చిరంజీవి, పవన్ కల్యాణ్ ఢీకొట్టే నటుడు లేడు.. తోట చంద్రశేఖర్
మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు హైదరాబాద్ శిల్పకళా వేదికలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకకు భారీ ఎత్తున్న అభిమానులు తరలి వచ్చారు. పెద్ద ఎత్తున్న అభిమానులు తరలి రావడంతో వేదిక ప్రాంగణం కిక్కిరిసిపోయింది. ఈ వేడుకకు నిర్మాత అల్లు అరవింద్, చిరు అల్లుడు కల్యాణ్ దేవ్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జనసేన అధినేత తోట చంద్రశేఖర్ మాట్లాడుతూ..

చిరంజీవి సినీ పరిశ్రమలో అగ్రగణ్య నటుడు. ఆయనను అధిగమించే నటుడు ఇంకా రాలేదు. ఆకాశంలో ఎన్నో తారలు ఉన్నప్పటికీ.. నేల మీద రెండు తారలను మాత్రం ఢీకొట్టలేకపోయాయి. ఆ స్టార్సే మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్. చిరంజీవి కేవలం మహానటుడే కాదు మానవత్వం ఉన్న మనిషి. మంచి హృదయం ఉన్న రుషి. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండే మహానుభావుడు. ఆయనతో నా ప్రయాణం 2009లో మొదలైంది. ప్రజారాజ్యం పార్టీకి అధినేతగా ఉన్నప్పుడు మేమంతా ఆయనతో ప్రయాణం చేశాం.
ప్రజారాజ్యం పార్టీ పెట్టి సామాజిక న్యాయం కోసం ప్రయత్నించారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆ ప్రయత్నం సఫలం కాలేదు. కానీ ఆయన బాటలో ప్రయాణిస్తూ ప్రజా సంక్షేమం కోసం ప్రయత్నిస్తున్నారు. చిరంజీవి కలను పవన్ కల్యాణ్ నెరవేర్చాలని కోరుకొంటున్నాను అని తోట నరసింహం అన్నారు.
మెగాస్టార్ జన్మదిన వేడుకల్లో ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అభిమానులను ఆకట్టుకొన్నాయి. చిరంజీవి పాటలకు వేసిన నృత్యాలు ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగించాయి. ఈ కార్యక్రమానికి యాంకర్ సుమ హోస్ట్‌గా వ్యవహరించారు.


Click it and Unblock the Notifications











