టార్గెట్ 'సమంత'.. ఫ్యామిలీ మ్యాన్2ని బ్యాన్ చేయాలని ట్వీట్లు.. ఆ లింక్ బయటపడడంతో!

తెలుగు ప్రేక్షకులే కాక అన్ని భాషల ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఫ్యామిలీ మాన్ 2 ట్రైలర్ ఈరోజు ఉదయం రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. సమంత అక్కినేని ఈ సిరీస్తో డిజిటల్ ఎంట్రీ ఇస్తోంది. గతంలో రిలీజ్ అయిన ఫ్యామిలీ మాన్ 1కి కొనసాగింపుగా రూపొందిన ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ ఇప్పుడు తమిళులకు కోపం తెప్పిస్తోంది. వారంతా సమంతను టార్గెట్ చేస్తూ ఈ వెబ్ సిరీస్ ను బ్యాన్ చేయాలని పెద్ద ఎత్తున కామెంట్ చేస్తున్నారు. ఆ వివరాల్లోకి వెళితే

సూపర్ హిట్ ఫ్యామిలీ మ్యాన్

సూపర్ హిట్ ఫ్యామిలీ మ్యాన్

మనోజ్ బాజ్ పేయి, ప్రియమణి, గుల్ పనాగ్ లాంటి వాళ్ళు కీలక పాత్రలలో నటించిన ఫ్యామిలీ మాన్ సీజన్ వన్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. తెలుగు దర్శక ద్వయం రాజ్ & డి.కె తెరకెక్కించిన ఈ సిరీస్ దేశవ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకుంది.. తీవ్రవాదాన్ని అరికట్టేందుకు ఇంటెలిజెన్స్ అధికారిగా పనిచేస్తున్న శ్రీకాంత్(మనోజ్ బాజ్పాయ్) చేసే సాహసాలే నేపథ్యంగా ఈ సిరీస్ తెరకెక్కించారు.

 అందుకే వెనకడుగు

అందుకే వెనకడుగు

మొదటి సిరీస్ సూపర్ హిట్ కావడంతో మేకర్స్ దీనికి కొనసాగింపుగా రెండో సిరీస్ కూడా రూపొందించారు.. నిజానికి ఈ సిరీస్ ఫిబ్రవరి నెలలో రిలీజ్ కావాల్సి ఉంది. అయితే అప్పటికే రిలీజయిన తాండవ్, అలాగే మీర్జాపూర్ వెబ్ సిరీస్ కి సంబంధించి అనేక వివాదాలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో అమెజాన్ ప్రైమ్ ఈ సిరీస్ రిలీజ్ వాయిదా వేసింది. ఎట్టకేలకు ఈ సిరీస్ జూన్ 4వ తేదీ నుంచి ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది.

అంచనాలు పెంచేస్తున్న ట్రైలర్

అంచనాలు పెంచేస్తున్న ట్రైలర్


ప్రకటించినట్టుగానే ఈ రోజు ఉదయం ఈ సిరీస్ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఊహించినట్టుగానే రిలీజ్ అయిన ట్రైలర్ ఈ సిరీస్ మీద అంచనాలు పెంచే విధంగా ఉంది. నిజానికి మొదటి సీజన్ అంతా ముంబై నేపథ్యంలో నడుస్తూ ఉంటుంది. కానీ సెకండ్ సీజన్ మొత్తం చెన్నై నేపథ్యంలో సాగనుంది. ఈ నేపథ్యంలోనే సమంత సహా కొంతమంది సౌత్ ఆర్టిస్టులను తీసుకున్నారు.

ఉగ్రవాదిగా సమంత

ఉగ్రవాదిగా సమంత


అసలు విషయానికి వస్తే ఈ సిరీస్ ట్రైలర్లో సమంత తమిళ్ లో మాట్లాడుతూ ఉండడమే కాక శ్రీలంకలో తమిళుల హక్కుల కోసం పోరాడిన లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం అనే ఉగ్రవాద సంస్థ తరపున పని చేస్తున్నట్లు చూపించారు. దీంతో తమిళ ట్విట్టర్ యూజర్స్ #Familyman2_Against_Tamils అనే హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. ఈ సిరీస్‌లో సమంతా రాజీ అనే శ్రీలంక తమిళ తిరుగుబాటుదారురాలిగా నటించింది. దీంతో పెద్ద ఎత్తున యూజర్స్ ఆమెను టార్గెట్ చేస్తున్నారు.

ఐఎస్ఐతో లింకులు

ఐఎస్ఐతో లింకులు

అలాగే తమిళుల కోసం పోరాడిన లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలంకి ఐఎస్ఐ ఉగ్రవాద సంస్థతో లింకులు ఉన్నట్లు ట్రైలర్ లో చూపించారు. దీంతో తమిళనాడు వాసులు అనవసరంగా ప్రపంచదేశాలకు ఎల్టీటీఈ మీద విద్వేషాలు రెచ్చగొట్టేలా రూపొందించారని పెద్ద ఎత్తున కామెంట్ చేస్తున్నారు. అంతే కాక శ్రీలంకలో తమిళ వాసుల కోసం పోరాడిన లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం సంస్థ అసలు టెర్రరిస్ట్ సంస్థ కాదని చెబుతూ పెద్ద ఎత్తున తమిళ్ యూజర్స్ కామెంట్ చేస్తున్నారు.

తమిళ నటి అయ్యుండి ఇలా ఎలా నటిస్తుందని సమంతను కూడా టార్గెట్ చేస్తున్నారు. తమిళులను టెర్రరిస్టులుగా చూపటమే కాక తమిళనాడు వ్యక్తులకు ఐఎస్ఐతో కనెక్షన్ ఉందని చెప్పడం దారుణం అని కామెంట్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X