twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    2022 కళ్ళు చేదిరేలా లాభాలు అంధించిన టాప్ తెలుగు సినిమాలు.. చిన్న హీరోలదే హవా..

    |

    2022 ఏడాది తెలుగు చిత్ర పరిశ్రమకు బాగానే కలిసొచ్చిందనే చెప్పాలి. కరోనా కష్టకాలంలో దాదాపు రెండేళ్ల వరకు కూడా ఇండస్ట్రీ తీవ్రస్థాయిలో నష్టపోయింది. అయితే మిగతా ఇండస్ట్రీలతో పోలిస్తే కేవలం తెలుగు చిత్రపరిశ్రమలోనే మాత్రమే ఈసారి అత్యధిక స్థాయిలో మార్కెట్ నిలదొక్కుకోవడం విశేషం. ఇక ఎక్కువ స్థాయిలో సక్సెస్ అయిన సినిమాలలో చిన్న హీరోలవే ఉండడం విశేషం. ఇక మొత్తంగా 2022లో తెలుగు చిత్రపరిశ్రమలో అత్యధిక స్థాయిలో లాభాలు అందించిన సినిమాల వివరాల్లోకి వెళితే..

    RRR బిగ్గెస్ట్ రికార్డ్

    RRR బిగ్గెస్ట్ రికార్డ్

    ముందుగా అతిపెద్ద సినిమాగా ప్రేక్షకుల ముందు వచ్చిన RRR సినిమా ఏ స్థాయిలో రికార్డులను క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దర్శక ధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరపైకి తీసుకువచ్చిన ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు కూడా కలిసిన నటించడంతోనే అంచనాలు పెరిగిపోయాయి. దీంతో సినిమా బాక్సాఫీస్ వద్ద మొత్తంగా 150 కోట్ల వరకు ప్రాఫిట్ అందించింది.

    కార్తికేయ 2 - సీతారామం

    కార్తికేయ 2 - సీతారామం

    ఇక అత్యధిక స్థాయిలో ప్రాఫిట్ అందించిన సినిమాలలో కార్తికేయ 2 కూడా నిలిచింది. నిఖిల్ సిద్దార్థ్ హీరోగా నటించిన ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేయగా ఊహించని రేంజ్ లో కలెక్షన్స్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. పెట్టిన పెట్టుబడికి మొత్తం కలిపి 45.5 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ అందించింది. బ్యూటిఫుల్ లవ్ స్టోరీ సీతారామం కూడా 29 కోట్ల రేంజ్ లో లాభాలను అందించినట్లుగా తెలుస్తోంది.

    కళ్యాణ్ రామ్ బిగెస్ట్ హిట్

    కళ్యాణ్ రామ్ బిగెస్ట్ హిట్

    కళ్యాణ్ రామ్ నటించిన బింబిసార సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ సొంతం చేసుకుంది. ఈ సినిమా విడుదలకు ముందే మంచి పోజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసింది. విడుదల తర్వాత కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఆఫ్ సెంచరీ సరికొట్టేసింది. దీంతో నిర్మాతలకు మొత్తంగా 22 కోట్లకు పైగానే లాభాలు వచ్చాయి. కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే అత్యధిక స్థాయిలో ప్రాఫిట్స్ అందించిన సినిమాగా బింబిసార నిలిచింది.

    మేజర్ - బింబిసార

    మేజర్ - బింబిసార

    అడివి శేషు నటించిన మేజర్ సినిమా కూడా పాన్ ఇండియా మూవీగా విడుదలైన విషయం తెలిసిందే. ఈ సినిమా మహేష్ బాబు నిర్మించడం విశేషం. ఇక మేజర్ ఉన్నికృష్ణన్ జీవిత ఆధారంగా తెరపైకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 14 కోట్లకు పైగా ప్రాఫిట్ అయితే అందించింది. ఇక పెద్దగా అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి షేర్ సొంతం చేసుకుంది. ఈ సినిమాకు మొత్తం 22కోట్లకు పైగా లాభాలు వచ్చినట్లు సమాచారం.

    డబ్బింగ్ సినిమాలు కూడా..

    డబ్బింగ్ సినిమాలు కూడా..

    మరికొన్ని డబ్బింగ్ సినిమాలు కూడా ఈ ఏడాది మంచి లాభాలను సొంతం చేసుకున్నాయి. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది కాంతార సినిమా గురించి. అల్లు అరవింద్ ఈ సినిమాను తెలుగులో డిస్ట్రిబ్యూట్ చేసి దాదాపు 25 కోట్ల వరకు ప్రాఫిట్ అందుకున్నారు. ఇక హీరో నితిన్ హోమ్ బ్యానర్ నుంచి విక్రమ్ సినిమాను తెలుగులో రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు పది కోట్లకు పైగా లాభాలు వచ్చాయి. అలాగే బాలీవుడ్ బ్రహ్మాస్త్ర 1 సినిమా కూడా తెలుగులో 8 కోట్లకు పైగా లాభాలు సొంతం చేసుకుంది.

    English summary
    Top box office Blockbusters Of Tollywood In 2022..
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X