twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    జయసుధకు కాఫీలో మోషన్ టాబ్లెట్లు.. బాత్రూం నీళ్ళు పట్టి తగాడానికిచ్చారు..చనిపోవాలనుకునంటూ సీనియర్ నటుడు ఎమోషనల్

    |

    తెలుగు సినీ పరిశ్రమలో అనేక సినిమాలు, వందలాది సీరియల్స్ చేసిన సీనియర్ నటుడు మేక రామకృష్ణ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం. అంటే ఆయన పేరు ప్రేక్షకులకు తెలియకపోయినా మనిషిని చూస్తే వెంటనే గుర్తు పట్టగలరు. అయితే ఆయన తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక సంచలన విషయాలు పంచుకున్నారు. ఇండస్ట్రీలో ఉండే ప్రొడక్షన్ బాయ్స్ విపరీత ప్రవర్తన గురించి ఆయన కామెంట్స్ చేశారు. ఆ వివరాల లోకి వెళితే

    అనుష్కకు అన్నగా

    అనుష్కకు అన్నగా

    తెలుగు డైలీ సీరియల్స్‌లో తొలి హీరోగా పేరు పొందిన నటుడు మేక రామకృష్ణ రుతురాగాలు, అమ్మమ్మ.కామ్ వంటి పాపులర్ సీరియల్స్‌లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. దాదాపు వందకు పైగా సీరియల్స్‌లో నటించిన ఆయన బాహుబలి, సైరా వంటి పెద్ద పెద్ద సినిమాల్లో కూడా నటించారు. బాహుబలి సినిమాలో అనుష్కకు అన్నగా నటించి మంచి పేరు తెచ్చుకున్నారు.

    హే పో అని మన ముఖం మీదే

    హే పో అని మన ముఖం మీదే


    రామకృష్ణ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రొడక్షన్ బాయ్స్ కారణంగా ఆర్టిస్ట్ లకు ఎదురయ్యే ఘోర అవమానం గురించి వెల్లడించారు. ఇండస్ట్రీలో మిమ్మల్ని బాధ పెట్టిన సంఘటనలు ఏమైనా ఉన్నాయా? అని ప్రశ్నించగా మమ్మల్ని బాధపెట్టిన సంఘటనలు చాలా ఉన్నాయని, అసలు జీవితమే వేస్ట్ అని కళ్లనీళ్లు పెట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయిని అన్నారు. నిర్మాణ సంస్థలకు చెందిన ప్రొడక్షన్ బాయ్స్ చిన్న ఆర్టిస్ట్ లను చాలా ఘోరంగా ట్రీట్ చేస్తారని, వాళ్లు ట్రీట్ చేసే విధానం చూస్తే చాలా సిగ్గు అనిపిస్తుందని అన్నారు. హే పో అని మన ముఖం మీదే విసుక్కుంటారని అన్నారు.

    చాలా నీఛంగా

    చాలా నీఛంగా


    నిజానికి ప్రొడ్యుసర్ కు ఇవేమీ తెలియదని ఆయన అన్నీ సమకూర్చి పెడితే ఈ ప్రొడక్షన్ వాళ్లు ఉన్న దాన్ని సర్వ్ చేయడానికి నరకం చూపిస్తారని చెప్పుకొచ్చారు. మనం అడుక్కునేవాడికి కూడా చాలా మర్యాదగా వేస్తాము కానీ ఈ ప్రొడక్షన్స్ బాయ్స్ చాలా నీఛంగా ప్రవర్తిస్తారు. ఎంత కోపం వస్తుందంటే.. నరికి పారేయాలనిపిస్తుంది. ఎందుకొచ్చిన గొడవ అని ఇంటి నుంచి నా ఫుడ్ నేనే తీసుకుని వెళ్లడం అలవాటు చేసుకున్నానని ఆయన చెప్పారు.

