RRR రిలీజ్ డేట్ విషయంలో కొత్త ట్విస్టు.. ఆ డేట్ కాకపోతే మరో డేట్ అంటూ ప్రకటన
దేశ సినీ పరిశ్రమలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన RRR చిత్రం మూవీ రిలీజ్ వాయిదా పడటం సినీ అభిమానులకు నిరాశను కలిగించింది. సంక్రాంతి బరిలోకి దూకుతుందనుకొన్న ఈ చిత్రాన్ని దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి నిరవధికంగా వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకోవడం సినీ వర్గాలను దిగ్బ్రాంతికి గురిచేసింది. అయితే ఈ సినిమాను ఎప్పుడెప్పుడూ వెండితెరపై చూద్దామని అనుకొంటున్న ప్రేక్షకులకు RRR మూవీ యూనిట్ తియ్యని కబురందించింది. రిలీజ్ డేట్‌కు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

RRR అన్నీ అడ్డంకులే
RRR సినిమాను ఏ ముహుర్తాన మొదలుపెట్టారో తెలియదు కానీ.. ఏ సినిమాకు ఎదురు కానీ అడ్డంకులు ఎదురయ్యాయి. షూటింగు సమయంలో స్టార్ హీరోలు పలు దఫాలు గాయాలపాలు కావడం, అలాగే మాయదారి మహ్మమారి కరోనా రూపంలో రావడం సినిమా షూటింగ్‌ను దఫదఫాలుగా వాయిదా పడేలా చేసింది.

జనవరి 7వ తేదిన రిలీజ్‌కు సిద్దమై..
అయితే సెకండ్ వేవ్ తర్వాత RRR షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని జనవరి 7వ తేదీన రిలీజ్‌కు ముస్తాబైంది. అయితే ప్రపంచవ్యాప్తంగా మూడోవేవ్ ప్రారంభం కావడం, వేల సంఖ్యలో కరోనావైరస్ కేసులు నమోదు కావడం తో సినిమా రిలీజ్‌ను రాజమౌళి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకోవడం తెలిసిందే.

మార్చి 18న రిలీజ్ చేస్తామంటూ ..
ఇదిలా ఉండగా, RRR మూవీ టీమ్ తాజాగా సినిమా రిలీజ్ డేట్‌ను సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఒకవేళ కరోనావైరస్ పరిస్థితులు దేశంలో మెరుగుపడినట్టయితే, ఫుల్ కెపాసిటీతో థియేటర్లు ఓపెన్ అయితే సినిమాను మార్చి 18వ తేదీన రిలీజ్ చేయడానికి సిద్దమవుతున్నాం. ఒకవేళ పరిస్థితులు మెరుగు కాకపోతే RRR 2022, ఏప్రిల్ 28వ తేదీన రిలీజ్ చేస్తాం అని RRR టీమ్ వెల్లడించింది.

మార్చి, ఏప్రిల్‌లోగా పరిస్థితులు అదుపులోకి వస్తాయా?
అయితే దేశంలో కరోనావైరస్ పరిస్థితులు ఇప్పట్లో అదుపులోకి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. మార్చిలోగా కేసులు తగ్గుముఖం పట్టి పూర్తిస్థాయిలో సినిమా థియేటర్లు నడుస్తాయా? అనే అనుమానం కలుగుతున్నది. ఒకవేళ తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితులు మెరుగుపడినా.. ఇతర రాష్ట్రాల్లో పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేమని సినీ వర్గాలు అంటున్నాయి.
Recommended Video
రూ.450 కోట్ల బడ్జెట్‌తో
ఎన్టీఆర్, రాంచరణ్ కలిసి నటించిన RRR మూవీలో అజయ్ దేవగన్, సముద్రఖని, హాలీవుడ్ తార డైసీ ఎడ్గర్ జోన్స్, ఆలియా భట్ తదితరులు నటించారు. డీవీవీ ఎంటర్‌టైనర్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని సుమారు రూ.450 కోట్ల వ్యయంతో ఈ చిత్రాన్నినిర్మించారు.


Click it and Unblock the Notifications











