For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  SAINDHAV: హై ఓల్టేజ్ గెటప్‌లో వెంకటేష్.. హిట్టు బొమ్మ అనేంత రేంజ్‌లోనే!

  |

  తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోలలో విక్టరీ వెంకటేష్ ఒకరు. బడా ప్రొడ్యూసర్ కుమారుడిగా సినిమాల్లోకి వచ్చినా.. తక్కువ టైంలోనే తన టాలెంట్‌ను చూపించుకుని స్టార్ హీరోగా ఎదిగిపోయారు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్‌కు నచ్చే సినిమాలు చేస్తూ అలరించారు. చాలా కాలం పాటు వరుసగా సినిమాల మీద సినిమాలు చేసిన ఆయన.. గత ఏడాది 'ఎఫ్3'తో మాత్రమే ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కానీ, ఈ మధ్యన మాత్రం ఈ సీనియర్ హీరో పెద్దగా ప్రాజెక్టులను పట్టాలెక్కించడం లేదు. దీనికితోడు వెంకీ సినిమాలకు గ్యాప్ ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. దీంతో ఆయన ఫ్యాన్స్ నిరాశగా ఉన్నారు.

  బిగ్ బాస్ హమీదా ఓవర్ డోస్ బోల్డు షో: ఎద అందాలను ఆరబోస్తూ ఘాటుగా!

  ఎవరూ ఊహించని విధంగా ఈ మధ్య కాలంలో సినిమాలకు గ్యాప్ ఇచ్చిన విక్టరీ వెంకటేష్.. ఇప్పుడు 'హిట్' ఫ్రాంచైజీ డైరెక్టర్ శైలేష్ కొలనుతో సినిమా చేయబోతున్నారు. రెండు రోజుల క్రితమే ఈ చిత్రానికి సంబంధించిన ప్రకటన వెలువడింది. అంతేకాదు, త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేస్తామని ప్రకటించింది. అందుకు అనుగుణంగానే తాజాగా ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ వీడియోను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇక, ఈ మూవీకి 'సైంధవ్' అనే టైటిల్‌ను పెట్టారు. ఇందులో విక్టరీ వెంకటేష్ హై ఓల్టేజ్ పవర్‌ఫుల్ గెటప్‌తో దర్శనమిచ్చాడు.

  Venkatesh and Sailesh Kolanu SAINDHAV Movie Glimpse Released

  'సైంధవ్' మూవీ గ్లింప్స్ వీడియోలో విక్టరీ వెంకటేష్ కంటైనర్లు ఉన్న ఒక ప్రదేశంలో చేతిలో ఒక బయో డ్రగ్‌ను పట్టుకుని నడుచుకుంటూ కనిపించాడు. అంతేకాదు, దానితో దాడి చేసేందుకు కంటైనర్‌లో గన్‌ను వెతికి తీసుకు వచ్చాడు. చివర్లో ఈ సీనియర్ హీరో 'నేను ఇక్కడే ఉంటాను రా.. ఎక్కడికీ వెళ్లను.. రమ్మను' అంటూ డైలాగ్ చెప్పారు. ఆ తర్వాత ఆయన కొట్టి పడేసిన రౌడీల విజువల్స్ చూపించారు. మొత్తంగా ఈ గ్లింప్స్ వీడియో అన్ని వర్గాల వాళ్లను ఆకట్టుకునేలా డిజైన్ చేశారు. మరీ ముఖ్యంగా ఇందులో విజువల్స్, బ్యాగ్రౌండ్ స్కోర్, వెంకీ లుక్స్ ఆకట్టుకున్నాయి. దీంతో ఈ వీడియో వైరల్ అవుతోంది.

  Pathaan Twitter Review: పఠాన్ మూవీకి అలాంటి టాక్.. ఎవరూ ఊహించని విధంగా.. ఇంతకీ షారూఖ్‌ కొట్టాడా!

  దగ్గుబాటి వెంకటేష్ - శైలేష్ కొలను కాంబినేషన్‌లో రాబోతున్న 'సైంధవ్' మూవీని పాన్ ఇండియా రేంజ్‌లో తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లో రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. అలాగే, నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై వెంకట్ బోయినపల్లి దీన్ని నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ మొదలు కాబోతుంది.

  English summary
  Daggubati Venkatesh will Start SAINDHAV Movie With HIT Series Director Sailesh Kolanu. Recently This Movie Title Glimpse Was Released.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X