Don't Miss!
- News
Vastu tips: ఇంటికెళితే చిరాకులా.. అన్నీ సమస్యలా.. బయటపడేందుకు చెయ్యాల్సిందిదే!!
- Sports
విరాట్ కోహ్లీ-రోహిత్ శర్మ మధ్య విభేదాలు నిజమే: మాజీ ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్
- Finance
adani issue: అదానీ వ్యవహారంపై స్పందించిన కేంద్ర మంత్రి.. హెచ్చుతగ్గులు సాధారణమేనంటూ వ్యాఖ్యలు
- Lifestyle
మీ సెక్స్ జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి ఇలా చేయండి..సెక్స్ లో ఆనందాన్ని పొందండి!
- Technology
ఐఫోన్ 14 పై రూ.12000 వరకు ధర తగ్గింది! ఆఫర్ ధర ,సేల్ వివరాలు!
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
The Kashmir Files నటి పల్లవి జోషికి ప్రమాదం.. షూటింగులో తీవ్ర గాయాలు!
జాతీయస్థాయిలో సంచలన విజయం సాధించడమే కాకుండా అవార్డులను గెలుచుకొన్న చిత్రం ది కాశ్మీర్ ఫైల్స్. ఈ సినిమాలో ప్రొఫెసర్ రాధిక మీనన్ పాత్రతో ప్రేక్షకుల ఆదరణ పొందిన పల్లవి జోషి ప్రమాదానికి గురయ్యారు. దర్శకుడు వివేక్ అగ్నిహోత్రికి భార్యగా సుపరిచితులైన నటి పల్లవి జోషి హైదరాబాద్‌లో జరుగుతున్న ది వాక్సిన్ వార్ సినిమా షూట్‌లో జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ఈ యాక్సిడెంట్ వివరాల్లోకి వెళితే..
ప్రపంచవ్యాప్తంగా సినీ విమర్శకుల ప్రశంసలు పొందడమే కాకుండా రికార్డు కలెక్షన్లు సాధించిన ది కాశ్మీర్ ఫైల్స్ తర్వాత భర్త వివేక్ అగ్నిహోత్రి రూపొందిస్తున్న ది వాక్సిన్ వార్ సినిమాలో పల్లవి జోషి కీలక పాత్రను పోషిస్తున్నది. ఈ సినిమా షూటింగు హైదరాబాద్‌లో నిర్విరామంగా జరుగుతున్నది. కీలక సన్నివేశాలను శరవేగంగా పూర్తి చేస్తున్నారు.

తాజాగా జనవరి 16వ తేదీన జరుగుతున్న షూటింగులో ప్రమాదవశాత్తూ వాహనం వచ్చి పల్లవి జోషిని ఢీకొట్టింది. వాహనం వేగంగా వచ్చి కొట్టగానే ఆమె పడిపోయింది. పల్లవి జోషికి తీవ్ర గాయాలు అయ్యాయి. వాహనంపై డ్రైవర్ అదుపుకోల్పోవడంతో ఆమె మీదకు వాహనం దూసుకెళ్తింది. దాంతో ఆమెకు తీవ్ర గాయాలు అయినట్టు సమాచారం. గాయపడిన ఆమెను వెంటనే హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నట్టు సమాచారం. ఆమె ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందని యూనిట్ వర్గాలు వెల్లడించాయి.
పల్లవి జోషి కెరీర్ విషయానికి వస్తే.. హిందీ, మరాఠీ, గుజరాతీ, మలయాళ, కన్నడ భాషల్లో నటించింది. బాలనటిగా ప్రవేశించిన ఆమె.. బాలీవుడ్‌లో కూడా పలు చిత్రాల్లో నటించింది. హిందీ టెలివిజన్ రంగంలో సీరియల్ నటిగా అత్యంత ప్రేక్షకాదరణ ఉంది. తహల్కా, తలాష్, సూరజ్ కా సాత్వా ఘోడా, బుద్దా ఇన్ ఏ ట్రాఫిక్ జామ్, ది తాష్కెంట్ ఫైల్స్, ది కాశ్మీర్ ఫైల్స్ సినిమాల్లో నటించింది. ప్రస్తుతం ది వ్యాక్సిన్ వార్‌లో నటిస్తున్నది.
ఇదిలా ఉండగా, అభిషేక్ అగర్వాల్ నిర్మాతగా వ్యవహరించిన 95వ ఆస్కార్ అవార్డుల వేడుకలో ది కాశ్మీర్ ఫైల్స్ అవార్డు కోసం పోటీ పడుతున్న విషయం తెలిసిందే.