    నాశనం అయిపోతారని

    నాశనం అయిపోతారని

    ఫుడ్ పెట్టే దగ్గర కూడా చాలామంది ప్రొడక్షన్ వాళ్ళు నాలుగైదు కేటగిరీలుగా పెడతారని, హీరోలు, పెద్ద నటులకు ఒకచోట, డైరెక్షన్ అండ్ టెక్నీకల్ టీమ్ కి ఒకచోట, ఏజెంట్స్ ఉంటారు కాబట్టి జూనియర్ ఆర్టిస్ట్ లకు ఒకచోట, సెకండ్ గ్రేడ్ టెక్నీషియన్లను మరో చోట ఫుడ్ పెడతారని అన్నారు. అక్కడ సెకండ్ గ్రేడ్ సపోర్టింగ్ ఆర్టిస్ట్ లకు అయితే నరకం చూపిస్తారని, ఈ పాపం మీకు తగులుతుంది. నాశనం అయిపోతారని నేను తిట్టిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయని అన్నారు.

    టాయిలెట్ లో ఉండే నీళ్లు బాటిల్స్ లో పట్టి

    టాయిలెట్ లో ఉండే నీళ్లు బాటిల్స్ లో పట్టి

    ఇక ప్రొడక్షన్ బాయ్స్ ని ఎవరైనా తిడితే.. వాళ్లకి ఇచ్చే కాఫీలో మోషన్ టాబ్లెట్ కలిపి ఇస్తారట. ఆ కాఫీ తాగితే వారికి మోషన్స్ అవుతాయి. ఆ విధంగా కూడా టార్చర్ పెట్టే వాళ్ళు ఉన్నారని ఆయన అన్నారు. ఒక సరి కోప్పడ్డారని సీనియర్ నటి జయసుధ గారికి కూడా అలా చేసారని వెల్లడించారు. వాళ్ళతో ఎందుకు అని ప్రొడక్షన్ బాయ్స్ ని అందరూ 'అన్నా' అని రెస్పెక్ట్ ఇచ్చి పిలుస్తుంటారని అన్నారు. ఇప్పుడంటే బాటిల్స్ ఇస్తున్నారు కానీ.. ఒకప్పుడు వాటర్ అడిగితే టాయిలెట్ లో ఉండే నీళ్లు బాటిల్స్ లో పట్టి ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయని అన్నారు. అయితే అందరూ అలా ఉండరు కానీ చాలామంది అలానే ఉన్నారని అన్నారు.

    చచ్చిపోవాలని అనుకున్నా

    చచ్చిపోవాలని అనుకున్నా


    ఇక ఒక సెట్‌లో ఓ ఎనిమిది మందితో కలిసి భోజనం చేయడానికి కూర్చున్నానని, అయితే ఆ ఎనిమిది మందికి వేడి వేడిగా అక్కడ వండిన రైస్ వడ్డించారు. కానీ నాకు మాత్రం బయట నుంచి తెచ్చిన రైస్ సెపరేట్‌గా పెడుతున్నారు. అదేంటయ్యా నాకు కూడా పెట్టొచ్చుగా అంటే మీకు అంత రేంజ్ లేదు... అసలు మీరు ఇక్కడ ఎందుకు కూర్చున్నారు అని ప్రొడక్షన్ బాయ్ అన్నాడని ఆయన అన్నారు. ఆ మాటతో కళ్లలో నీళ్లు తిరిగాయి. డైరెక్టర్లు, హీరో హీరోయిన్లు అందరూ ఉన్నారు. వాళ్లందరి ముందు నన్ను అంత మాట అనడంతో తల ఎత్తు కోలేక పోయనని, ఆ రోజు నేను చచ్చిపోవాలని అనుకున్నా... ఆ అవమానాన్ని తట్టుకోలేకపోయాను అంటూ ఎమోషనల్ అయి కన్నీటి పర్యంతమయ్యారు.

    Read more about: bahubali బాహుబలి
    English summary
    Tollywood actor Meka Ramakrishna sensational comments on production boys.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X