twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సినీ ప్రియులకు శుభవార్త: తెలంగాణలో థియేటర్ల ఓపెనింగ్‌కు డేట్ ఫిక్స్

    |

    కరోనా వైరస్ సినీ పరిశ్రమ మీద చూపించిన ప్రభావం అంతా ఇంతా కాదు. గత ఏడాదిలో ఎక్కువ భాగం లాక్‌డౌన్ కారణంగా థియేటర్లన్నీ మూత పడిపోయాయి. దాని నుంచి తేరుకుని అప్పడప్పుడే పరిస్థితులు చక్కబడుతోన్న సమయంలో రెండో దశ కారణంగా మరోసారి సినిమా హాళ్లన్నీ క్లోజ్ అయిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో కొద్ది రోజుల క్రితం లాక్‌డౌన్‌ను తీసేసిన తెలంగాణ ప్రభుత్వం గత వారం రాష్ట్రంలోని థియేటర్లను ఓపెన్ చేయడానికి పర్మీషన్ ఇచ్చేసింది. అయితే, కొన్ని సమస్యల వల్ల సినిమా హాళ్లు తెరుచునేందుకు ఇబ్బందులు ఏర్పడ్డాయి.

    కరోనా సమయంలో ఏర్పడిన నష్టాలను పూడ్చుకునేందుకు థియేటర్లలో పార్కింగ్ ఫీజు వసూలు చేసుకుంటామని తెలంగాణ స్టేట్ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ (టీఎస్ఎఫ్‌సీసీ) తెలంగాణ ప్రభుత్వాన్ని అభ్యర్థించింది. ఈ మేరకు కొందరు సినీ ప్రముఖులు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో సంప్రదింపులు జరిపారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నుంచి పార్కింగ్ ఫీజు వసూలు చేసుకోడానికి మంగళవారమే పర్మీషన్ వచ్చింది. దీంతో టీఎస్ఎఫ్‌సీసీ థియేటర్ల రీ ఓపెనింగ్ గురించి చర్చలు జరిపింది. ఈ క్రమంలోనే సినిమా హాళ్లను జూలై 30 నుంచి తెరవాలని నిర్ణయించుకున్నట్లు తాజాగా ఓ న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో తెగ వైరల్ అవుతోంది.

    TSFCC Announce reopening of theatres from July 30th

    వాస్తావానికి జూలై 23 నుంచే థియేటర్లు ఓపెన్ అవుతాయని అనుకున్నారు. కానీ, పార్కింగ్ ఫీజుపై చర్చలు జరిగినందు వల్లే జూలై 30న డేట్ ఫిక్స్ చేశారు. ఇక, అదే రోజున విడుదల అయ్యేందుకు సత్యదేవ్ 'తిమ్మరసు', తేజ సజ్జా 'ఇష్క్' వంటి చిత్రాలు రెడీగా ఉన్నాయి. ఇదిలా ఉండగా.. ప్రతి థియేటర్‌లో మినిస్ట్రీ ఆఫ్ ఇన్‌ఫర్‌మేషన్ అండ్ బ్రాడ్‌కాస్టింగ్ ఇచ్చిన మార్గదర్శకాలు పాటించాల్సి ఉంటుందని తెలుస్తోంది. దీని ప్రకారం.. ప్రతి సినిమా హాల్, మల్టిఫ్లెక్స్‌ల్లో హ్యాండ్ శానిటైజర్లు వాడాలని సూచించింది. అంతేకాదు, థియేటర్లలో ఉమ్మి వేయడాన్ని నిషేదించింది.

    English summary
    Last week the Telangana government allowed the theatres to reopen across the state. Now TSFCC Has Announced reopening of theatres from July 30th.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X