ఆయన మరణంతో విషాదంలో విజయ్ దేవరకొండ.. కన్నీళ్ళతో ప్రార్ధిస్తా అంటూ !
తెలుగులో అర్జున్ రెడ్డి సినిమాతో సెన్సేషన్ సృష్టించిన విజయ్ దేవరకొండ ప్రస్తుతం రౌడీ హీరోగా చలామణి అవుతున్నాడు. బయటికి ఏ మాత్రం ఎమోషన్స్ లేవు అన్నట్టు యాంగ్రీ లుక్ లో కనిపించే ఈ రౌడీ హీరో ఎమోషనల్ అయ్యాడు. దానికి కారణం తనను ఎంతగానో ప్రేమించిన ఒక అభిమాని కన్నుమూయడమే. కొద్ది రోజుల క్రితం విజయ్ దేవరకొండ బెడ్ మీద లేవలేకుండా ఉన్న ఒక పేషెంట్ తో వీడియో కాల్ మాట్లాడుతున్న వీడియో ఒకటి వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ వీడియోలో కనిపించిన అభిమాని ఈరోజు సాయంత్రం కన్నుమూశారు. హేమంత్ అనే ఒక వ్యక్తి లుకేమియా క్యాన్సర్ తో బాధపడుతున్నారు.
విజయ్ దేవరకొండకు వీరాభిమాని అయిన హేమంత్ తన చివరి కోరికగా విజయ్ తో మాట్లాడాలని కోరారు. దీంతో విజయ్ దేవరకొండ వద్దకు ఈ విషయం చేరవేయగా ఆయన హేమంత్ తో వీడియో కాల్ లో మాట్లాడారు. మాట్లాడిన సమయంలో హేమంత్ కొన్ని టీషర్ట్స్ కూడా కావాలని విజయ్ ని అడిగారు. అయితే హేమంత్ అడిగిన టీషర్ట్స్ ఉన్నాయో లేదో తెలియదు అని చెప్పిన దేవరకొండ ప్రస్తుతం ఉన్న లేటెస్ట్ ట్రెండ్ కి తగ్గట్టు కొన్ని టీషర్ట్స్ పంపిస్తాను అని చెప్పారు. ఆయన చెప్పినట్లుగానే టి షర్ట్స్ కూడా పంపించారు.. అయితే దురదృష్టవశాత్తూ హేమంత్ టీషర్ట్స్ వేసుకోకుండానే దూరమైపోయారు..

ఈ విషయాన్ని తెలుసుకుని విజయ్ దేవరకొండ తన సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని పంచుకుని ఎమోషనల్ అయ్యారు. ''ఐ మిస్ యు హేమంత్, నేను నీతో మాట్లాడినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది, ఆ సమయంలో నేను నీ మధురమైన చిరునవ్వును చూశా, నీ ప్రేమను నేను ఫీల్ అయ్యాను, అదే ప్రేమను నీకు కొంత ఇస్తాను'' అని పేర్కొన్నారు. నా కన్నీళ్ళతో నేను ప్రస్తుతం నీ కోసం ప్రార్థన చేస్తున్నాను, నా దాకా హేమంత్ చేరుకునేలా చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు'' అని విజయ్ పేర్కొన్నారు. 'ఐ మిస్ యు హేమంత్, నేను ఈ జ్ఞాపకాన్ని జీవితాంతం గుర్తుంచుకుంటానని విజయ్ ట్వీట్ చేశారు.


Click it and Unblock the Notifications











