Just In
Don't Miss!
- Lifestyle
గురువారం దినఫలాలు : సింహరాశి వారు ఈరోజు ఒకేసారి చాలా పనులు చేయాల్సి ఉంటుంది...!
- News
జో బైడెన్ ప్రమాణ స్వీకారోత్సవంలో మెరిసిన నల్లజాతి యువ కవయిత్రి అమండా గోర్మాన్
- Finance
డిసెంబర్ నెలలో గూగుల్ పేను వెనక్కి నెట్టిన ఫోన్ పే
- Sports
IPL 2021: తెలుగు ప్లేయర్లను వదులుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్!
- Automobiles
భారత్‌లో కొత్త వోల్వో ఎస్60 సెడాన్ విడుదల : ధర & ఇతర వివరాలు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
2020 ఓ సవాల్.. మంచి, చెడుల అనుభూతులతో.. ఓ గుణపాఠం.. వరుణ్ తేజ్ న్యూ ఇయర్ విషెస్
మెగా హీరో వరుణ్ తేజ్‌కు 2020 ప్రత్యేకమైనది. మంచి, చెడు అంశాల కలయికతో గడిచిపోయింది. చెల్లెలు నిహారిక వివాహం సంతోషాన్ని కలిగిస్తే.. తనకు కరోనావైరస్ పాజిటివ్ అని తేలడం కాస్త బాధ కలిగింది. ఇలాంటి నేపథ్యంలో వరుణ్ తేజ్ 2020 సంవత్సరానికి గుడ్‌బై చెబుతూ.. 2021 సంవత్సరానికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ట్విట్టర్‌లో స్పందిస్తూ..
జీవితంలో 2020 చాలా డిఫరెంట్. ప్రతీ ఏడాది మాదిరిగానే చాలా విషయాలు నేర్చుకొన్నాను. ఓ రకమైన ఫైటింగ్ చేశాను. కరోనావైరస్ లాక్‌డౌన్ నన్నే కాకుండా ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. అంతేకాకుండా నాకు కెరీర్ పరంగా, ఎమోషనల్‌గా ఓ ఛాలెంజ్‌ను విసిరింది. ఆ ఛాలెంజ్‌ను ఎదుర్కోవడానికి, నాకు నేను ప్రూవ్ చేసుకోవడానికి ఎప్పుడూలేని అనుభవాలను చవి చూశాను. లాక్ డౌన్ కారణంగా నాలుగు గోడలకే పరిమితమయ్యాను. నాకు నచ్చిన వారితో గడిపే అవకాశం వచ్చింది. నా గురించి నేను తెలుసుకొనే, ఆంతర్మథనం చెందే అవకాశం లభించింది.

ఇంకా ఈ ప్రపంచంలో బతికి ఉన్నందుకు, శ్వాస తీసుకోనే అవకాశం అదృష్టంగా భావిస్తున్నాను. నాకు నేనుగా అర్దం చేసుకొనేందుకు ప్రయత్నించాను అని వరుణ్ తేజ్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
మీకు, నాకు, ప్రతీ ఒక్కరి జీవితంలో 2021 అద్భుతంగా ఉండాలి. ఒకరికొకరు సహకరించుకొనే విధంగా ఉండాలని కోరుకొంటున్నాను. హ్యాపీ న్యూ ఇయర్ అంటూ వరుణ్ ట్వీట్‌లో శుభాకాంక్షలు తెలిపారు.