For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Tuck Jagadish రికార్డు.. అమెజాన్ హిస్టరీలో మొదటి సినిమా.. ఎక్కడా తగ్గని నాని!

  |

  నేచురల్ స్టార్ నాని నటించిన టక్ జగదీష్ సినిమా థియేటర్లలో విడుదల అవుతుంది అనుకుంటే డైరెక్ట్ గా అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన విషయం తెలిసిందే. అయితే సినిమాను మొదట థియేటర్లో విడుదల చేయాలని చిత్ర యూనిట్ సభ్యులు ఎన్నో ప్రయత్నాలు చేశారు కానీ పూర్తిస్థాయిలో ఆంధ్ర ప్రదేశ్ థియేటర్ లో ఓపెన్ కాకపోవడంతో పాటు ఆంధ్రప్రదేశ్ లో థియేటర్స్ టికెట్ల రేట్లు వంటి పరిస్థితులు ఏమాత్రం అనుకూలించకపోవడంతో నిర్మాతలు ధైర్యం చేయలేకపోయారు.

  ఏదైతేనేమి ఎట్టకేలకు సినిమాను డిజిటల్ వేదికగా రిలీజ్ చేశారు. సినిమా విడుదల మొదటిరోజు నాని సినిమా రికార్డు సృష్టించిందని అంటున్నారు. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే

  నువ్వే కావాలి హీరోయిన్ రిచా ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.. 40 అంటే నమ్ముతారా?

  టక్ జగదీష్

  టక్ జగదీష్

  నాని హీరోగా రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందిన సినిమా టక్ జగదీష్. గతంలో నాని శివ నిర్వాణ కాంబినేషన్ లో వచ్చిన నిన్ను కోరి సినిమా సూపర్ హిట్ కావడంతో ఈ సినిమా మీద ముందు నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో సినిమాని ఎలా అయినా థియేటర్లలో విడుదల చేయాలని నాని సహా సినిమా యూనిట్ అంతా భావించింది. అయితే అయితే కొన్ని కారణాల దృష్ట్యా సినిమాను థియేటర్లలో రిలీజ్ చేయకుండా డిజిటల్ వేదికగా రిలీజ్ చేయడానికి సిద్ధమయ్యారు.. మధ్యలో ఎగ్జిబిటర్లు నుంచి అభ్యంతరాలు వచ్చినప్పటికీ కూడా ఓటీటీలోకి ధైర్యం చేసి అడుగులు వేశారు.

  అందంతో కూడా సరికొత్తగా ఆకట్టుకుంటున్న సింగర్ మంగ్లీ.. బ్యూటీఫుల్ ఫొటోస్

  బిజినెస్ విషయంలో

  బిజినెస్ విషయంలో

  అయితే సినిమా విడుదలైన తర్వాత దానికి మిశ్రమ స్పందన దీంతో థియేటర్లలో రిలీజ్ చేయకుండా డిజిటల్ వేదికగా రిలీజ్ చేయడమే మంచిది అయ్యింది అంటూ కొన్ని కామెంట్స్ కూడా వస్తున్నాయి. ఎందుకంటే సినిమా అంతగా నచ్చలేదని థియేటర్ లోకి వచ్చి ఉంటే చాలా ఎక్కువగా నష్టపోయేదని అంటున్నారు. మొత్తంగా సినిమా బిజినెస్ విషయంలో నిర్మాతలకు మంచి ప్రాఫిట్స్ దక్కినట్లు తెలుస్తోంది. నాని గత కొంత కాలంగా బాక్సాఫీసు వద్ద సరైన విజయాన్ని అందుకోలేదు.

  మెగాస్టార్, సూపర్ స్టార్స్ వాడుతున్న ఖరీదైన, విలాసవంతమైన కార్లు ఇవే..

  మంచి లాభాలను

  మంచి లాభాలను

  2017లో మిడిల్ క్లాస్ అబ్బాయి అనంతరం నాని కమర్షియల్ విజయాన్ని అందుకోలేదు. ఆ తర్వాత వచ్చిన కృష్ణార్జున యుద్ధం, దేవదాస్, జెర్సీ, గ్యాంగ్ లీడర్ సినిమాలు విమర్శకుల ప్రశంసలు అందుకున్నప్పటికీ బాక్సాఫీసు వద్ద మాత్రం గతంలో మాదిరిగా నిర్మాతలకు లాభాలు తెచ్చి పెట్టలేదు. జెర్సీ సినిమా మాత్రం కాస్త మంచి కలెక్షన్స్ తెచ్చి పెట్టింది.

  కరోనా లాక్ డౌన్ అనంతరం థియేటర్ బిజినెస్ బాగా తగ్గిపోవడం వలన నాని V సినిమాను నిర్మాత దిల్ రాజు థియేట్రికల్ గా విడుదల చేయడం ఇష్టం లేక అమెజాన్ ప్రైమ్ కు భారీ ధరకు అమ్మేశారు. ఒక విధంగా సినిమా పెట్టిన పెట్టుబడినికి నాన్ థియేట్రికల్ గానే లాభాలను అందించింది. రీసెంట్ గా విడుదలైన టక్ జగదీష్ సినిమా కూడా మంచి అలాగే మంచి లాభాలను అందించింది.

  Sara Ali Khan హాట్, బికినీ ఫోటోలు.. సముద్ర తీరంలో అందాల ఆరబోత!

  17 కోట్ల వరకు లాభం

  17 కోట్ల వరకు లాభం

  టక్ జగదీష్ సినిమా కోసం దాదాపు 34 కోట్ల వరకు ఖర్చు కాగా అమెజాన్ ప్రైమ్ ఈ సినిమాను మొత్తం 37 కోట్లకు కొనుగోలు చేసింది. మరో పక్క ప్రత్యేకంగా శాటిలైట్ హక్కులు అమ్ముకోవడంతో నిర్మాతలకు మరొక 7.5 కోట్లు లాభంగా వచ్చాయి. ఆడియో రైట్స్ ద్వారా మరొక రెండు కోట్లు రాగా హిందీ డబ్బింగ్ రైట్స్ ద్వారా ఐదు కోట్లు లాభం వచ్చిందంటున్నారు. మొత్తంగా ఈ సినిమా యాభై 51.5 కోట్ల వరకు బిజినెస్ చేసింది. అంటే 34 కోట్ల బడ్జెట్ పెడితే ఆ పెట్టుబడికి నిర్మాతలకు 17 కోట్ల వరకు లాభం వచ్చింది.

  సినిమా మరో రికార్డు

  సినిమా మరో రికార్డు

  ఇక ఈ బిజినెస్ విషయాలు పక్కన పెడితే ఈ సినిమా మరో రికార్డు సృష్టించింది. అదేమిటంటే, ఇప్పటివరకు అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన అన్ని తెలుగు సినిమాలలో కూడా మొదటి రోజు భారీ ఎత్తున చూసిన మొట్టమొదటి తెలుగు సినిమాగా రికార్డు సంపాదించింది. సినిమా అమెజాన్ ప్రైమ్ లో విడుదలవుతుందని ముందు నుంచి ప్రచారం చేయడమే అమెజాన్ ప్రైమ్ సభ్యులందరూ కూడా , మొదటి రోజే సినిమా చూసే లాగా చేసిందని భావిస్తున్నారు. దీంతో మొదటి రోజు మాత్రం మంచి రికార్డు స్థాయిలో వ్యూస్ రాబట్టింది అని అంటున్నారు.

  English summary
  Nani's Tuck Jagadish is now most watched Telugu Movie on Amazon Prime, here are the details.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X