యువ హీరో ఇంట్లో విషాదం.. కరోనా వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయిన తండ్రి!

కరొనా వైరస్ కారణంగా మరో సెలబ్రెటీ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఎలాంటి తేడా లేకుండా అన్ని వర్గాల వారిని బలి తీసుకుంటున్న కరోనా వైరస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో కూడా చేదు అనుభవాలను కలిగిస్తోంది. ఈ రోజుల్లో సినిమా ద్వారా ఆడియెన్స్ కి పరిచయమైన యువ హీరో శ్రీ తండ్రి కరోనా కాటుకు బలయ్యారు. ఈ న్యూస్ ఒక్కసారిగా అందరిని షాక్ కి గురి చేసింది.

యువ హీరో ఇంట్లో విషాదం..

యువ హీరో ఇంట్లో విషాదం..

ఇటీవల పలువురు సీరియల్ యాక్టర్స్ కరోనా భారిన పడిన విషయం తెలిసిందే. అయితే తగిన జాగ్రత్తలతో కొందరు ఆ వైరస్ నుంచి తప్పించుకుంటున్నారు. ఇక కొందరు సెలబ్రెటీలు ఊహించని విధంగా ప్రాణాలను విడుస్తున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పుడు యువ హీరో శ్రీ తండ్రి దుర్గా ప్రసాద్ కూడా వైరస్ కాటుకు బలయ్యారు.

ఈ రోజుల్లో హీరో..

ఈ రోజుల్లో హీరో..

శ్రీ అసలు పేరు శ్రీనివాస్ మంగం. 2012లో మారుతి తెరకెక్కించిన మొట్ట మొదటి సినిమా ఈ రోజుల్లో. అందులో హీరోగా నటించి శ్రీ మంచి గుర్తింపు దక్కించుకున్నాడు. ఆ తరువాత పలు డిఫరెంట్ సినిమాలతో ఆడియెన్స్ ఎట్రాక్ట్ చేసే ప్రయత్నం చేశాడు. అయితే కెరీర్ కి ఎంతగానో సపోర్ట్ చేసిన తండ్రి దురమవ్వడంతో శ్రీ తట్టుకోలేకపోతున్నాడు.

కరోనా పరీక్షల అనంతరం..

కరోనా పరీక్షల అనంతరం..

గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న తన తండ్రిని విజయవాడ లోని ఒక హాస్పిటల్ జాయిన్ చేశాడు శ్రీ. మొదట నార్మల్ జ్వరం అనుకున్నప్పటికి కరోనా పరీక్షల అనంతరం పాజిటివ్ అని తేలడంతో ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. ఆయనను బ్రతికించాలని వైద్యులు చివరి నిమిషం వరకు ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ దుర్గా రామ్ ప్రసాద్ ఆరోగ్యం సహకరీంచలేదు.

Recommended Video

Vakeel Saab Director Venu Sriram About Trivikram Srinivas
గత రాత్రి ప్రాణాలు కోల్పోయిన శ్రీ తండ్రి

గత రాత్రి ప్రాణాలు కోల్పోయిన శ్రీ తండ్రి

కరోనా వైరస్ తీవ్రత ఎక్కువవ్వడంతో శ్రీ తండ్రి గత రాత్రి 8.30గంటలకు మృతి చెందినట్లు తెలుస్తోంది. కుటుంబ పెద్దగా ఉన్న తండ్రి మరణించడంతో యువ హీరో కుటుంబం ఒక్కసారిగా షాక్ కి గురైంది. యువ హీరో శ్రీ తీవ్ర మనోవేదనకు గురవుతున్నట్లు తెలుస్తోంది. శ్రీ కుటుంబ సబ్యులకు కూడా కరోనా పరీక్షలు నిర్వహించినట్లు తెలుస్తోంది. ఇక వారికి ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు చెప్పినట్లు సన్నిహితులు తెలియజేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X