Raja Saab Trailer Review: ప్రభాస్ వన్ మ్యాన్ షో ‘ది రాజాసాబ్’.. సంక్రాంతికి స్టార్ వార్ పక్కా..

The Raja Saab Trailer Review: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న హైలీ యాంటిసిపేటెడ్ హారర్-కామెడీ థ్రిల్లర్ 'ది రాజా సాబ్'.టాలీవుడ్‌ దర్శకుడు మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. హారర్-కామెడీ జానర్‌లో రూపొందుతున్న ఈ చిత్రంలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ ఫీమేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారని తెలిపారు. ఈ ఏడాది సమ్మర్‌లో ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమా కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. చివరగా సంక్రాంతి కానుకగా 2026 జనవరి 9న రిలీజ్ చేయాలని ఫిక్స్ అయింది. తాజాగా ఈ హారర్-కామెడీ థ్రిల్లర్ 'ది రాజా సాబ్'ట్రైలర్ వచ్చేసింది.

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, గ్లింప్స్‌ను మంచి రెస్పాన్స్ వస్తోంది. మెయిన్ గా ప్రభాస్ సూపర్ స్టైలిష్‌ లూక్ ట్రెండింగ్ గా మారింది. ఈ సినిమాలో ప్రభాస్ కొత్త లుక్‌లో దర్శనమిచ్చడం అభిమానులకు పెద్ద విజువల్ ట్రీట్‌గా మారింది. ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌లో టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా సోమవారం సాయంత్రం 6 గంటలకు ది రాజా సాబ్ ట్రైలర్ (The Raja Saab Trailer) విడుదల అయింది.

The Raja Saab Trailer Review Prabhas Stuns in Vintage Darling Look with Horror-Comedy Twist

రాజాసాబ్ ట్రైలర్ కట్‌లో ప్రభాస్ వింటేజ్ డార్లింగ్ లుక్‌లో కనిపించి, అభిమానుల్లో కొత్త జోష్ తీసుకవచ్చారు. ఇలాంటి పాత్రలో ప్రభాస్‌ను ఎప్పుడు చూడాలని లేదు డార్లింగ్ ఫ్యాన్స్. ట్రైలర్‌లో ప్రభాస్ వన్ మ్యాన్ షో లాగా పర్ఫార్మ్ చేయడం, తన స్టైలిష్ లుక్స్‌తో ప్రేక్షకులను కన్నువిందు చేశారు. ట్రైలర్‌లో హారర్ ఎలిమెంట్స్ ను మారుతి నెక్స్ట్ లెవల్‌లో చూపించారు. సాధారణ కామెడీ, రొమాన్స్ మాత్రమే కాకుండా, పవర్‌ఫుల్ డైలాగ్స్, ఎమోషనల్ సీన్స్, అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్‌లు అన్ని కలిసి ఈ సినిమా ప్రత్యేక ఆకర్షణగా మారాయి. థమన్ సంగీతం మరో ఫ్లస్ పాయింట్. థమన్ మ్యూజిక్ తో సీన్స్ మరింత ఎలివేషన్ అయ్యాయి. స్పెషల్ గా థమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, థండరింగ్ యాక్షన్ మ్యూజిక్, వింటేజ్ డార్లింగ్ లుక్‌తో ప్రభాస్ చూస్తుంటే.. గుస్ బంప్సే..

'ది రాజాసాబ్'ను సంక్రాంతి కానుకగా 2026 జనవరి 9న గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. ట్రైలర్ రిలీజ్ తర్వాత ఫ్యాన్స్‌లో ఊహించని స్థాయిలో హైప్ క్రియేట్ అయ్యింది. ఈ సినిమా పాన్ ఇండియా ప్రేక్షకులకే కాక, రిబెల్ ఫ్యాన్స్‌కు కూడా ఫుల్ మిల్ల్స్ ఎంటర్టైన్‌మెంట్ ఇవ్వబోతోంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. సినిమాకి సంబంధించి మరిన్ని అప్డేట్స్, సింగిల్స్, బీటీఎస్ వీడియోలు త్వరలో విడుదల కానున్నాయి. ప్రభాస్ కొత్త లుక్, స్టైలిష్ యాక్షన్, హారర్-కామెడీ మిక్స్ తో ప్రేక్షకులను కనెక్ట్ చేయనున్నాడని విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తానికి 'ది రాజాసాబ్' ఒక పాన్ ఇండియా ఎంటర్టైన్‌మెంట్ ప్యాకేజీ.

More from Filmibeat

Read more about: raja saab prabhas maruthi
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X