twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘‘నెగెటివ్‌గా తీసుకుంటే వాళ్ల ఖర్మ... రాజమౌళి ఏమైనా దేవుడా?’’

    |

    తెలుగు దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ సందర్భం వచ్చినపుడల్లా తెలుగు హీరోలపై విమర్శలు చేస్తుండం తరచూ చూస్తూనే ఉన్నాం. ఈయన గారికి ఎందుకు తెలుగు హీరోలంటే ఇంత కోపం? ఎప్పుడు చూసినా వారిలో లోపాలు వెతుకుతూ ఏదో ఒక విషయంలో విమర్శలు చేస్తూనే ఉంటారెందుకు అనే సందేహాలు చాలా మందిలో ఉన్నాయి. ఈ అంశంపై తాజాగా తమ్మారెడ్డి ఇంటర్వ్యూలో వివరణ ఇచ్చారు.

    ''నాకు టాలీవుడ్ స్టార్ హీరోల మీద కోపం ఉందనేది నిజం కాదు, వాళ్లంతా చాలా మంచి పిల్లలు... కాకపోతే ఎప్పుడూ వారు గీసుకున్న సర్కిల్‌లోనే ఉండి ఆలోచిస్తారే తప్ప అంతకు మించి ఆలోచించడం లేదు అనేదే నా ఆవేదన. అందుకే కొన్ని సార్లు నాలోని అసంతృప్తి వ్యక్తం చేశానే తప్ప... వారిపై కోపం ఎప్పుడూ లేదు'' అన్నారు.

    తెలుగు సినిమా రేంజి చాలా పెద్దది

    తెలుగు సినిమా రేంజి చాలా పెద్దది

    తెలుగు సినిమా రేంజి చాలా పెద్దది అని మొదటి నుంచీ చెబుతూనే ఉన్నాను. మన హీరోలు వంద కోట్లు చేస్తే చాలు అనే ఫీలింగులో ఉంటారు. ప్రతి హీరో బాహుబలి స్థాయి సినిమా చేయడానికి ఎందుకు ప్రయత్నించరు? అనేది నా ప్రశ్న. 2 వేల కోట్లు ఒక తెలుగు సినిమాకు వచ్చినపుడు ఇతర హీరోలకు ఎందుకు రావు? ఎందుకు వారు ఆ దిశగా ఆలోచించడం లేదని తమ్మారెడ్డి ప్రశ్నించారు.

    నమ్మితే అన్ని సినిమాలు భారీ స్థాయిలో వస్తాయి

    నమ్మితే అన్ని సినిమాలు భారీ స్థాయిలో వస్తాయి

    బాహుబలి కథ మామూలు కథే. అంత బడ్జెట్ పెట్టారంటే దర్శకుడితో పాటు నిర్మాత, హీరో, హీరోయిన్ నమ్మారు కాబట్టే అంత రేంజిలో వచ్చింది. ఇతర హీరోలు కూడా అలా నమ్మితే బాహుబలి లాంటి భారీ సినిమాలు తెలుగులో వస్తాయి. అలా నమ్మరు కాబట్టే కొందరి మీద నాకు కోపం, ఇండస్ట్రీ స్థాయి పెరగాలనేదే నా ఇంటెన్షన్ అని తమ్మారెడ్డి అభిప్రాయ పడ్డారు.

    నెగెటివ్‌గా తీసుకుంటే వారి ఖర్మ

    నెగెటివ్‌గా తీసుకుంటే వారి ఖర్మ

    ఒక బాహుబలితోనే మనం ఎందుకు ఆగాలి? నాలుగేళ్లయినా ఆ స్థాయిలో మరో సినిమా ఎందుకు రాలేదు? బాహుబలి లాంటి సినిమాను తెలుగు ఇండస్ట్రీ నుంచి ఎవరైనా ఊహించారా? భారతదేశంలోనే ఎవరూ చేయని పెద్ద ప్రాజెక్ట్ అది. అలాంటి ఆలోచన ఇంకా ఎవరికీ రావడం లేదనే నా భాధంతా... నా కోపం అంతా కూడా పాజిటివ్ కోపం. దాన్ని వాళ్లు నెగెటివ్‌గా తీసుకుంటే వారి ఖర్మ తప్ప మరేమీ లేదని తమ్మారెడ్డి వ్యాఖ్యానించారు.

    రాజమౌళి ఏమైనా దేవుడా?

    రాజమౌళి ఏమైనా దేవుడా?

    రాజమౌళి నమ్మించాడు కాబట్టి వారు ఆ సినిమా చేశారు అనడం కరెక్ట్ కాదు... రాజమౌళి ఏమైనా దేవుడా? ఆయన మాదిరిగానే చాలా మంది సక్సెస్ ఇచ్చినవారు ఉన్నారు. రాజమౌళి 5 ఏళ్ల పాటు హీరో హీరోయిన్‌ను హోల్డ్‌లో పెట్టారని కొందరు అంటున్నారు. ప్రతి ఒక్కరూ ఆ సినిమా హీరో, హీరోయిన్ మాదిరిగా నమ్మకంగా ఉంటే బాహుబలి లాంటి విజయం సాధ్యమే అని తమ్మారెడ్డి చెప్పుకొచ్చారు.

    English summary
    Tammareddy Bharadwaj about Director Rajamouli and Baahubali movie. Tammreddy Bharadwaja is an Indian film producer and director. He is one of the successful Telugu film producers. He is the son of veteran producer Tammareddy Krishna Murthy.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X