twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Pawan Kalyan: కూర్చుంటే సెటిల్ అయ్యేదానికి, బూతులు అవసరమా?..పోసానిది తప్పే.. తమ్మారెడ్డి సంచలనం

    |

    తెలుగు సినిమా పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్య ఆంధ్రప్రదేశ్ లో టికెట్ల వ్యవహారం నడుస్తున్న సంగతి తెలిసిందే. అయితే అనూహ్యంగా ఈ వ్యవహారం మీద పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేయడంతో వివాదం ముదిరి చాలా దూరం వెళ్ళింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కూడా నడుపుతూ ఉన్న నేపథ్యంలో ఆయన రాజకీయ విమర్శలు చేశారని సినిమా ఇండస్ట్రీ వేరు పవన్ కళ్యాణ్ వేరు అన్నట్లుగా తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు ఒక లేఖ విడుదల చేశారు.

    దీంతో అసలు వివాదం ఏమిటి? పవన్, పోసాని మధ్య ఎందుకు ఈ బూతులు అంటూ తాజాగా తమ్మారెడ్డి భరద్వాజ తన యూట్యూబ్ ఛానల్ లో ఒక వీడియో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఆ వివరాల్లోకి వెళితే

    Uttej Wife Padmavathi: సంస్మరణ సభకు చిరు సహా సినీ పెద్దలు.. ఎమోషనల్ అయిన చిరు!Uttej Wife Padmavathi: సంస్మరణ సభకు చిరు సహా సినీ పెద్దలు.. ఎమోషనల్ అయిన చిరు!

    ఇప్పటి వ్యవహారం కాదిది

    ఇప్పటి వ్యవహారం కాదిది

    ముందుగా తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ నిజానికి సినిమా టిక్కెట్లు ఆన్లైన్ చేయాలనే ఆలోచన ఇప్పటిది కాదని 2006వ సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న వైయస్ రాజశేఖర్ రెడ్డి ఒక జీవో జారీ చేశారని అన్నారు. తాను అప్పట్లో ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ గా ఉన్నానని అయితే అప్పటి నుంచి కూడా ఆ జీవో అమలు కాలేదని అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ ఈ మధ్య కాలంలో ఎవరైనా పర్సనల్ గా వెళ్లి కలిశారో లేక ప్రభుత్వమే ఈ జీవోని అమల్లోకి తీసుకు రావాలని యోచించిందో తెలియదుగానీ ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయని అన్నారు.

    అసలు ఆన్లైన్ చేయడం అని కోరడం వెనుక అసలు కారణాలు ఏమిటంటే ఒక పారదర్శకత కోసం అని అన్నారు. ఎవరికి వాళ్లు 30 కోట్లు 40 కోట్లు వందల కోట్లు అంటూ ఎవరికి నచ్చిన లెక్కలు చెబుతున్నారని అలా కాకుండా ఒక నిర్దిష్టమైన వెరిఫైడ్ అకౌంట్ ద్వారా వివరాలు వెల్లడి కావాలనే ఉద్దేశంతో ఈ మేరకు కోరామని అన్నారు.

    అప్పట్లో వాళ్ళు వెళ్లే వారు

    అప్పట్లో వాళ్ళు వెళ్లే వారు

    ఇక ఇండస్ట్రీ సమస్యలపై ప్రభుత్వ విధానం గురించి మాట్లాడితే ఇండస్ట్రీ నుంచి ఎవరు వెళ్లినా అది ఇండస్ట్రీకి సంబంధించిన జరిగే చర్చలు అని తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు.. సాధారణంగా ప్రభుత్వంతో ఎవరికైతే ఎక్కువ పరిచయాలు ఉంటాయో వాళ్ళు వెళ్లి సంప్రదింపులు జరుపుతారని గతంలో చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అక్కినేని నాగేశ్వరరావు వెళ్లేవారని ఆ తర్వాత కృష్ణ గారు ప్రభుత్వాలతో మాట్లాడే వారని అలా ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక ఆయన ఎలాగూ సినీరంగానికి చెందిన వాడు కాబట్టి ఆయనతో నేరుగా సంప్రదింపులు జరిపే అవకాశం వచ్చిందని అన్నారు.

