For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  2.0 ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. రజనీ స్టయిల్ సూపర్, అక్షయ్ నటన హైలెట్.. భారత్‌కే గర్వంగా..

  |

  Recommended Video

  Robot 2.O First Review : Proud Moment Of Indian Cinema | Filmibeat Telugu

  ఇండియన్ సినీ హిస్టరీలోనే గర్వంగా చెప్పుకోవడానికి అవకాశం ఉన్న చిత్రంగా ప్రచారమైన 2.0 మూవీ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. భారీ సినిమాల రివ్యూలను ఒకరోజు ముందే చెప్పేసే సినీ క్రిటిక్ ఉమేర్ సంధూ 2.0 రివ్యూతో ముందుకొచ్చాడు. యూఏఈ ప్రాంతంలో సినీ విమర్శకుడిగా చలామణి అయ్యే ఉమేర్ అక్కడి సెన్సార్ బోర్డు రిపోర్టును ముందుగానే సోషల్ మీడియాలో పోస్ట్ చేసే హడావిడి చేస్తున్నాడు. ఇంతకీ ఉమేర్ సంధూ ఏమి చెప్పాడంటే...

   సూపర్ స్టార్ రజనీకాంత్ వన్ మ్యాన్ షో

  సూపర్ స్టార్ రజనీకాంత్ వన్ మ్యాన్ షో

  2.0 చిత్రమంతా సూపర్ స్టార్ రజనీకాంత్ వన్ మ్యాన్ షోగా ఉంది. అతడు నటించిన తీరు చూస్తే బాలీవుడ్‌లో గానీ, ఇతర హీరోలు ఎవరూగానీ అలా నటించలేరు. రజనీ స్టయిల్, నటన అద్భుతంగా ఉంది. హీరోయిన్ అమీ జాక్సన్ అద్భుతంగా తెరపైన కనిపించింది అని ఉమేర్ సంధూ ట్వీట్ చేశారు.

  అక్షయ్ కుమార్ నటన గురించి

  అక్షయ్ కుమార్ నటన గురించి

  ఇక అక్షయ్ కుమార్ విషయానికి వస్తే.. ఆయన నటన భయంకరంగా ఉంది. భీతినిగొలిపే ఆయన రూపం ప్రేక్షకులను భయపెట్టించడం ఖాయం. అతను తప్ప మరొకరు పోషించలేనంతగా విలన్ పాత్రలో ఒదిగిపోయాడు. పవర్‌ఫుల్ పాత్రతో ప్రేక్షకులను మాయ చేయడం ఖాయం అని ఉమేర్ సంధూ మరో ట్వీట్‌లో పేర్కొన్నారు.

  థగ్స్ దెబ్బ... 2.0 ఒప్పందానికి నో చెబుతున్న ఎగ్జిబిటర్లు!

   శంకర్ డైరెక్షన్ గురించి

  శంకర్ డైరెక్షన్ గురించి

  2.0 చిత్రంలోని పాత్రలను శంకర్ అద్బుతంగా తీర్చిదిద్దారు. చాలాకాలం ప్రేక్షకుల మనుసులో ఉండిపోతాయి. కష్టతరమైన సబ్జెక్ట్‌ను తీర్చిదిద్దని వైనం, అతడి విజన్, కార్యనిర్వాహణ తీరు ఆశ్చర్యానికి గురిచేస్తాయి. అతని విజన్ మాత్రమే పెద్దది కాదు. 2.0 అవుట్ పుట్ కూడా చాలా అద్భుతమైనది అంటూ మరో ట్వీట్ చేశారు.

  బెస్ట్ డైరెక్టర్‌గా శంకర్

  బెస్ట్ డైరెక్టర్‌గా శంకర్

  2.0 చిత్రంతో డైరెక్టర్‌గా శంకర్ దేశంలోనే బెస్ట్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకోవడం ఖాయం. అతని ప్రతిభ పాటవాలు, టేకింగ్ చూస్తే అది ఈ సారి మరింత స్పష్టమవుతుంది. ఈ చిత్రంతో అంతర్జాతీయంగా పేరు తెచ్చుకోవడం జరుగుతుంది.

   భారతీయ సినిమాకే 2.0 గర్వం

  భారతీయ సినిమాకే 2.0 గర్వం

  భారతీయ సినిమాకే 2.0 గర్వకారణంగా మారే చిత్రంగా నిలుస్తుంది. ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఇప్పటి వరకు కనీవినీ ఎరుగని సైంటిఫిక్ ఫిక్షన్ చిత్రంగా నిలచిపోతుంది. రోబోల కథతో వచ్చిన సినిమాలకు ఇది టెక్ట్స్ బుక్‌గా మారుతుంది.

  అద్భుతమైన కథ, కథనాలతో

  అద్భుతమైన కథ, కథనాలతో

  అండ్రాయిడ్ విప్లవంతో అందుబాటులోకి వచ్చిన మొబైల్ ఫోన్ల నేపథ్యంగా అద్భుతమైన కథ, ఎమోషన్స్‌తో శంకర్ ఈ సినిమాను రూపొందించాడు. కథనం థ్రిల్లింగ్‌గా ఉంటుంది. సన్నివేశాలు చాలా రిచ్‌గా కనిపిస్తాయి. యాక్షన్ సీన్లు సూపర్‌గా ఉంటాయి. ఇప్పటి వరకు సినీ ప్రేక్షకులు చూడి విధంగా వీఎఫ్ఎక్ట్స్ ఉంటాయి. ముఖ్యంగా రజనీకాంత్, అక్షయ్ కుమార్ పాత్రలు సినిమాకు వెన్నుముకగా నిలిచాయి అని ఉమేర్ సంధూ పేర్కొన్నారు.

  English summary
  Film critic Umair Sandhu has written first review of Shankars 2.0. She says that Simply " #2Point0 " is the Proud Moment 🙏 of #India !! Best Sci-Fi Film ever made in the History of Indian Cinema. Robot Series is a Textbook how to make a Solid Entertainer.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X