For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ముద్దు సీన్లు అవసరమే.. బూతు సినిమాలు వేరు, జీవితను ఎందుకు పిలిచారు?: తమ్మారెడ్డి

  |

  ''అర్జున్ రెడ్డి, ఆర్ఎక్స్ 100 వచ్చిన తర్వాత తెలుగులో ఎవరూ ముద్దు సీన్లు లేకుండా సినిమాలు తీయడం లేదు, బెడ్రూం సీన్లు, శృంగార సీన్లతో సినిమాను నింపేస్తున్నారు, ప్రైవేటుగా చేసే పనులు ఇలా పబ్లిక్‌గా సినిమాల్లో చూపిస్తూ చండాలం చేస్తున్నారు' అంటూ నటి జీవిత 'డిగ్రీ కాలేజ్' టీజర్ లాంచ్ ఈవెంటులో అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

  ఈ వివాదంపై దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు. '''డిగ్రీ కాలేజ్' డైరెక్టర్ నరసింహ నంది గతంలో '1940లో ఓ గ్రామం' అనే సినిమా తీసి జాతీయ అవార్డు దక్కించుకున్నారు. కానీ డబ్బులు రాలేదు. తర్వాత ఓ బూతు సినిమాలు తీస్తే డబ్బులు వచ్చాయి కానీ విమర్శల పాలయ్యాడు. మూడో సినిమాగా 'కమలతో నా ప్రయాణం' అనే మంచి సినిమా చేశాడు. కానీ జనం చూడలేదు. అతడు మంచి డైరెక్టర్, మంచి ప్రయత్నాలే చేస్తున్నాడు.. డబ్బులు రాకపోయే సరికి ప్రస్టేషన్ వచ్చి ఇలాంటి సినిమాలు తీస్తున్నాడేమో అనే అనుమానం కలుగుతుందన్నారు.

  అందుకే ఆ సీన్లు పెట్టాడేమో?

  అందుకే ఆ సీన్లు పెట్టాడేమో?

  ‘డిగ్రీ కాలేజ్' మూవీలో రియల్‌గా జరిగిన కథే తీశాను అంటున్నాడు. వాస్తవ సంఘటన ఆధారంగా తీసే సినిమా కాబట్టే ముద్దు సీన్లు, శృంగార సీన్లు పెట్టాడేమో అనిపిస్తుంది. ఇక్కడ జీవిత వాదన, నరసింహ నంది వాదన సమంజసమే అయినప్పటికీ... ముద్దు సీన్లు ఉన్నంత మాత్రాన సినిమాను బూతు కేటగిరీలో వేయడం సరికాదని తమ్మారెడ్డి అన్నారు.

  కొన్ని కథలకు ముద్దు సీన్లు అవసరమే

  కొన్ని కథలకు ముద్దు సీన్లు అవసరమే

  కొన్ని సినిమాలకు నిజంగా బెడ్రూంలో జరిగే విషయాలు, ఫ్రైవేట్ సిచ్యువేసన్స్ చూపించాల్సిన అవసరం ఉంటుంది. ఉదాహరణకు ‘ఆర్ఎక్స్ 100'లో ముద్దు సీన్ ఉంటే తప్ప కథ ఉండదు. ఆ సినిమా కథే ఆ ముద్దు సీన్ మీద ఆధారపడి ఉంటుంది. అటువంటి కథలకు అది తప్పకుండా అవసరమే. నరసింహ నంది చేసే ‘డిగ్రీ కాలేజ్' కథ కూడా అలాంటిదే అయ్యుండొచ్చేమో? సినిమా విడుదలైతే కానీ చెప్పలేమన్నారు.

  అలాంటి సినిమాలు తీసిన దర్శకులను, నిర్మాతలను బాయ్‌కాట్ చేసినా తప్పులేదు

  అలాంటి సినిమాలు తీసిన దర్శకులను, నిర్మాతలను బాయ్‌కాట్ చేసినా తప్పులేదు

  కొన్ని సినిమాలు కేవలం బూతు సీన్లు, డైలాగులు ఉంటేనే చూస్తారు అని నమ్మి తీస్తారు. అలాంటి సినిమాలు తీసిన దర్శకులను, నిర్మాతలను బాయ్‌కాట్ చేసినా తప్పులేదు. కానీ ఎవరైతే కంటెంట్ కోసం చేస్తారో వాళ్లను ఆపటం కరెక్ట్ కాదు. కంటెంటుకు అవసరాన్ని బట్టి ఆ సీన్లు ఉంటాయి. వాటిని మనం అంగీకరించాల్సిన అవసరం ఉంది. జనం కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు.. దానికి మనం అభ్యంతరం తెలపాల్సిన అవసరం లేదని తమ్మారెడ్డి అభిప్రాయ పడ్డారు.

  జీవితను పిలవాల్సింది కాదు

  జీవితను పిలవాల్సింది కాదు

  జీవిత సెన్సార్ బోర్డు మెంబర్ అనో, పొలిటికల్ పార్టీకి చెందిన వ్యక్తి అనో, ఉమెన్ యాక్టివిస్ట్ అనో ఆలోచించి ఎవరూ సినిమా చేయరు. దర్శకుడికి వచ్చిన ఆలోచన, దాని చుట్టూ అల్లుకున్న కథ ప్రకారం అతడు చేసుకుంటూ వెళతాడు. అది అలా చేయకూడదు అనడానికి మన హక్కు లేదు. నచ్చకపోతే చూడకూడదు. అయితే ఇక్కడ జీవిత చెప్పే పాయింట్ ఏమిటంటే... ఇలాంటి సినిమాలు తీసినపుడు నన్ను గెస్టుగా పిలవకూడదు, పిలిస్తే ఇలానే మాట్లాడతాను అంటోంది. ఆవిడను పిలవకుండా ఉంటే బావుండేదేమో? తమ్మారెడ్డి వ్యాఖ్యానించారు.

  English summary
  Tammareddy Reacts to Jeevitha's Comment about Degree College Director Narasimha Nandi. He says Jeevitha invited as a guest, but Blasts Degree College movie makers. Jeevitha argued that it will be unwise for her to attack the film after being invited a guest, but stated that she can't control her inner emotion.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X