Don't Miss!
- News
అమరావతి కేసు విచారణ-సుప్రీం నిర్ణయంపై ఉత్కంఠ ? ఫాస్ట్ ట్రాక్ విజ్ఞప్తి, ఫిర్యాదుల నేపథ్యం !
- Finance
బిగ్ రిలీఫ్.. భారీగా తగ్గుతున్న బంగారం ధరలు; నేడు హైదరాబాద్, ప్రధాన నగరాల్లో ధరలిలా!!
- Technology
బెట్టింగులు, లోన్లు అంటూ ప్రజలను వేధిస్తున్న 230 యాప్ లు బ్యాన్!
- Sports
SA20 : దంచికొట్టిన సన్‌రైజర్స్ బ్యాటర్.. చిత్తుగా ఓడిన క్యాపిటల్స్!
- Lifestyle
Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం ఈ పనులు చేసిన తర్వాత తప్పనిసరిగా స్నానం చేయాలి
- Travel
సందర్శకులను కనువిందుచేసే కొల్లేరు బోటు షికారు!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
పవన్ - రానా సినిమాలో డైరెక్టర్ సర్‌ప్రైజింగ్ రోల్: ఆయన ఉన్న ఎపిసోడ్ హైలైట్
సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత జెట్ స్పీడుతో దూసుకుపోతున్నాడు టాలీవుడ్ టాప్ హీరో పవర్ స్టార్ పవన్ కల్యాణ్. 'వకీల్ సాబ్' తర్వాత ప్రస్తుతం అతడు రెండు సినిమాలను పట్టాలపైకి ఎక్కించేశాడు. అందులో మలయాళ సూపర్ హిట్ మూవీ 'అయ్యప్పనుమ్ కోషియం' రీమేక్ ఒకటి. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ సినిమాను విలక్షణ చిత్రాల దర్శకుడు సాగర్ కే చంద్ర తెరకెక్కిస్తున్నాడు. ఇందులో టాలీవుడ్ హంక్ దగ్గుబాటి రానా కూడా నటిస్తున్నాడు. ఈ సినిమా గురించి తాజాగా ఓ ఆసక్తికరమైన వార్త ఫిలిం నగర్ ఏరియాలో తెగ చక్కర్లు కొడుతోంది.
పవన్ కల్యాణ్ - దగ్గుబాటి రానా కలయికలో రాబోతున్న ఈ భారీ మల్టీస్టారర్ మూవీలో ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్ కూడా నటిస్తున్నట్లు ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. అయితే, దీనిపై చిత్ర యూనిట్ నుంచి ఎటువంటి స్పందనా రాలేదు. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో ఆయన నటించేది నిజమేనట. ఇప్పటికే వినాయక్‌కు సంబంధించిన షూటింగ్ పార్ట్ కూడా పూర్తయిందని తెలుస్తోంది. అంతేకాదు, ఇందులో ఆయన చేసిన పాత్ర ఎంతో హైలైట్‌గా ఉంటుందని అంటున్నారు. కథను మలుపు తిప్పే విధంగా ఈ రోల్‌ను క్రియేట్ చేశారని సమాచారం.

పవర్‌ఫుల్ పోలీస్.. లోకల్ డాన్‌కు మధ్య జరిగే ఈగో గొడవలతో ఈ సినిమా రూపొందుతోంది. మలయాళ కథను తెలుగు నేటివిటీకి అనుగుణంగా మార్చి దీన్ని తీస్తున్నారు. పోలీస్ పాత్రలో పవన్.. డాన్ పాత్రలో రానా నటిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాను సూర్య దేవర నాగ వంశీ నిర్మిస్తున్నాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకు మాటలు అందిస్తుండటంతో పాటు, పర్వవేక్షణ బాధ్యతలు కూడా తీసుకున్న విషయం తెలిసిందే. ఇక, ఈ చిత్రానికి 'బిల్లా రంగ' అనే టైటిల్ పరిశీలనలో ఉంది. థమన్ సంగీతం అందిస్తున్నాడు.