కత్తి మహేష్ కారుకు యాక్సిడెంట్... కంటికి తీవ్ర గాయాలు, ఆపరేషన్ కూడా!

తెలుగు ప్రేక్షకులకు కత్తి మహేష్ ఎవరో ప్రత్యేకంగా పరిచయం చేయక్కర్లేదు. తెలుగు సినిమా క్రిటిక్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఆయన ఆ తర్వాతి కాలంలో నటుడిగా, దర్శకుడిగా మారి ఏవో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిస్తూ ఉంటారు. తాజాగా ఆయన ప్రయాణిస్తున్న కారుకు రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆయనకు తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే

పవన్ ఫ్యాన్స్ తో రచ్చ

పవన్ ఫ్యాన్స్ తో రచ్చ

తెలుగు ప్రేక్షకులందరికీ కత్తి మహేష్ తెలుసు. షార్ట్ ఫిలిం దర్శకుడిగా కెరీర్ ప్రారంభించిన కత్తి మహేష్ ఆ తర్వాత అనేక సూపర్ హిట్ సినిమాలకు వివాదాస్పద రివ్యూలు ఇస్తూ ప్రేక్షకులలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా ఆయన పవన్ కళ్యాణ్ మీద చేసిన వ్యాఖ్యలకు గాను పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మహేష్ ను టార్గెట్ చేయడం అప్పట్లో దాడి చేయడం కూడా సంచలనం రేపాయి.

నటుడిగా, దర్శకుడిగా

నటుడిగా, దర్శకుడిగా

సినిమాలకు దర్శకత్వం వహిస్తూనే ఆయన కొన్ని సినిమాల్లో కూడా నటించారు. సాయి రాజేష్ దర్శకత్వంలో తెరకెక్కిన హృదయ కాలేయం, కొబ్బరిమట్ట లాంటి సినిమాల్లో కత్తి మహేష్ నటించి అందరినీ అలరించారు. అలాగే దర్శకుడిగా ఎగిరే తారాజువ్వలు, పెసరట్టు లాంటి కొన్ని సినిమాలను రూపొందించి ఆయన తెలుగు ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేశారు.

రోడ్డు ప్రమాదం

రోడ్డు ప్రమాదం

పొలిటికల్ గా ఈ మధ్య కాస్త యాక్టివ్ కావాలని చూస్తున్న ఆయనకు రోడ్డు ప్రమాదం జరగడం కలకలం రేపుతోంది. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం చంద్రశేఖరపురం వద్ద కత్తి మహేష్ ప్రయాణిస్తున్న కారు హైవే మీద ఆపి ఉన్న ఒక లారీని వెనుక నుంచి ఢీ కొంది. ఈ ప్రమాదంలో ఆయనకు స్వల్పగాయాలయ్యాయి అని ముందు వార్తలు రాగా ఆయనకు గాయాలు తీవ్రంగానే అయినట్టు తెలుస్తోంది. ఆయన కళ్ళకు గాయం అయినట్లు ప్రచారం జరుగుతోంది.

 కంటికి ఆపరేషన్

కంటికి ఆపరేషన్

కంటికి గాయాలు కావడంతో ఆయనను హుటాహుటిన నెల్లూరు లోని మెడికవర్ హాస్పిటల్ కి తరలించారు ఆ తర్వాత ఆయనకు శస్త్రచికిత్స అవసరమని భావించి నెల్లూరులోనే ఉన్న సింహపురి హాస్పిటల్ కి తరలించారు.. సింహపురి హాస్పిటల్ లో ఆయన కంటికి ఆపరేషన్ కూడా జరిగిందని కత్తి మహేష్ సన్నిహిత వర్గాల నుంచి అందుతున్న సమాచారం.

మొహం మీద దెబ్బలు తగిలాయి కానీ

మొహం మీద దెబ్బలు తగిలాయి కానీ

ఆయనను మెరుగైన చికిత్స కోసం ఇప్పుడు చెన్నై లో ఉన్న ఫేమస్ శంకర నేత్రాలయ ఆస్పత్రికి తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. ఇక ఈ అంశానికి సంబంధించి దర్శకుడు సాయి రాజేష్ ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టగా ఆ పోస్ట్ వేదికగా ఈ వివరాలన్నీ కత్తి మహేష్ సన్నిహితులు వెల్లడించారు. మొహం మీద దెబ్బలు తగిలాయి, కానీ కచ్చితంగా కోలుకుంటారని ఆయన ఫోన్ తీసిన స్నేహితులు చెప్పారని, ఎవరైనా దగ్గర స్నేహితులు టచ్లో ఉంటే పరిస్థితి అప్డేట్ చేయండి అని సాయి రాజేష్ కోరారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X