twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మెగాస్టార్ ట్వీట్‌కు స్పందించిన ట్విట్టర్ సంస్థ.. సోషల్ మీడియాలో చిరు దూకుడు

    |

    సోషల్ మీడియాలో ఎంట్రీ ఇచ్చిన చిరు.. దూకుడును పెంచాడు. వెనువెంటనే ట్వీట్స్ చేస్తూ.. తన దూకుడు ప్రదర్శిస్తున్నాడు. మొదటి ట్వీట్‌లో ఉగాది శుభాకాంక్షలు చెబుతూ.. కరోనా పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తను వివరించాడు. ఇక వెంటనే రెండో ట్వీట్ చేశాడు. ప్రధాని తీసుకున్న 21 రోజుల లాక్ డౌన్ నిర్ణయాన్ని సమర్థించాడు.

    సోషల్ మీడియాలో గ్రాండ్ ఎంట్రీ..

    సోషల్ మీడియాలో గ్రాండ్ ఎంట్రీ..

    మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో ఎంట్రీ ఇస్తున్నాడన్న విషయం క్షణాల్లో వైరల్ అయింది. నిన్న సాయంత్రం ఈ విషయాన్ని వీడియో సందేశం ద్వారా ప్రకటించిన సంగతి తెలిసిందే. తన భావాలను, ఆలోచనలను అభిమానులతో పంచుకోవడానికి వస్తున్నా అంటూ తెలిపాడు.

    మొదటి ట్వీట్ కూడా అదే..

    మొదటి ట్వీట్ కూడా అదే..

    అందరికీ శార్వరి నామ ఉగాది శుభాకాంక్షలు. నా తోటి భారతీయులందరితో, తెలుగు ప్రజలంతో, నాకు అత్యంత ప్రియమైన అభిమానులందరితో నేరుగా ఈ వేదిక నుంచి మాట్లాడగలగటం నాకెంతో ఆనందంగా ఉందింటూ.. కరోనాపై తీసుకోవాల్సిన జాగ్రత్తను వివరించాడు.

    Recommended Video

    Megastar Chiranjeevi To Enter Social Media | నా భావాలు అన్నీ పంచుకోడానికి వస్తున్నా..!!
    ప్రధాని నిర్ణయానికి మద్దతు..

    ప్రధాని నిర్ణయానికి మద్దతు..

    21 రోజులు మనందరినీ ఇంట్లోనే ఉండమని మన భారత ప్రభుత్వం ఇచ్చిన ఆదేశం కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి అనివార్యమైన చర్య. ఈ క్లిష్ట సమయంలో మనం, మన కుటుంబాలు, మన దేశం సురక్షితంగా ఉండటానికి మన ప్రియ ప్రధాని నరేంద్రమోడీ, మన ప్రియ ముఖ్య మంత్రులు కేసీఆర్, జగన్ ఇచ్చే ఆదేశాలు పాటిద్దాం. ఇంటి పట్టునే ఉందాం.. సురక్షితంగా ఉందామని రెండో ట్వీట్ చేశాడు.

    స్పందించిన ట్విట్టర్ సంస్థ..

    మెగాస్టార్ చిరంజీవి చేసిన ఈ ట్వీట్‌కు స్పందించిన ట్విట్టర్ ఇండియా సంస్థ.. ‘చూశారా ట్విట్టర్‌లోకి ఎవరు వచ్చారో..మీరు చిరంజీవి మాటలను వింటున్నారు.. ఇంట్టోనే ఉండండి.. సురక్షితంగా ఉండండ'ని ట్వీట్ చేసింది. మరి మెగాస్టారా? మజాకా? అని ఫ్యాన్స్ సంబర పడిపోతున్నాడు. ఇక మూడో ట్వీట్ ఆర్ఆర్ఆర్ మోషన్ పోస్టర్ గురించి చేశాడు. కన్నుల పండుగగా, రోమాలు నిక్కబొడిచేలా ఉందని ప్రశంసించాడు.

    English summary
    Twitter India responda On chiranjeevi Tweet. It Says That Look who's on Twitter. You heard KChiruTweets , stay home and stay safe.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X