twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇంత సక్సెస్ వస్తుందని అనుకోలే.. అలా వర్కవుట్ అయింది.. తరుణ్ భాస్కర్

    |

    రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి కథానాయకులుగా నటించిన డార్క్ కామెడీ సినిమా 'మిఠాయి'. ప్రశాంత్ కుమార్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. రెడ్ యాంట్స్ పతాకంపై డాక్టర్ ప్రభాత్ కుమార్ చిత్రాన్ని నిర్మించారు. వివేక్ సాగర్ సంగీతం అందించారు. ఫిబ్రవరి 22న సినిమా విడుదలవుతోంది. వివేక్ సాగర్ సంగీతం అందించిన సినిమా పాటల్ని శుక్రవారం రాత్రి విడుదల చేశారు.

    'పెళ్లి చూపులు', 'ఈ నగరానికి ఏమైంది' చిత్రాల దర్శకుడు తరుణ్ భాస్కర్ బిగ్ సీడీ, ఆడియో సీడీలను ఆవిష్కరించారు. తొలి సీడీని 'హుషారు' దర్శకుడు శ్రీహర్ష కొనుగంటి స్వీకరించారు.

    ఈ కార్యక్రమంలో దర్శకులు తరుణ్ భాస్కర్, శ్రీహర్ష కొనుగంటి, క్రాంతి మాధవ్ మాట్లాడారు.

    యాక్టర్ అవ్వలేదు. డైరెక్షన్ చేస్తున్నా

    యాక్టర్ అవ్వలేదు. డైరెక్షన్ చేస్తున్నా

    తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ "అందరూ అనుకున్నట్టు నేనింకా యాక్టర్ అవ్వలేదు. డైరెక్షన్ చేస్తున్నా. కాకపోతే... అనుకోకుండా రోల్స్ రావడంతో చేస్తున్నా. యాక్టింగ్ చాలా కష్టమనేది కూడా అర్థమైంది. 'మిఠాయి' విషయానికి వస్తే... ఈ సినిమా చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది. ప్రశాంత్‌తో మాట్లాడినప్పుడు... సరదాగా షూటింగ్ చేశామన్నారు. టీమ్ అందరూ ఎంజాయ్ చేస్తూ, ఆడుతూ పాడుతూ చేసిన సినిమాలను ప్రేక్షకులు అందరూ ఆదరిస్తారని అనుకుంటున్నా అని అన్నారు.

     ప్రేక్షకులు ఇంతగా ఆదరిస్తారని

    ప్రేక్షకులు ఇంతగా ఆదరిస్తారని

    రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి నా స్నేహితులు. మేమంతా కలిసి ఆడుతూ పాడుతూ 'సైన్మా', 'పెళ్లి చూపులు' చేశాం. మమ్మల్ని ప్రేక్షకులు ఇంత ఆదరిస్తారని, ఇంత సక్సెస్ అవుతానని ఎప్పుడూ అనుకోలేదు. మాకు నచ్చినది చేశాం. వర్కౌట్ అయింది. మిఠాయి చూస్తున్నప్పుడు ఈ టీమ్ అంతా నచ్చిన పనిని ఎంజాయ్ చేస్తూ చేశారని ఫీలింగ్ కలిగింది అని తరుణ్ భాస్కర్ అన్నారు.

    డార్క్ హ్యూమర్‌ కథతో

    డార్క్ హ్యూమర్‌ కథతో

    దర్శకుడు శ్రీ హర్ష కొనగంటి మాట్లాడుతూ "నా ఫ్రెండ్ రాహుల్ రామకృష్ణ హీరోగా నటించిన చిత్రమిది. మేం 'హుషారు' షూటింగ్ చేసేటప్పుడు ఈ సినిమా గురించి రాహుల్ రామకృష్ణ చాలా మంచి మంచి విషయాలు చెప్పేవారు. ప్రేక్షకులు అందరిలా నేను కూడా ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా? ఎప్పుడు చూస్తామా? అని ఎదురుచూస్తున్నా. డార్క్ హ్యూమర్ సినిమాలంటే నాకు చాలా ఇష్టం" అన్నారు.

    సినిమా హిట్టవుతుందని అనుకొంటున్నా

    సినిమా హిట్టవుతుందని అనుకొంటున్నా

    దర్శకుడు క్రాంతి మాధవ్ మాట్లాడుతూ.. ఈ సినిమా దర్శకుడు ప్రశాంత్, నేనూ క్లాస్ మేట్స్. మేము ఇద్దరం ఒకటే కాలేజీలో చదువుకున్నాం. ఆల్మోస్ట్ రూమ్మేట్స్ కూడా. కాలేజీ రోజుల నుంచి ప్రశాంత్ కు సినిమాలంటే చాలా ఇష్టం. మాకు చాలా విషయాలు చెప్పేవాడు. లక్కీగా నేను ముందు దర్శకుడు అయ్యా. 'మిఠాయి'తో ప్రశాంత్ దర్శకుడిగా మారుతున్నాడు. ఈ సినిమా హిట్టవుతుందని అనుకుంటున్నా. ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, ప్రశాంత్.. అందరికీ ఆల్ ద బెస్ట్. ఈ రోజు హీరో వివేక్ సాగర్. మంచి మ్యూజిక్ ఇచ్చాడు" అన్నారు.

    English summary
    The audio release function of 'Mithai' was held on Friday at the famous Hylife pub in Hyderabad. It was a grand event full of 'masthi' and LIVE performances. The dark comedy, starring Rahul Ramakrishna and Priyadarshi in the lead roles, has been produced by Prabhat Kumar on Red Ants banner. Ahead of the promising film's release on February 22, the audio event saw the makers talk about their product and give a glimpse into what is in store in the movie.The big CD and audio CD was unveiled by 'Pelli Choopulu' director Tharun Bhascker. 'Husharu' director Sri Harsha Konuganti received the first CD.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X