. ఏబీఆర్ టీవీ ప్రారంభించాం. ఇందులో జానపదాలు, బుర్రకథలు ఇలాంటి మన ప్రాచీన కళారూపాలపై డాక్యుమెంటరీలు చేస్తున్నాం. కళాకారులు ఏబీఆర్ టీవీ మన ప్లాట్ ఫామ్ అనుకోవాలి. అన్నారు.

    నిర్మాత డాక్టర్ తిరుపతి ఆర్ యర్రంరెడ్డి మాట్లాడుతూ...మా సినిమా ప్రచార కార్యక్రమానికి వచ్చిన పెద్దలకు థాంక్స్. నాకు సినిమా ఇండస్ట్రీతో పరిచయం లేదు. నా మిత్రుడు అనిల్ బొద్దిరెడ్డి గారు గతంలో సినిమాలు ప్రొడ్యూస్ చేశారు. మిస్టర్ అండ్ మిస్ సినిమా చూసి అశోక్ తో కొత్త సినిమా ప్లాన్ చేస్తుంటే నేనూ జాయిన్ అయితా అని చెప్పాను. అలా ఈ ప్రాజెక్ట్ లోకి వచ్చాను. ఈ మధ్యే మహానటులు సినిమా చూశాను. చాలా బాగా వచ్చింది. ఇక రెగ్యులర్ గా సినిమాలు చేయాలని ప్లాన్ చేస్తున్నాము. త్వరలో ఎమ్మెల్యే సీతక్క బయోపిక్ చేయబోతున్నాం. అన్నారు.

    సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ మాట్లాడుతూ...మహానటులు టీజర్ చూశాను చాలా ఎంటర్ టైనింగ్ గా ఉంది. సినిమా బాగా నవ్విస్తుందని ఆశిస్తున్నాను. సినిమా హిట్ కావాలని..ఎంటైర్ టీమ్ కు ఆల్ ద బెస్ట్ చెబుతున్నాను అని అన్నారు.

    సంగీత దర్శకుడు మార్కస్ ఎం మాట్లాడుతూ...ఈ సినిమాలో నాలుగు సాంగ్స్ ఉంటాయి. అన్నీ సందర్భానుసారం వచ్చేవే. మంచి ఆల్బమ్ అవుతుంది. నాకీ అవకాశం ఇచ్చిన దర్శకుడు అశోక్ గారికి థాంక్స్ అని అన్నారు.

    సంగీతం, కథ, మాటలు: పి సుధీర్ వర్మ
    సినిమాటోగ్రఫీ: సిద్ధం నరేష్
    మ్యూజిక్ మార్కస్ ఎం
    ఎడిటింగ్: కార్తీస్ కట్స్,
    ఆర్ట్: హేమంత్ కుమార్ జి.
    కాస్ట్యూమ్స్: తనూజ మాలపాటి,
    ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: షానీ సాల్మన్
    సాహిత్యం: ఫణి కృష్ణ సంకెపల్లి, పవన్ రాచపల్లి
    నిర్మాతలు: అనిల్ బొడ్డిరెడ్డి, డాక్టర్ తిరుపతి ఆర్ యర్రంరెడ్డి,
    దర్శకత్వం - అశోక్ రెడ్డి

    English summary
    Maha Natulu movie Character reveal Event went high note. Tamma Reddy Bhardwaja re collects Kathi Mahesh and gets emotional in Maha Natulu Event.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X