ఒకేసారి ముగ్గురితో విజయ్ దేవరకొండ రొమాన్స్.. కొత్త మూవీలో విదేశీ సరుకు!

గీతా గోవిందం, నోటా చిత్రాల తర్వాత తెలుగులో మరో చిత్రానికి శ్రీకారం చుట్టబోతున్నారు. ఇటీవల విడుదలైన నోటా చిత్రానికి పెద్దగా రెస్పాన్స్ రాకపోవడంతో డియర్ కామ్రెడ్‌తోపాటు మరో సినిమాను పరుగులు పెట్టిస్తున్నాడు. తన తదుపరి చిత్రంలో ముగ్గురు హీరోయిన్లతో రొమాన్స్ చేయడానికి సిద్ధం కావడం అభిమాన, సినీ వర్గాల్లో ఆసక్తిని రేపింది. విజయ్ దేవరకొండ నటించే తదుపరి చిత్రానికి సంబంధించిన సినిమా వివరాలు ఇవే..

 అక్టోబర్ 18న ముహుర్తం

అక్టోబర్ 18న ముహుర్తం

ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న డియర్ కామ్రేడ్ పక్కన పెడితే.. విజయ్ దేవరకొండ నెక్ట్స్ మూవీకి క్రాంతి మాధవ్ దర్శకుడిగా వ్యవహరించనున్నారు. ఈ చిత్రం ప్రముఖ నిర్మాణ సంస్థ క్రియేటివ్ కమర్షియల్స్ మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కేఏ వల్లభ రూపొందిస్తున్నారు. ఈ చిత్రం దసరా రోజున అంటే అక్టోబర్ 18న ముహుర్తాన్ని నిర్ణయించారు.

ముగ్గురు హీరోయిన్లు వీరే

ముగ్గురు హీరోయిన్లు వీరే

ఇక ముగ్గురు హీరోయిన్ల విషయానికి వస్తే విజయ్ దేవరకొండ సరసన రాశీఖన్నా, ఐశ్వర్య రాజేశ్, బ్రెజిలియన్ మోడల్ ఇజబెల్లి లిటె నటించనున్నారు. ఈ చిత్రానికి గీతా గోవింద ఫేం గోపి సుందర్ మ్యూజిక్ రూపొందిస్తున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ వివరాలు మీడియలోకి రాగానే క్రేజీ సినిమాగా మారిపోయింది.

రాశీఖన్నా తొలిసారి

రాశీఖన్నా తొలిసారి

క్రేజీ హీరో విజయ్ దేవరకొండ సరసన రాశీఖన్నా నటించడం ఇదే మొదటిసారి. గతంలో ఎన్టీఆర్, రవితేజ, వరుణ్ తేజ్‌తో జతకట్టి హిట్లు కొట్టేసిన సంగతి తెలిసిందే. ఐశ్వర్య రాజేశ్ తమిళంలో పాపులర్ హీరోయిన్‌గా ముద్ర వేసుకొన్నది. తాజాగా నవాబ్‌ చిత్రంలో మంచి నటన ప్రదర్శించి విమర్శకుల ప్రశంసలు అందుకొన్నది.

బ్రెజిల్ భామ లీటేతో

బ్రెజిల్ భామ లీటేతో

ఇక బ్రెజిలియన్ మోడల్ ఇజబెల్లే లీటే బాలీవుడ్ చిత్రాల్లో నటించింది. అమీర్ ఖాన్ నటించిన తలాష్ చిత్రం ద్వారా బాలీవుడ్‌కు పరిచయమైంది. ఆ తర్వాత సిక్ట్సీన్, పురానీ జీన్స్ చిత్రాల్లో నటించింది. కానీ సక్సెస్ కొట్టలేకపోవడంతో ప్రేక్షకులను ఆకట్టుకోలేక రేసులో వెనుకబడి పోయింది. ప్రస్తుతం తెలుగులో తన అదృష్టాన్ని పరీక్షించుకొనేందుకు విజయ్ దేవరకొండతో జతకట్టింది.

నోటాతో విజయ్‌కి బ్రేక్

నోటాతో విజయ్‌కి బ్రేక్

వరుస విజయాలతో దూసుకెళ్తున్న విజయ్ దేవరకొండకు నోటా బ్రేక్ వేసింది. విజయ్ నటనకు విమర్శకుల ప్రశంసలు పొందిన బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం చతికిలపడింది. ప్రస్తుత మరో సక్సెస్‌ను ఖాతాలో వేసుకొనేందుకు మళ్లీ మళ్లీ ఇది రాని రోజు చిత్రం ఫేం క్రాంతిమాధవ్‌తో జతకట్టాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X