Just In
- 5 hrs ago
అందుకే ఆ టైటిల్ పెట్టాం.. ‘చెప్పినా ఎవరూ నమ్మరు’పై హీరో కమ్ డైరెక్టర్ కామెంట్స్
- 5 hrs ago
పబ్లిక్ ప్లేస్‌లో ఘాటు ముద్దులు.. లిప్ కిస్‌తో భర్తతో శ్రియ రచ్చ
- 6 hrs ago
మళ్లీ రాజకీయాల్లోకి చిరంజీవి.. పవన్ కల్యాణ్‌కు అండగా మెగాస్టార్.. జనసేన నేత సంచలన ప్రకటన!
- 6 hrs ago
శ్రీను వైట్ల ఓ శాడిస్ట్.. మంచు విష్ణు సెన్సేషనల్ కామెంట్స్
Don't Miss!
- News
కూరగాయాలకు మద్దతు ధర, సీఎం కేసీఆర్ స్పష్టీకరణ..?
- Finance
ఆల్ టైమ్ గరిష్టంతో రూ.7300 తక్కువకు బంగారం, ఫెడ్ పాలసీకి ముందు రూ.49,000 దిగువకు
- Sports
ఆ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి.. కమిన్స్‌ను మూడు ఫార్మాట్లకు కెప్టెన్‌ను చేయండి: క్లార్క్
- Automobiles
స్విఫ్ట్, బాలెనో, ఐ20 వంటి మోడళ్లకు వణుకు పుట్టిస్తున్న టాటా ఆల్ట్రోజ్
- Lifestyle
Study : గాలి కాలుష్యం వల్ల అబార్షన్లు పెరిగే ప్రమాదముందట...! బీకేర్ ఫుల్ లేడీస్...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
విజయ్ దేవరకొండ సినిమాపై షాకింగ్ అప్‌డేట్: అలా అయితే ఇప్పట్లో కష్టమే
'పెళ్లి చూపులు' అనే సినిమాతో హీరోగా పరిచయమై.. 'అర్జున్ రెడ్డి'తో తెలుగు రాష్ట్రాల్లో ఎనలేని క్రేజ్‌ను సంపాదించుకున్నాడు క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండ. కెరీర్ ఆరంభంలోనే భారీ విజయాలను అందుకున్న ఈ కుర్ర హీరో.. ఇటీవలి కాలంలో 'డియర్ కామ్రేడ్', 'వరల్డ్ ఫేమస్ లవర్' వరుస పరాజయాలను చవి చూశాడు. ఈ క్రమంలోనే అతడు ప్రస్తుతం డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తున్న 'ఫైటర్'లో నటిస్తున్నాడు. పాన్ ఇండియా రేంజ్‌లో రాబోతున్న ఈ సినిమాను పూరీ, ఛార్మీలతో పాటు బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ నిర్మిస్తున్నాడు.
మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంతో సాగే ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో ప్రారంభం అయింది. ముంబైలో వేసిన ప్రత్యేకమైన సెట్‌లో కీలకమైన పార్ట్‌ను చిత్రీకరించారు. అయితే, కరోనా వైరస్ ప్రభావంతో సినిమా షూటింగ్‌కు అంతరాయం ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో డిసెంబర్ రెండో వారం నుంచి చిత్రీకరణ పున: ప్రారంభించాలని చిత్ర యూనిట్ డిసైడ్ అయింది. తాజా సమాచారం ప్రకారం.. ఇది మరోసారి వాయిదా పడిందట. ముంబైలో పరిస్థితులు ఇంకా సర్ధుబాటు కాకపోవడంతో, జనవరి ఫస్ట్ వీక్ నుంచి షూటింగ్ మొదలెట్టాలని నిర్ణయించుకున్నాడట పూరీ జగన్నాథ్. అదే జరిగితే సినిమా విడుదల కూడా మరింత ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి.

ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ఫైటర్‌గా కనిపించబోతున్నాడట. అలాగే, మరో ముఖ్యమైన రోల్‌లోనూ నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాకు 'లైగర్' అనే టైటిల్ ఫిక్స్ చేయబోతున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. ఇక, ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తుండగా, సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ కీలక పాత్రను పోషిస్తున్నారు. వీళ్లతో పాటు మరికొందరు బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ పరిశ్రమలకు చెందిన ప్రముఖులు నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.