Mirai RGV Review: మిరాయ్‌పై ఆర్జీవీ రివ్యూ.. బాహుబలి తర్వాత అలాంటి హిట్ అంటూ

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో తేజా సజ్జా నటించిన లేటెస్ట్ ఫిల్మ్ మిరాయ్. ఇప్పటికే తేజా సజ్జా సూపర్ హీరో ఫిల్మ్ హను మ్యాన్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బాస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నారు. అంతే కాకుండా పాన్ ఇండియా హీరోగా క్రేజ్ దక్కించుకున్నారు. ఇక తాజాగా మరో సూపర్ హీరో చిత్రం మిరాయ్ తో తేజా సజ్జా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ చిత్రం సెప్టెంబర్ 12న తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో గ్రాండ్ గా విడుదల అయ్యింది.

మిరాయ్ చిత్రం విడుదల సందర్బంగా ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ దక్కుతోంది. ప్రేక్షకులు సినిమాకు పాజిటివ్ రివ్యూలను అందిస్తున్నారు. ఈ చిత్రంలోని విజువల్స్, కథ, యాక్షన్, సంట్స్, బీజీఎం, స్టార్ కాస్ట్ పెర్ఫామెన్స్ అన్నీ అద్భుతంగా ఉన్నాయని విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు అందుకుంటున్నారు టీమ్. ఇక ఈ చిత్రంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వాయిస్ ఓవర్ అందించడం విశేషం. దీంతో సినిమా చూసిన ప్రేక్షకులు మరింతగా థ్రిల్ అవుతున్నారు.

Tollywood Director Ram Gopal Varma Interesting Review

ఇదే సమయంలో టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కూడా ఈ సినిమాపై ఆసక్తికరంగా స్పందించారు. ఇటీవల రామ్ గోపాల్ వర్మ చిన్న సినిమాలు, రోటీన్ కు భిన్నంగా ఉన్న చిత్రాలపై తనదైన శైలిలో రివ్యూలను అందిస్తున్నారు. యంగ్ యాక్టర్స్, న్యూ ఫిల్మ్ మేకర్స్ ను తన స్టైల్ లో రివ్యూలు ఇచ్చి ఎంకరేజ్ మెంట్ అందిస్తున్నారు. ఈ క్రమంలోనే రామ్ గోపాల్ వర్మ తాజాగా విడుదలైన మిరాయ్ చిత్రంపై తన రివ్యూను అందించారు.

మిరాయ్ చిత్రంతో ఇండస్ట్రీ హిట్ ఇచ్చినందుకు నటుడు తేజా సజ్జా, దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని, నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ కు నా ప్రశంసలు తెలియ జేస్తున్నారు. పాన ఇండియా ఫిల్మ్ బాహుబలి తర్వాత మరే ఇతర చిత్రానికి ఇంతటి ఏకగ్రీవ ప్రశంసలు నేను వినలేదు. మిరాయ్ చిత్రంలోని VFX, కథనం రెండూ హాలీవుడ్ ప్రమాణాలకు తగ్గట్టుగా ఉన్నాయి.. అంటూ రామ్ గోపాల్ వర్మ మిరాయ్ టీమ్ కు తనదైన శైలిలో బూస్ట్ అందించారు.

ఇక మిరాయ్ చిత్రాన్ని టాప్ ఫిల్మ్ ప్రొడక్షన్ కంపెనీ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించారు. ప్రముఖ నిర్మాత టీవీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ లు ఈ పవర్ ఫుల్ ప్రాజెక్ట్ ను రూ.40 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారు. ఈ చిత్రానికి యంగ్ టాలెంట్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించడం విశేషం. మిరాయ్ చిత్రం క్వాలిటీ, విజువల్స్, యాక్షన్, కథ పరంగా ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో ప్రశంసలను అందుకుంటోంది. విమర్శకుల నుంచి కూడా మిరాయ్ టీమ్ ప్రశంసలు అందుకోవడం విశేషం. ఇక టాలీవుడ్ స్టార్ మంచు మనోజ్ విలన్ గా, శ్రియా, జగపతి బాబు కీలక పాత్రలు పోషించి ప్రేక్షకులను అలరించారు. రితికా నాయక్ హీరోయిన్ గా మెప్పించింది. గౌర హరి అద్భుతమైన సంగీతం అందించారు.

More from Filmibeat

Read more about: ram gopal varma teja sajja mirai
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X