twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఈ టాలీవుడ్ విలన్ యమా రిచ్.. వందల కోట్ల ఆస్తులు.. స్టార్ డైరెక్టర్ కూతురితో పెళ్లి!

    |

    టాలీవుడ్ విలన్ కి వందల కోట్ల ఆస్తా ? ఎవరైనా అనే అనుమానాలు కలగవచ్చు.. ఆయన పేరు వల్లభనేని జనార్ధన్, టాలీవుడ్ లో విలన్ పాత్రలు పోషించడాని కంటే ముందే ఆయన దర్శకుడిగా, నిర్మాతగా తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు. ఈ తరం వారికి వల్లభనేని జనార్ధన్ అంటే ఎవరో తెలియక పోవచ్చు కానీ చిరంజీవి సూపర్ హిట్ సినిమా గ్యాంగ్ లీడర్ లో ఎస్పి పాత్రలో నటించిన ఆయన నటనను ఎవరూ అంత ఈజీగా మర్చిపోలేరు. ఆయన వందల కోట్ల ఆస్తులు, ఒక అప్పట్లో ఒక స్టార్ డైరెక్టర్ కుమార్తెతో వివాహానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే.

    చదువుకునే రోజుల్లోనే

    చదువుకునే రోజుల్లోనే


    విజయవాడలో జన్మించిన వల్లభనేని జనార్ధన్ ఆరోజుల్లోనే లయోల పబ్లిక్ స్కూల్లో చదువుకున్నారు. ఆ తర్వాత శాతవాహన కళాశాలలో కాలేజీ స్టడీస్ పూర్తి చేశారు. కాలేజీ చదివే రోజుల్లోనే ఎక్కువగా నాటకాలు వేస్తూ నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. కాలేజీ పూర్తయిన తర్వాత కళా మాధురి అనే పేరుతో ఒక నాటక సంస్థను స్థాపించి నటుడిగా నటిస్తూనే అనేక నాటకాలకు దర్శకత్వం వహిస్తూ నాటకాభిమానుల ఆదరాభిమానాలు పొందేవారు. అయితే సినిమాల్లోకి వెళ్తే ప్రేక్షకులను మరింత అలరించవచ్చని భావించి సినిమా రంగ ప్రవేశం చేశారు.

    ఆ నిర్మాత పరిచయంతో

    ఆ నిర్మాత పరిచయంతో

    ఆ రోజుల్లో నిర్మాతగా మంచి సినిమాలు నిర్మించిన కుమార్జీ పరిచయం ఉండడంతో ఆయన ముందుగా రాఘవేంద్రరావు దగ్గర దర్శకత్వ శాఖలో అప్రెంటీస్ గా చేరారు. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన గజదొంగ ఆ తర్వాత తిరుగులేని మనిషి, కృష్ణంరాజు హీరోగా వచ్చిన రగిలే జ్వాల సినిమాలకు దర్శకత్వం విభాగంలో పని చేశారు. ఆ తర్వాత కొండవీటి సింహం సినిమాకి కూడా ఆయన పనిచేశారు కానీ అనుకోని కారణాలతో మధ్యలోనే వచ్చేశారు. వచ్చిన వెంటనే అర్జున్ ఆర్ట్ ప్రోడక్షన్స్స్ పేరుతో ఒక సొంత నిర్మాణ సంస్థ స్థాపించి అమ్మ గారి మనవరాలు అనే సినిమా నిర్మించాడు. అనేక కారణాలతో ఆ సినిమా రిలీజ్ అవ్వలేదు అనుకోండి.

    స్టార్ డైరెక్టర్ కుమార్తెతో పెళ్లి

    స్టార్ డైరెక్టర్ కుమార్తెతో పెళ్లి

    ఆ తర్వాత అప్పట్లో స్టార్ డైరెక్టర్గా ఉన్న విజయబాపినీడు తన మూడో కుమార్తెను జనార్ధన్ కి ఇచ్చి పెళ్లి చేశారు. అలా మొదటి సినిమా దర్శకత్వం చేస్తుంటే ఒక పవర్ఫుల్ సబ్జెక్ట్ ఉండాలని సూచించడంతో కన్నడలో సూపర్ హిట్ అయిన మానససరోవర్ అనే సినిమా హక్కులు కొనుక్కుని దానిని అమాయక చక్రవర్తి పేరుతో రిలీజ్ చేయగా అది సూపర్ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత కొన్ని సినిమాలు నిర్మిస్తున్న సమయంలో శ్రీమతి కావాలి అనే సినిమాలో ఒక రిటైర్డ్ మిలటరీ అధికారి పాత్రలో నటించాల్సి రావడంతో నటుడిగా అలా అనుకోకుండా తెరంగ్రేటం చేశారు.

    స్టూవర్టుపురం దొంగలు సినిమాతో

    స్టూవర్టుపురం దొంగలు సినిమాతో


    ఇక ఆ తరువాత సాగర్ దర్శకత్వంలో వచ్చిన స్టూవర్టుపురం దొంగలు సినిమా లో ఒక వేషంలో ఆయన నటించారు ఆ తర్వాత వెంకటేష్ నటించిన సూర్య ఐపిఎస్ సినిమాలో కూడా ఆయనకు నటుడిగా అవకాశం దక్కింది ఈ రెండు సినిమాలు చూసిన ఆయన మామ విజయబాపినీడు గ్యాంగ్ లీడర్ సినిమాలో ఎస్పి పాత్ర ఇచ్చాడు ఆ సినిమా పాత్ర ఎంతగానో గుర్తింపు తెచ్చి పెట్టడంతో ఆయన ఏకంగా 120 కి పైగా సినిమాల్లో విలన్ పాత్రల్లో నటించి మెప్పించారు.

    ఆయన ఆస్తే 400 కోట్లు

    ఆయన ఆస్తే 400 కోట్లు


    తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ఆస్తి గురించి ఆయన ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తన తాతగారు ఆంధ్రప్రదేశ్ లోనే టాప్ ఫైవ్ బిజినెస్ మ్యాన్స్, అలాగే ధనవంతులలో ఒకరిగా ఉండేవారని ఆయన చెప్పుకొచ్చారు. ఆయన 1960లలో చనిపోయేనాటికి తామంతా చెన్నైలో సెటిల్ అయ్యాము అని, తాను తన తండ్రి సంపాదించినవి కాకుండా కేవలం తన తాతగారు సంపాదించిన పెట్టిన ఆస్తులే దాదాపు 400 కోట్ల రూపాయల విలువ చేస్తాయని ఆయన చెప్పుకొచ్చారు. ఇక తాను, తన తండ్రి సంపాదించినవి మొత్తం కలిపితే ఎంత ఉంటాయో ఇక చెప్పక్కర్లేదని అన్నారు.

    English summary
    tollywood actor director janardhan vallabhaneni revealed some intresting facts about his assets in a recent interview. and also his marriage with vijaya baapineedu's daughter.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X