తండ్రైన వరుణ్ తేజ్.. పండంటి బిడ్డకు జన్మనిచ్చిన లావణ్య త్రిపాఠి
మెగా కుటుంబంలో మరోసారి ఆనంద క్షణాలు వెల్లివిరిసాయి. మెగా హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి దంపతులు ఓ పండంటి బిడ్డకు జన్మిచ్చారు. తమ ఇంటికి వారసుడు రావడంతో మెగా ఫ్యామిలీ సంతోషంగా పండుగ చేసుకొన్నారు. తల్లి, చిన్నారి ఇద్దరు క్షేమంగా ఉన్నారు అని కుటుంబ సభ్యులు తెలిపారు.

వరుణ్, లావణ్య త్రిపాఠి కొద్దికాలంగా ప్రేమలో ఉన్న వారు.. ఇరు కుటుంబాలను ఒప్పించారు. ఆ తర్వాత 2023 సంవత్సరం నవంబర్‌లో వివాహం చేసుకొన్నారు. కొద్ది నెలల క్రితం తాను గర్భవతిని అని లావణ్య త్రిపాఠి సంకేతాలిచ్చింది. అయితే సెప్టెంబర్ 10వ తేదీ ఉదయం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. లావణ్య త్రిపాఠి సీ సెక్షన్ లేకుండా నార్మల్ డెలివరీ ద్వారా ప్రసవించారు. త్వరలోనే తల్లి, చిన్నారి బాలుడిని డిశ్చార్జ్ చేస్తారు అని సన్నిహితులు తెలిపారు.
తొలి బిడ్డకు జన్మనిచ్చిన వరుణ్, లావణ్యలకు కుటుంబ సభ్యులతోపాటు.. స్నేహితులు, సన్నిహితుల, సినీ వర్గాలు, మీడియా వర్గాలు శుభాకాంక్షలు తెలిపారు. మెగా కుటుంబంలో మరో వారసుడు వచ్చాడని అభిమానులు ఆనందంలో మునిగిపోయారు.

ఇదిలా ఉండగా, వరుణ్ తేజ్ ప్రస్తుతం హారర్ కామెడీ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాకు మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక లావణ్య టన్నెల్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 19వ తేదీన రిలీజ్ కానున్నది.
హైదరాబాద్‌లోని ప్రైవేట్ హాస్పిటల్‌లో ప్రసవించిన లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్‌కు చిరంజీవి స్వయంగా వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. చిన్నారి చేతుల్లోకి తీసుకొని ముద్దాడారు. నూరేళ్లు వర్ధిల్లాలి అని ఆశీర్వదించారు.


Click it and Unblock the Notifications











