#TheFamilyMan2 : ది వెయిట్ ఈజ్ ఓవర్.. తెలుగు ఆడియన్స్ కి కొత్త టెన్షన్?
తెలుగు వారే కాక దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ సెకండ్ సీజన్ ప్రకటించిన సమయం కంటే కాస్త ముందుగానే రిలీజ్ అయింది. నిజానికి ఈ సీజన్ నాలుగో తేదీ నుంచి స్ట్రీమ్ అవుతుందని అమెజాన్ ప్రైమ్ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఆ లెక్క ప్రకారం మూడో తేదీ రాత్రి 12 గంటల తరువాత ఈ ఈ సిరీస్ అందుబాటులోకి రావాల్సి ఉంది. కానీ కొన్ని గంటల ముందుగానే దీనిని రిలీజ్ చేశారు. అయితే ఇప్పుడు ఈ రిలీజ్ విషయంలో తెలుగు ప్రేక్షకులు సహా మిగతా భాషల ప్రేక్షకులకు టెన్షన్ నెలకొంది అని చెప్పవచ్చు.
ఎందుకంటే ఈ సిరీస్ కు సంబంధించిన హిందీ ఆడియో మాత్రమే అమెజాన్ ప్రైమ్ సంస్థ ప్రస్తుతానికి అందుబాటులో ఉంచింది. నిజానికి ఈ సిరీస్ అన్ని భారతీయ భాషలలో రిలీజ్ చేస్తామని గతంలో మేకర్స్ ప్రకటించారు. కానీ ఏమైందో ఏమో ఈ సిరీస్ కేవలం హిందీలో మాత్రమే రిలీజ్ అయింది. అయితే దీనికి తమిళ వాసుల ఆందోళన కారణమనే వాదన కూడా వినిపిస్తోంది. ఇప్పటికే తమిళనాడు ప్రభుత్వం సహా చాలామంది తమిళనాడు నేతలు ఈ కంటెంట్ నిషేధించాలని కోరుతూ కేంద్ర సమాచార శాఖకు లేఖలు రాశారు.

ఈ నేపధ్యంలోనే ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదనే ఉద్దేశంతో ముందుగా దీనిని రిలీజ్ చేసి ఉంటారని అంటున్నారు. గతంలో కూడా ఇలాగే వివాదాస్పదమైన మిర్జాపూర్ సెకండ్ సిరీస్ కూడా కేవలం హిందీ వర్షన్ లో రిలీజ్ చేశారు ముందుగా. తర్వాత కొన్ని రోజులకు తెలుగు సహా ఇతర భాషల ఆడియోని అందుబాటులోకి తీసుకొచ్చారు. దీంతో ఈ షో విషయంలో కూడా అదే పద్ధతి అవలంబిస్తారేమో అన్న భయంలో తెలుగు సహా ఇతర భాషల ప్రేక్షకులు మునిగిపోయారు. మరి అమెజాన్ ప్రైమ్ సంస్థ దీనికి ఎలా సమాధానం ఇస్తుందో వేచి చూడాలి మరి.


Click it and Unblock the Notifications











