For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  మరోసారి త్రివిక్రమ్ - అల్లు అర్జున్ కాంబినేషన్.. ఒక్క నిమిషం కోసం కోట్లల్లో రెమ్యునరేషన్!

  |

  మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. హీరో డైరెక్టర్ కాంబినేషన్ అనగానే అభిమానుల్లో అంచనాలు ఒక్కసారిగా పెరిగి పోతూ ఉంటాయి. అందుకు అల వైకుంఠపురములో ఒక ఉదాహరణ అని చెప్పవచ్చు. ఆ సినిమా ఆ స్థాయిలో విజయాన్ని అందుకుంటుందని ఎవరూ ఊహించలేదు.

  ఇక వీరి కాంబినేషన్ లో ఇలాంటి సినిమా భవిష్యత్తులో మరోకటి వస్తే మరో లెవెల్ లో హిట్ అవుతుందని చెప్పవచ్చు. ఇక ఆ బిగ్గెస్ట్ హిట్ హైట్ తర్వాత మరొకసారి ఈ కాంబినేషన్ కెమెరా ముందుకు వచ్చింది కానీ ఈ సారి సినిమా కోసం కాదు. కేవలం ఒక యాడ్ షూట్ కోసమే కలిశారు.

  తెలుగు హీరోలందరికి..

  తెలుగు హీరోలందరికి..

  మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎలాంటి సినిమా చేసినా కూడా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉండాలని ఫుల్ కథను తయారు చేస్తూ ఉంటారు. కమర్షియల్ ఎలిమెంట్స్ ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలాంటి దర్శకుడు ఒక యాడ్స్ కూడా అంతే ఇంట్రెస్టింగ్ గా తీస్తూ ఉంటారు. దాదాపు మన తెలుగు హీరోల అందరికీ కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లోనే యాడ్ షూటింగ్ జరుగుతూ ఉంటాయి.

  మరొకసారి అల్లు అర్జున్ త్రివిక్రమ్

  మరొకసారి అల్లు అర్జున్ త్రివిక్రమ్

  అయితే సినిమాలకు సంబంధించిన విషయాలు బయటకు వచ్చినప్పటికీ ఇలాంటి చిన్నచిన్న యాడ్స్ విశేషాలు మాత్రం బయటకు రావు. ఎన్టీఆర్ మహేష్ బాబు అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలకు చేసే యాడ్స్ కు ఎక్కువగా త్రివిక్రమ్ స్క్రిప్ట్ అందిస్తూనే ఉంటారు. లేదా తనే స్వయంగా డైరెక్షన్ చేస్తూ ఉంటారు. చాలా రోజుల అనంతరం అల్లు అర్జున్ త్రివిక్రమ్ శ్రీనివాస్ మరొకసారి కెమెరా ముందుకు వచ్చారు.

  హ్యాట్రిక్ కాంబినేషన్

  హ్యాట్రిక్ కాంబినేషన్

  అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో మొదట జులాయి సినిమా వచ్చిన విషయం తెలిసిందే. ఆ సినిమా అప్పట్లో అల్లు అర్జున్ కెరీర్ లోనే అత్యధిక వసూళ్లను అందుకునేది. తర్వాత వచ్చిన సన్నాఫ్ సత్యమూర్తి సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను అందుకుంది. ఇక గత ఏడాది వచ్చిన అల వైకుంఠపురములో సినిమా నాన్ బాహుబలి రికార్డులను కూడా బ్లాక్ చేసింది. నిత్యం ఆ సినిమాకు సంబంధించిన ఏదో ఒక రికార్డు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. ఇక ఇటీవల పలు అవార్డులను కూడా సొంతం చేసుకుంది.

  నిమిషం యాడ్ కోసం భారీ రెమ్యునరేషన్

  నిమిషం యాడ్ కోసం భారీ రెమ్యునరేషన్

  అయితే త్రివిక్రమ్ శ్రీనివాస్ అల్లు అర్జున్ ప్రముఖ రాపిడో బైక్ టాక్సీ కి సంబంధించిన యాడ్ కోసం వర్క్ చేశారు. షూటింగ్ కి సంబంధించిన ఫోటో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఒక నిమిషం కూడా లేని ఆ యాడ్ సీన్ కోసం వారికి రెమ్యునరేషన్ కూడా గట్టిగానే ఇచ్చినట్లు తెలుస్తోంది. దాదాపు ఒక రోజు మాత్రమే సమయాన్ని కేటాయించి మంచి కంటెంట్ ఉన్న యాడ్ ను సిద్ధం చేసే త్రివిక్రమ్ శ్రీనివాస్ అల్లు అర్జున్ కోట్లల్లో పారితోషికాన్ని అందుకున్నారు. వీరి కాంబినేషన్ లో మరో సినిమా వస్తే చూడాలని అనుకుంటున్నట్లు అభిమానులు పాజిటివ్గా కామెంట్ చేస్తున్నారు.

  Bheemla Nayak పాటతో కిన్నెర మొగిలయ్య స్టార్ స్టేటస్.. ఏంటీ కాంట్రవర్సీ || Filmibeat Telugu
  చేస్తున్న సినిమాలు..

  చేస్తున్న సినిమాలు..

  ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా చేస్తున్న విషయం తెలిసిందే రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ పార్ట్ డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ నెక్స్ట్ మహేష్ బాబు తో ఒక సినిమా చేసేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఇక అంతకంటే ముందు త్రివిక్రమ్ భీమ్లా నాయక్ సినిమా కు డైలాగ్స్ అందిస్తూ దర్శకత్వ పర్యవేక్షణలో షూటింగ్ పనులను పూర్తి చేయాలని అనుకుంటున్నారు.

  English summary
  director Trivikram srinivas and allu arjun comercialV taxi ad shoot
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X