    ఇక ఆ తర్వాత ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి లాంటి వారి దగ్గర వరకు కూడా చాలా ఈజీగా వెళ్లి కలిసే వాళ్లని అయితే ఎప్పుడైతే రాష్ట్రం విడిపోదో అప్పటి నుంచి ఈ వ్యవహారంలో కాస్త ఇబ్బందులు ఉన్నాయని చెప్పుకొచ్చారు.

    మనం అడిగింది ఒకటి వాళ్లకు అర్ధం అయింది ఒకటి

    మనం అడిగింది ఒకటి వాళ్లకు అర్ధం అయింది ఒకటి

    నిజానికి టికెట్ వ్యవహారంలో ప్రభుత్వాన్ని కోరింది ఒకటయితే వాళ్లకు అర్థం అయింది మరొకటని ఈ విషయం మీద కూర్చుని మాట్లాడుకునే దానికి ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకునే దాకా వెళ్ళింది అని అన్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి జనసేన అనే ఒక పార్టీ ఉండడంతో ఆయన రాజకీయాల గురించి మాట్లాడితే అది రాజకీయ ప్రెస్ మీట్ గానే ఉంటుంది కాబట్టి తెలుగు ఫిలిం ఛాంబర్ కూడా ఈ విషయంలో తమకు సంబంధం లేదని ఒక ప్రెస్ నోట్ విడుదల చేసిందని అన్నారు.

    పోసాని కరెక్ట్ కాదు

    పోసాని కరెక్ట్ కాదు

    ఒక రాజకీయ నాయకుడిగానే ఆయన మాట్లాడిన మాటలు కనిపించాయని ఈ విషయం లో పోసాని కృష్ణమురళి అసలు అసందర్భంగా ఎంటర్ అయ్యారు అని చెప్పుకొచ్చారు. ఆయన అనవసరంగా ఎంటర్ అయి పవన్ పర్సనల్ విషయాలు తీసుకువచ్చారు అని తమ్మారెడ్డి భరద్వాజ పేర్కొన్నారు. అయితే ఆయన కూడా వైసీపీ స్పోక్స్ పర్సన్ కావడంతో ఆయన కూడా పార్టీ పరంగానే మాట్లాడి ఉండొచ్చు కానీ ఇలా వ్యక్తిగత అంశాలను ఎత్తి చూపడం కరెక్ట్ కాదని అన్నారు.

    Recommended Video

    Megastar Chiranjeevi Emotional Speech | Actor Uttej | Tollywood || Filmibeat Telugu
    పవన్, పోసాని ఇది అవసరమా?

    పవన్, పోసాని ఇది అవసరమా?

    అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్న ప్రతి మంత్రి అలాగే పోసాని కృష్ణమురళి కూడా సమాజానికి చాలా అవసరమైన వ్యక్తులని వాళ్ళు ఒకరికి ఒకరు దూషించుకోవడం, నోరు జారడం అవసరమా అని ప్రశ్నించారు. అలాగే బూతులు మాట్లాడుకోవాల్సి వచ్చిన అవసరం ఏమిటి అని ప్రశ్నించిన తమ్మారెడ్డి భరద్వాజ తమ అభిమాన నటులు అలా మాట్లాడుతున్నారు కదా అని వాళ్ళ అటెన్షన్ పొందేందుకు ఫ్యాన్స్ కూడా బూతులు వాడుతున్నారని రాజకీయ నాయకులు అభిమానులు సైతం ఇలా బూతులు మాట్లాడటం అవసరమా మనం ఎటు వెళుతున్నాం అని తమ్మారెడ్డి భరద్వాజ ప్రశ్నించారు.

    ఎంతో సీరియస్ ఇష్యూ అయిన డ్రగ్స్ వ్యవహారాన్ని కూడా పక్కనపెట్టి ఇప్పుడు మీడియా సైతం పవన్ కళ్యాణ్ పోసాని కృష్ణమురళి మీద ఫోకస్ చేసిందని ఇది ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. అయితే ప్రభుత్వంతో సినిమా టికెట్ విషయం మీద కొంత క్లారిటీ తీసుకోవాల్సి ఉందని మాత్రం తమ్మారెడ్డి భరద్వాజ అభిప్రాయపడ్డారు.

    English summary
    Tammareddy Bharadwaj responded About Pawan Kalyan Republic Speech and posani issue.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X